IRCTC Shirdi With Aurangabad Package:2024వ సంవత్సరం చివరకు వచ్చేశాము. ఈ క్రమంలోనే చాలా మంది ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి టూర్స్‌కు వెళ్లాలని ప్లాన్ చేస్తుంటారు. ముఖ్యంగా ఈ ఇయర్ ఎండ్‌లో షిరిడీ వెళ్లాలని అనుకుంటుంటారు. మరి మీరు కూడా ఆ లిస్ట్‌లో ఉన్నారా? అయితే.. మీకో గుడ్‌న్యూస్ చెబుతోంది ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్. అతి తక్కువ ధరకే షిరిడీ సహా ఇతర ప్రదేశాలను చూసేందుకు అద్దిరిపోయే ప్యాకేజీ తీసుకొచ్చింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
IRCTC టూరిజం "షిరిడీ విత్ ఔరంగాబాద్(Shirdi With Aurangabad)" పేరుతో ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ టూర్ మొత్తం 3 రాత్రులు, 4 పగళ్లు ఉంటుంది. హైదరాబాద్ నుంచి ట్రైన్ జర్నీ ద్వారా ఈ టూర్‌ను ఆపరేట్ చేస్తున్నారు. ఈ టూర్లో సాయి దర్శనంతో పాటు ఔరంగాబాద్, ఎల్లోరా గుహలు, శని శిగ్నాపూర్ చూడొచ్చు. ప్యాకేజీ ప్రకటించిన తేదీలకు అనుగుణంగా ప్రతీ శుక్రవారం ఈ టూర్ అందుబాటులో ఉంటుంది. ప్రయాణ వివరాలు ఇవే..
- మొదటి రోజు కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి సాయంత్రం 6:40 గంటలకు ట్రైన్(అజంతా ఎక్సెప్రెస్ - 17064) స్టార్ అవుతుంది. రాత్రి మొత్తం జర్నీ ఉంటుంది.
- రెండో రోజు ఉదయం 7 గంటలకు నాగర్సోల్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి పికప్ చేసుకుని షిరిడీ తీసుకెళ్తారు. అక్కడ హోటల్లో చెకిన్ అవ్వాలి. బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత సాయిబాబా దర్శనం ఉంటుంది. మధ్యాహ్నం శని శిగ్నాపూర్ స్టార్ట్ అవుతారు. అక్కడి శని దేవాలయం దర్శించుకుని ఔరంగాబాద్ బయలుదేరుతారు. అక్కడ హోట్‌లో చెకిన్ అయ్యి ఆ రాత్రికి అక్కడే బస చేస్తారు.
- మూడో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ అయ్యి మినీ తాజ్ మహల్ సందర్శిస్తారు. అక్కడి నుంచి ఎల్లోరా బయలుదేరుతారు. అక్కడ ఎల్లోరా గుహలు, ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటారు. సాయంత్రం తిరిగి ఔరంగాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు రిటర్న్ జర్నీ ఉంటుంది. ఆ రాత్రి మొత్తం ప్రయాణం ఉంటుంది.
- నాలుగో రోజు ఉదయం 10 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ధరలు ఇవే:
కంఫర్ట్(3A): సింగిల్ షేరింగ్ రూ.23,740, ట్విన్ షేరింగ్ రూ.13,070, ట్రిపుల్ షేరింగ్ రూ.10,320గా నిర్ణయించారు. ఇక 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు విత్ బెడ్ అయితే రూ.7,760, విత్ అవుట్ బెడ్ అయితే రూ.6,580గా నిర్ణయించారు.