IRCTC Silver Jubilee Celebrations: ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ప్రతి ఏడాది సెప్టెంబర్ 27ను ఐఆర్‌సీటీసీ తన వ్యవస్థాపక దినోత్సవంగా జరుపుకొంటోంది. ఐఆర్‌సీటీసీ నెలకొల్పి ఈరోజుకి (సెప్టెంబర్ 27) 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సెప్టెంబరు 26 నుంచి 28 వరకు ప్రత్యేక ఆఫర్ తీసుకొచ్చింది. తమ వెబ్‌సైట్ నుంచి బుక్ చేసుకొనే ఇండిగో విమాన టికెట్లపై 12 శాతం డిస్కౌంట్ అందిస్తోన్నట్టు తెలిపింది. సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఈ ప్రత్యేక ఆఫర్ తీసుకొచ్చినట్టు ఐఆర్‌సీటీసీ అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో పంచుకుంది. అయితే ఈ ఆఫర్ కేవలం మూడు రోజులు మాత్రమే అందుబాటులో ఉండనుందని తెలిపింది.
బుకింగ్ డేట్: ఈ ప్రత్యేక ఆఫర్ కోసం బుకింగ్ వ్యవధి సెప్టెంబర్ 26 నుంచి సెప్టెంబర్ 28, 2024 వరకు ఉంటుందని తెలిపింది.
ప్రయాణం ఎప్పుడు చేయవచ్చంటే: ఈ ప్రత్యేక ఆఫర్ ప్రయాణ వ్యవధి అక్టోబర్ 3, 2024 నుంచి మార్చి 31, 2025 వరకు ఉంటుంది. అంటే అక్టోబర్ 3 నుంచి 2025 మార్చి 31 వరకు ఇండిగో విమానాల్లో ప్రయాణించవచ్చు. ఇందుకోసం పైన చెప్పిన తేదీల్లో టికెట్ బుక్ చేసుకోవాలి.
ఎలా బుక్ చేసుకోవాలి:ఐఆర్‌సీటీసీ అందిస్తున్న ఈ ఆఫర్ ద్వారా ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటున్న వారు ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు.