Prathidhwani Debate on Drugs in Telangana : హైదరాబాద్ నగరానికి పరిమితమైన డ్రగ్స్, మత్తుపదార్థాల విషసంస్కృతి ఇప్పుడు జిల్లాలకు కూడా పాకుతోంది. జిల్లా కేంద్రాలు, పట్టణాల్లోని కాలేజీలు లక్ష్యంగా మత్తుపదార్థాల విక్రయాలు విస్తరిస్తున్నాయి. మత్తపదార్థాల మాఫియా వీటిని చాక్లెట్లు, తినుబండారాల రూపంలో సరఫరా చేస్తోంది. వాటిని గుర్తించలేని పిల్లలు, యువత తెలియకుండానే మాదకద్రవ్యాల వ్యసనం బారిన పడుతున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ మాట వినిపించవద్దని కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. దానికి అనుగుణంగా పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టారు.
కాలేజీలే లక్ష్యంగా డ్రగ్స్ విక్రయాలు - ఈ మత్తు నుంచి బయటపడేదెలా? - Drugs Supplying control - DRUGS SUPPLYING CONTROL
Prathidhwani Debate on Drugs in Telangana : హైదరాబాద్ నగరానికి పరిమితమైన డ్రగ్స్, మత్తుపదార్థాల విషసంస్కృతి ఇప్పుడు జిల్లాలకు కూడా పాకుతోంది. జిల్లా కేంద్రాలు, పట్టణాల్లోని కాలేజీలు లక్ష్యంగా మత్తుపదార్థాల విక్రయాలు విస్తరిస్తున్నాయి. మత్తపదార్థాల మాఫియా వీటిని చాక్లెట్లు, తినుబండారాల రూపంలో సరఫరా చేస్తోంది. వాటిని గుర్తించలేని పిల్లలు, యువత తెలియకుండానే మాదకద్రవ్యాల వ్యసనం బారిన పడుతున్నారు. డ్రగ్స్ విషవలయంలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు ఎలాంటి వ్యవస్థలు పనిచేస్తున్నాయనే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.

Published : Mar 26, 2024, 9:59 AM IST
మత్తుపదార్థాల తయారీని, రవాణాను అరికట్టడంలో పోలీసుల ప్రయత్నాలు ఎలా ఉన్నాయి. డ్రగ్స్‌రహిత సమాజం నిర్మాణం కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో విద్యాసంస్థలు, తల్లిదండ్రులు నిర్వహించాల్సిన పాత్ర ఎలా ఉండాలి. అయితే డ్రగ్స్ సమస్యను తీవ్రంగా పరిగణిస్తున్న ప్రభుత్వం వాటిని నిరోధించేందుకు యాంటీ నార్కోటిక్స్ కమిటీలను ఏర్పాటు చేస్తోంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మత్తుపదార్థాల వినియోగం ఏ స్థాయిలో ఉంది? వాటి వల్ల జరుగుతున్న అనర్థాలేంటి? డ్రగ్స్ విషవలయంలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు ఎలాంటి వ్యవస్థలు పనిచేస్తున్నాయనే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.