తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

న్యూ ఇయర్​ పార్టీకి పర్ఫెక్ట్​ కాంబో - రెస్టారెంట్​ స్టైల్​ "చికెన్​ రోస్ట్​" - ఇలా ప్రిపేర్ చేయండి! - NEW YEAR SPECIAL CHICKEN ROAST

- సూపర్​ టేస్టీ రెస్టారెంట్​ స్టైల్​ చికెన్​ రోస్ట్​ - ఇలా చేస్తే పార్టీ ఎప్పటికీ గుర్తుండిపోవాల్సిందే

How to Make Chicken Roast
New Year Special Chicken Roast (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Dec 31, 2024, 1:32 PM IST

New Year Special Chicken Roast:మరికొన్ని గంటల్లో కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికేందుకు యావత్​ ప్రపంచం సిద్ధమవుతోంది. ఇక కొత్త సంవత్సరం అంటే.. దానికి కొన్ని గంటల ముందు నుంచే ప్రిపరేషన్స్ ఉంటాయి. బాణసంచా మోతలు, హోరెత్తించే డీజేలు, డ్యాన్సులు, ఫ్రెండ్స్​, ఫ్యామిలీతో కలిసి డిన్నర్స్.. ఇలా ఒక్కటేమిటి ఎన్నో హంగులు, ఆర్భాటాలు ఉంటాయి.

వీటితోపాటు డిసెంబర్​ 31వ తేదీ రాత్రి ఘుమఘుమలాడేనాన్​వెజ్​ వంటకాలు సిద్ధమవుతాయి. ఆ రాత్రికి ముక్కలేనిది ఏ పనీ కాదు. మరి మీరు కూడా ఏమైనా రెసిపీలు ప్రిపేర్​ చేయాలనుకుంటున్నారా? అయితే ఓ సారి ఈ చికెన్​ రోస్ట్​ ట్రై చేయండి. సువాసనకే కడుపు నిండేలా అనిపించే ఈ వంటకం.. ఇక తింటే ఘాటు నషాళానికి ఎక్కాల్సిందే. మరి, దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు:

  • చికెన్​ - అర కిలో
  • పచ్చిమిర్చి - 4
  • వేడి నీరు - కప్పున్నర
  • దాల్చిన చెక్క - కొద్దిగా
  • లవంగాలు -4
  • అల్లం వెల్లుల్లి పేస్ట్​ - అర టేబుల్​ స్పూన్​
  • బిర్యానీ ఆకు - 1
  • యాలకులు - 2
  • ఉప్పు - రుచికి సరిపడా
  • పసుపు - పావు టీ స్పూన్

మసాలా పొడి కోసం:

  • లవంగాలు - 7
  • దాల్చిన చెక్క - కొద్దిగా
  • ధనియాలు - 1 టేబుల్​ స్పూన్​
  • అనాస పువ్వు - సగం ముక్క
  • మరాఠీ మొగ్గ - సగం
  • యాలకులు - 4
  • జీలకర్ర - అర టేబుల్​ స్పూన్​

కర్రీ కోసం:

  • నూనె - 4 టేబుల్​ స్పూన్లు
  • ఉల్లిపాయ - 1
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • అల్లం వెల్లుల్లి పేస్ట్​ - అర టేబుల్​ స్పూన్​
  • కారం - ఒకటిన్నర టేబుల్​ స్పూన్లు
  • పచ్చిమిర్చి చీలికలు - 4
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • నిమ్మరసం - అర చెక్క

తయారీ విధానం:

  • ముందుగా ఓ మందపాటి గిన్నెలో చికెన్​ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, దాల్చిన చెక్క, లవంగాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్​, బిర్యానీ ఆకు, యాలకలు, కొద్దిగా ఉప్పు, పసుపు వేసి కలిపి చికెన్​ ముక్కలు మునిగే వరకు వేడి నీరు పోసి కలిపి మూత పెట్టాలి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి దాని మీద చికెన్​ ముక్కలు ఉన్న గిన్నెను పెట్టి మీడియం ఫ్లేమ్​లో చికెన్​ 80 శాతం ఉడికే వరకు కుక్​ చేసుకోవాలి. ఈ అరకిలో చికెన్ 80 శాతం కుక్​ కావడానికి ఓ 10 నుంచి 15 నిమిషాల సమయం పడుతుంది.
  • ఆ తర్వాత స్టవ్​ ఆఫ్​ చేసి చికెన్​ ముక్కలను జల్లెడలో వేసి నీటిని సెపరేట్​ చేసుకుని పక్కన పెట్టాలి.
  • ఇప్పుడు మసాలా పొడి ప్రిపేర్​ చేసుకోవాలి. అందుకోసం స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి లవంగాలు, దాల్చినచెక్క, ధనియాలు, అనాసపువ్వు, మరాఠీ మొగ్గ, యాలకులు, జీలకర్ర వేసి సన్నని సెగ మీద దోరగా వేయించుకుని ఓ ప్లేట్​లోకి తీసుకోవాలి.
  • మసాల దినుసులు చల్లారిన తర్వాత మిక్సీజార్​లో వేసుకుని మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. ఆయిల్​ హీట్​ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఓ నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి.
  • ఆ తర్వాత కరివేపాకు రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్​ వేసి హై ఫ్లేమ్​ మీద వేయించుకోవాలి.
  • అల్లం పేస్ట్​ వేగిన తర్వాత 80 శాతం ఉడికించుకున్న చికెన్​ ముక్కలు వేసి హై ఫ్లేమ్​ మీద టాస్​ చేసుకోవాలి.
  • ఆ తర్వాత మధ్యమధ్యలో కలుపుతూ ఓ 5 నిమిషాల పాటు కుక్​ చేసుకోవాలి.
  • అనంతరం గ్రైండ్​ చేసుకున్న మసాలా పొడి, కారం, చికెన్​ను ఉడికించిగా మిగిలిన నీరు 5 టేబుల్​ స్పూన్ల పోసి మసాలాలు మాడిపోకుండా హై ఫ్లేమ్​ మీద మరో 5 నిమిషాలు టాస్​ చేయాలి.
  • ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, పచ్చిమిర్చి చీలికలు, కొత్తిమీర తరుగు, నిమ్మరసం పిండి మరోసారి కలిపి సర్వ్​ చేసుకుంటే ఎంతో టేస్టీగా మరెంతో స్పైసీగా ఉండే చికెన్​ రోస్ట్​ రెడీ. స్టాటర్​గా, సైడ్​ డిష్​గా సూపర్​గా ఉంటుంది.
  • నచ్చితే మీరూ ఈ రెసిపీని ఈ న్యూ ఇయర్​కు ట్రై చేసి మీ పార్టీని మరింత టేస్టీగా మార్చుకోండి.

సండే స్పెషల్​: అద్దిరిపోయే "బటర్​ నాన్​ విత్​ చికెన్​ కర్రీ" - ఇలా ప్రిపేర్​ చేస్తే రెస్టారెంట్​ టేస్ట్​ పక్కా!

ఎప్పుడూ ఒకేలా కాకుండా ఓసారి ఇలా "చిల్లీ చికెన్" చేసుకోండి - ముక్క మిగల్చకుండా తినేస్తారంతే!

ABOUT THE AUTHOR

...view details