How To Make Mutton Chudwa Recipe: నాన్‌వెజ్‌లో ఎన్ని రకాలున్నా.. మటన్ లెక్కే వేరు. ఆ టేస్టే వేరు. అయితే.. చాలా మంది ఇంట్లోకి మటన్ ఎప్పుడు తీసుకొచ్చినా.. రెగ్యులర్ కర్రీ చేసుకుంటారు. లేదంటే ఫ్రై చేసుకుంటుంటారు. ఇకపోతే అప్పడప్పుడూ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలని మటన్ పచ్చడి పెట్టుకుంటుంటారు. అయితే.. ఎప్పుడూ ఒకే రకం తింటే బోర్ కొడుతుంది. అందుకే.. ఈసారి "మటన్ ఛుడ్వా" ట్రై చేయండి. పేరే కాదు.. ఈ రెసిపీ కూడా చాలా కొత్తగా ఉంటుంది! దీని తయారీ విధానమేంటో ఈ స్టోరీలో చూద్దాం..
కావాల్సిన పదార్ధాలు..
- లేత మాంసం - 1 kg
- అల్లం వెల్లులి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
- ధనియాల పొడి - 1 టేబుల్ స్పూన్
- వేయించిన జీలకర్ర పొడి - అర టేబుల్ స్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- కారం - 1 టేబుల్ స్పూన్
- పసుపు - అర టేబుల్ స్పూన్
- నూనె - 1 టేబుల్ స్పూన్
- నీరు - 750ml
ఛుడ్వా కోసం:
- నూనె - ముప్పావు కప్పు
- జీడిపప్పు - పావు కప్పు
- అల్లం వెల్లులి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు
- కరివేపాకు - 3 రెబ్బలు
- ఎండు మిర్చి - 7
- కారం - 2 టేబుల్ స్పూన్లు
- చాట్ మసాలా - 1 టేబుల్ స్పూన్లు
సండే స్పెషల్ : మిలిటరీ మటన్ కర్రీ ఎప్పుడైనా తిన్నారా? - ఇలా ప్రిపేర్ చేస్తే మసాలా నషాళానికి అంటుతుంది!
మటన్ ఛుడ్వా తయారీ విధానం:
- ముందుగా లేత మటన్‌ను తీసుకుని కుక్కర్లో వేసుకోవాలి. అందులోకి అల్లం వెల్లులి పేస్ట్, ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి, ఉప్పు, కారం, పసుపు, నూనె వేసి ముక్కలకు మసాలాలు పట్టేలా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులోకి నీరు పోసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 8 విజిల్స్ ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి.
- ఆవిరిపోయాక మూత తీసి చూస్తే ఇంకా కొంచెం నీరు ఉంటుంది. అప్పుడు కుక్కర్ మూత తీసి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ మీద నీరు పూర్తిగా ఇగిరిపోయి ముక్క మెత్తగా అయ్యేదాకా ఉడికించాలి.
- ఉడికిన మాంసం ముక్కలను పూర్తిగా చల్లార్చాలి. ఆ తర్వాత వాటిని దారాల్లా నలుపుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేడి చేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి జీడిపప్పు వేసి ఎర్రగా వేయించి పక్కకు పెట్టుకోవాలి. అలాగే ఎండుమిర్చి వేసి వేయించిన తర్వాత అందులోకి కరివేపాకు వేసి రెండింటిన వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి.
- ఇప్పుడు అదే నూనెలో అల్లం వెల్లులి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత మాంసం వేసి మీడియం ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుతూ ఎర్రగా వేయించుకోవాలి.
- కేజీ మాంసం ఉడకడానికి సుమారుగా 25-30 నిమిషాల సమయం పడుతుంది. మీరు తీసుకున్న మాంసాన్ని బట్టి వేయించుకోవాలి. అప్పుడు మాంసంలోని నీరు ఎగిరిపోయి కరకరలాడడం మొదలవుతుంది. అలా అని ఎక్కువసేపు వేయించుకుంటే మాడే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వేయించుకోవాలి. అప్పుడు స్టవ్ ఆపేసి చాట్ మసాలా, కారం వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత వేయించిన జీడిపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి బాగా టాస్ చేసి పూర్తిగా చల్లార్చాలి.
- ఛుడ్వా పూర్తిగా చల్లారిన తరువాత గాలి చొరని డబ్బాలో పెట్టి ఉంచుకుంటే సరి. ఇలా చేసుకుంటే కనీసం నెలరోజుల పైనే నిలువ ఉంటుంది. వేడి వేడి అన్నంతో కలుపుకుని తింటుంటే నా సామిరంగా అనాల్సిందే!!
జబర్దస్త్ టేస్టీ : మటన్ తలకాయ కూర ఇలా చేస్తే - ప్లేట్‌తో సహా నాకేస్తారు!
వీకెండ్ స్పెషల్ - చింతచిగురు మటన్ ! ఇలా చేస్తే సూపర్ అనాల్సిందే!
సండే స్పెషల్ - బ్లాక్ మటన్ రెసిపీ - తిన్నారంటే మైమరచిపోతారు!