ETV Bharat Prathidwani on Ceasefire in Israel Hamas War : రావణకాష్టంలా రగులుతున్న ఇజ్రాయేల్ - హమాస్ మధ్య యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏడాది 3 నెలలుగా జరుగుతున్న భీకర పోరాటంలో శిథిలాల దిబ్బగా మారిన గాజాలో ఎట్టకేలకు శాంతి వీచికలు కనిపిస్తున్నాయి. అంతుదరి లేని ప్రాణ నష్టం, ఆస్తి నష్టం తగ్గించడం, లక్షలాది మంది జీవితాలను సాధారణ స్థితికి తీసుకురావడమే లక్ష్యంగా ఎట్టకేలకు కాల్పుల విరమణ వైపు అడుగులు పడ్డాయి. మరి గడిచిన 15 నెలలుగా అక్కడ ఏం జరిగింది? ఇంతకాలం తగ్గేదే లే అంటూ వచ్చిన ఇజ్రాయేల్-హమాస్‌ను శాంతి దిశగా నడిపించిన కారణాలు ఏమిటి? ఈ విషయంలో అమెరికా ఏం చేసింది? ఇక్కడితో కథ సుఖాంతం అవుతుందా? బందీల విడుదల, యుద్ధానికి ముగింపు, ప్రాంతీయ స్థిరత్వాల విషయంలో ఇకపై ఏం జరగనుంది ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
చర్చలో పాల్గొంటున్న వారు : -
1) డా. కన్నెగంటి రమేష్
అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు
ఆస్కి నేషనల్ సెక్యూరిటీ స్టడీస్, ఇండియా ఫారిన్ రిలేషన్స్ సెంటర్ డైరెక్టర్
హైదరాబాద్
2) ప్రొ. జయచంద్రారెడ్డి, తిరుపతి ఎస్వీయూ
సెంటర్‌ఫర్ సౌత్ఈస్ట్ ఏసియా&పసిఫిక్ స్టడీస్ మాజీ డైరెక్టర్
తిరుపతి