Reasons For Body Odour :కొంత మందికి ఏ వాతావరణంలోనైనా చెమటలు అధికంగా పడుతుంటాయి. దీంతో బాడీ నుంచి దుర్వాసన వస్తుంటుంది. శరీర దుర్వాసన తగ్గించుకోవడానికి మార్కెట్లో దొరికే వివిధ రకాల సెంట్ బాటిల్స్, డియోడరెంట్లు ఉపయోగిస్తుంటారు. కానీ, ఇవి తాత్కలికంగా చెమట వాసనను తగ్గించినా.. శాశ్వత పరిష్కారాన్ని మాత్రం చూపించలేవు. మరి.. చెమట కంపు ఎందుకు వస్తుంది ? బ్యాడ్ స్మెల్ రాకుండా ఎలాంటి చిట్కాలను పాటించాలి అనే విషయాలను హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ డెర్మటాలజిస్ట్ 'డాక్టర్ చంద్రావతి' వివరిస్తున్నారు. ఆ వివరాలు మీకోసం..
సహజంగానే వాతావరణ పరిస్థితుల వల్ల మనకు చెమట పడుతుంటుంది. కొద్దిగా చెమట పట్టడం మంచిదే. కానీ, ఏ వాతావరణంలోనైనా చెమటలు అధికంగా పడుతుంటే దీనిని ఒక సమస్యగా భావించాలి. కొంతమందికి అరచేతులు, అరికాళ్లలో చెమటలు ఎక్కువగా పడితే, మరికొందరికి చంకల్లో చెమటలు పడుతుంటాయి. అలాగే ముఖంపైనా, తలలోనూ చెమటలు పడుతుంటాయని డాక్టర్ చంద్రావతి చెబుతున్నారు.
కారణం ఇదే!
చెమట గ్రంథులు అధికంగా చెమటను ఉత్పత్తి చేసినప్పుడు ఇలా జరుగుతుంటుంది. దీనివల్ల కొంతమందిలో శరీరం నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఈ సమస్య తీవ్రంగా ఉన్నవారిలో చెమట రంగు మారి బట్టలు కూడా పాడైపోతాయి. అయితే, కొందరిలో ఈ సమస్య చిన్నప్పటి నుంచి ఉంటుంది. మరికొందరిలో న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్‌తో వస్తుందని డాక్టర్ చంద్రావతి చెబుతున్నారు.
మెడిసిన్ వాడితో పూర్తిగా తగ్గుతుందా ?
చాలా మంది కొన్ని రోజులు మందులు వాడుకుంటే శాశ్వతంగా శరీరం నుంచి దుర్ఘంధం రాకుండా చూసుకోవచ్చని అనుకుంటుంటారు. కానీ, మెడిసిన్ వాడడం వల్ల తాత్కలిక ఉపశమనం మాత్రమే లభిస్తుంది. మందులు శాశ్వత పరిష్కారాన్ని చూపించలేవని డాక్టర్ చంద్రావతి తెలిపారు.