తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

శ్రీవారి భక్తులకు అద్భుతమైన శుభవార్త - తిరుపతి లడ్డూ మీ ఊళ్లోనే లభిస్తుంది! - TTD Srivari Laddus to Devotees - TTD SRIVARI LADDUS TO DEVOTEES

TTD EO: శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్​న్యూస్​ చెప్పింది. తిరుమల వెళ్లలేని భక్తులకు స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

TTD EO on Srivari Laddus to Devotees
TTD EO on Srivari Laddus to Devotees (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 5, 2024, 1:42 PM IST

TTD EO on Srivari Laddus to Devotees :తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనం అనంతరం.. భక్తులు ఎంతో ఇష్టంగా ఎదురు చూసేది స్వామివారి లడ్డూ ప్రసాదం కోసమే అంటే అతిశయోక్తి కాదు. స్వచ్ఛమైన నేతితో తయారు చేసే లడ్డూ ప్రసాదం ఎంతో మధురంగా ఉంటుంది. అలాంటి లడ్డూ ప్రసాదం కావాలంటే.. మనమే తిరుమల వెళ్తేనో, లేదంటే తెలిసిన వారు వెళ్లి వస్తేనో తప్ప సాధ్యం కాదు. ఈ పరిస్థితిని మార్చేస్తోంది టీటీడీ. అవును.. తిరుమలకు వెళ్లలేని శ్రీవారి భక్తులకు తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అందించే ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా.. తిరుమలతోపాటుగా పలు దేవాలయాల్లో తిరుమల లడ్డూను అందుబాటులో ఉంచనుంది. ఈ విషయాన్ని టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు.

విజయవాడ, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిందని.. ఈ క్రమంలోనే శ్రీవారి భక్తుల విజ్ఞప్తి మేరకు టీటీడీ స్థానిక ఆలయాలు, సమాచార కేంద్రాలలో కూడా తిరుమల లడ్డూ ప్రసాదాలను విక్రయిస్తున్నట్లు ఈవో శ్యామలరావు చెప్పారు. ఆ జాబితాలో ఉన్న ప్రదేశాలు ఇవే..

  • తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం
  • తిరుపతిలోని కోదండరామస్వామి ఆలయం
  • గోవిందరాజస్వామి ఆలయం
  • శ్రీనివాసమంగాపురంలో ఉండే కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయం
  • అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయం
  • ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం
  • దేవుని కడప
  • హైదరాబాద్‌లోని హిమాయత్ నగర్, జూబ్లీహిల్స్
  • అమరావతి
  • విజయవాడ
  • రాజమండ్రి
  • పిఠాపురం
  • విశాఖపట్నం
  • రంపచోడవరం
  • చెన్నైలో ఉండే శ్రీవారి ఆలయాలు
  • బెంగుళూరు, వేలూరులలోని టీటీడీ సమాచార కేంద్రాలు

శ్రీవారి భక్తులకు ముఖ్యగమనిక - మారిన తిరుమల లడ్డూ రూల్స్! మీకు తెలుసా?

మరింత రుచికరంగా శ్రీవారి లడ్డూలు:శ్రీవారి భక్తులకు మరింత రుచికరమైన లడ్డూ ప్రసాదం అందించేందుకు నాణ్యమైన ఆవు నెయ్యి కొనుగోలు చేస్తున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. గతంలో నాణ్యత, రుచి, వాసనలేని ఆవు నెయ్యిని సరఫరా చేసేవారిని.. దాని ఫలితంగా లడ్డూ నాణ్యత తగ్గిందన్నారు. అయితే.. తాము లడ్డూ నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టామని, నాణ్యమైన నెయ్యి ద్వారా లడ్డూలు తయారుచేయిస్తున్నామని వెల్లడించారు. టీటీడీలో నూతనంగా అత్యాధునిక ల్యాబరేటరీ ఏర్పాటు చేస్తున్నామని.. సిబ్బందికి మైసూర్​లో శిక్షణ ఇస్తున్నామన్నారు. అలాగే నాణ్యమైన నెయ్యి కొనుగోలు కోసం నలుగురు ప్రముఖ డైరీ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కర్నాటక కోపరేటివ్ మిల్క్ ప్రాడెక్ట్ కంపెనీ నుంచి నేరుగా నెయ్యిని కొనుగోలు చేస్తున్నట్లు ఈవో వివరించారు.

సంపూర్ణ పుణ్యఫలం లభించాలంటే - ఈ ఆలయాలకు వెళ్లాకే తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలి! - Right Sequence of Tirumala Tour

ABOUT THE AUTHOR

...view details