South Korea President Yoon Arrest : అభిసంశనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్‌యోల్‌ను అరెస్టు చేసేందుకు ఆ దేశ అవినీతి వ్యతిరేక దర్యాప్తు బృందం-సీఐఓ ప్రయత్నించి విఫలమైంది. సెంట్రల్ సియోల్‌లోని దేశ అధ్యక్షుడి నివాసంలోకి 150 మంది అత్యున్నత దర్యాప్తు అధికారులు అరెస్టు వారెంట్‌తో వెళ్లగా, వారిని అధ్యక్షుడి భద్రతా బలగాలు అడ్డుకున్నట్లు అక్కడి మీడియా తెలిపింది. దర్యాప్తు అధికారులకు మద్దతుగా 2,700 మంది పోలీసులు అధ్యక్షుడి నివాసానికి చేరుకున్నట్లు తెలిసింది. అరెస్టును అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని అధ్యక్షుడి భద్రతా బలగాలను సీఐవో అధికారులు తీవ్రంగా హెచ్చరించారు. న్యాయం జరగకుండా అడ్డుపడితే నేరం కింద పరిగణిస్తామని స్పష్టంచేశారు. ఎమర్జెన్సీ వివాదం నేపథ్యంలో అభిశంసన ఎదుర్కొంటున్న యూన్‌ను అరెస్టు చేసేందుకు దర్యాప్తు అధికారులకు సియోల్ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 6లోపు అధ్యక్షుడిని అరెస్టు చేస్తామని సీఐవో ప్రకటించింది. అయితే అధ్యక్షుడు మాత్రం అరెస్టు నుంచి తప్పించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
దక్షిణ కొరియాలో టెన్షన్ టెన్షన్ - యూన్ సుక్‌యోల్ అరెస్ట్‌ను అడ్డుకున్న భద్రతా బలగాలు! - SOUTH KOREA PRESIDENT YOON ARREST
యూన్ సుక్‌యోల్ అరెస్ట్‌కు పోలీసులు యత్నం - అడ్డుకున్న అధ్యక్షుడి భద్రతా బలగాలు
Published : Jan 3, 2025, 11:03 AM IST