తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

ఐఆర్​సీటీసీ "గ్లోరీ ఆఫ్​ గుజరాత్​ విత్​ మౌంట్​ అబూ" - ఈ ప్రదేశాలు చూడొచ్చు! ధర కూడా తక్కువే! - Glory of Gujarat With Mt Abu Tour - GLORY OF GUJARAT WITH MT ABU TOUR

IRCTC Gujarat Package: గుజరాత్​లోని ప్రముఖ ప్రదేశాలు చూడాలని అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్​న్యూస్​. ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) ఓ ప్యాకేజీ తీసుకొచ్చింది. ధర ఎంత? ఏఏ ప్రదేశాలు చూడొచ్చు? వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

By ETV Bharat Features Team

Published : Sep 7, 2024, 12:50 PM IST

IRCTC Glory of Gujarat With Mt Abu Package: గుజరాత్‌ అనగానే సబర్మతీ ఆశ్రమం.. నర్మదా నదీ తీరంలోని ‘స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ’..వంటివి గుర్తొస్తాయి. అయితే వీటన్నింటినీ ఒకే ట్రిప్‌లో కవర్‌ చేయాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్​న్యూస్​. గుజరాత్‌లోని పర్యాటక స్థలాలను చూడటం కోసం ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) ఓ ప్యాకేజీ తీసుకొచ్చింది. టూర్​ ఎన్ని రోజులు? ఏఏ ప్రాంతాలు కవర్​ అవుతాయి? ధర ఎంత అనే వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఐఆర్​సీటీసీ గ్లోరీ ఆఫ్​ గుజరాత్​ విత్​ మౌంట్​ అబూ పేరుతో ప్యాకేజీ ఆపరేట్​ చేస్తున్నారు. ఈ టూర్​ మొత్తం 7 రాత్రులు, 8 పగళ్లు ఉంటుంది. హైదరాబాద్​ నుంచి ట్రైన్​ ద్వారా ఈ టూర్​ ఆపరేట్​ చేస్తున్నారు. ఈ ప్యాకేజీలో వడోదరా, అంబాజీ, వాద్​నగర్​, అహ్మదాబాద్​లోని ప్లేస్​లు చూడొచ్చు. ప్రతి బుధవారం ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం సెప్టెంబర్​ 18వ తేదీ నుంచి ఈ టూర్​ ఆపరేట్​ చేస్తున్నారు.

ప్రయాణ వివరాలు చూస్తే:

  • మొదటి రోజు సికింద్రాబాద్‌ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్‌-పోర్‌బందర్‌ ఎక్స్‌ప్రెస్‌ (ట్రైన్‌ నం. 20967) రైలు బయల్దేరుతుంది. రాత్రంతా ట్రైన్​ జర్నీ ఉంటుంది.
  • రెండో రోజు ఉదయం 11 గంటలకు వడోదరా రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి ముందుగా ఏర్పాటు చేసిన హోటల్‌కు తీసుకెళ్తారు. ఫ్రెష్​ అయ్యాక మధ్యాహ్నం స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ (ఐక్యతా మూర్తి)ని వీక్షించి తిరిగి వడోదరా చేరుకుంటారు. రాత్రి అక్కడే స్టే చేయాల్సి ఉంటుంది.
  • మూడో రోజు హోటల్​ నుంచి చెక్​ అవుట్​ అయిన తర్వాత లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌ని సందర్శిస్తారు. అక్కడి నుంచి అంబాజీ బయలుదేరుతారు. హోటల్​లో చెకిన్​ అయిన తర్వాత అంబాజీ దేవాలయాన్ని దర్శించుకుంటారు. ఆ రాత్రికి అక్కడే స్టే ఉంటుంది.
  • నాలుగో రోజు తెల్లవారుజామునే మౌంట్​ అబూకు స్టార్ట్​ అవుతారు. మౌంట్​ అబూలో లోకల్​ సైట్​ సీయింగ్​ ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ అంబాజీకి రిటర్న్​ అవుతారు. ఆ రాత్రికి అంబాజీలో బస ఉంటుంది.

కూర్గ్​ అందాలను చూసేందుకు - IRCTC సూపర్​ ప్యాకేజీ! ధర చాలా తక్కువ!

  • ఐదో రోజు వాద్‌నగర్​కు బయలుదేరుతారు. అక్కడ లోకల్​లో పలు ప్రదేశాలు విజిట్​ చేయవచ్చు. అక్కడి నుంచి పటాన్ స్టార్ట్​ అవుతారు. అక్కడ రాణి కి వావ్ సందర్శించుకోవచ్చు. తర్వాత మోధేరా సూర్య దేవాలయాన్ని దర్శించుకోవచ్చు. సాయంత్రం అహ్మదాబాద్‌కు బయలుదేరుతారు. హోటల్‌లో చెకిన్​ అయిన తర్వాత ఆ రాత్రికి అహ్మదాబాద్‌లో బస చేయాలి.
  • ఆరో రోజు బ్రేక్​ఫాస్ట్​ తర్వాత.. సబర్మతీ ఆశ్రమం, హుతీసింగ్ జైన్ టెంపుల్, అటల్ బ్రిడ్జ్, సబర్మతీ రివర్ ఫ్రంట్ వంటి విజిట్​ చేస్తారు. ఆ రాత్రి అహ్మదాబాద్‌లో బస ఉంటుంది.
  • ఏడో రోజు ఉదయం బ్రేక్​ఫాస్ట్​ అనంతరం అహ్మదాబాద్​ రైల్వై స్టేషన్​లో డ్రాప్​ చేస్తారు. ఉదయం 9:40 గంటలకు ట్రైన్​(20968) రిటర్న్​ జర్నీ స్టార్ట్​ అవుతుంది. ఆ రోజంతా ప్రయాణం ఉంటుంది.
  • ఎనిమిదో రోజు ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్​ చేరుకోవడంతో టూర్​ ముగుస్తుంది.

హైదరాబాద్​ టూ అయోధ్య వయా వారణాసి - రూ.16వేలకే IRCTC అద్దిరిపోయే ప్యాకేజీ!

ధర వివరాలు చూస్తే:

కంఫర్ట్​(3AC)లో ట్విన్​ షేరింగ్​కు రూ. 31,560, ట్రిపుల్​ షేరింగ్​కు రూ. 30,760 గా నిర్ణయించారు. 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్​ బెడ్​ అయితే రూ. 25,070, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.22,140 చెల్లించాలి.

స్టాండర్డ్​(SL)లో ట్విన్​ షేరింగ్​ రూ. 29,710, ట్రిపుల్​ షేరింగ్​కు రూ.28,660 చెల్లించాలి. 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్​ బెడ్​ అయితే రూ. 20,730, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.19,040 చెల్లించాలి.

ప్యాకేజీలో ఉండేవి ఇవే:

  • హైదరాబాద్​ నుంచి వడోదరా, అహ్మదాబాద్​ నుంచి హైదరాబాద్​ ట్రైన్​ టికెట్లు అందుబాటులో ఉంటాయి.
  • సైట్​ సీయింగ్​ కోసం ట్రాన్స్​పోర్ట్​ ఫెసిలిటీ ఉంటుంది.
  • 5 బ్రేక్​ఫాస్ట్​ అండ్​ 5 డిన్నర్​లో ఉంటాయి.
  • ట్రావెల్​ ఇన్సూరెన్స్​ ఉంటుంది.
  • ఈ ప్యాకేజీకి సంబంధించిన వివరాలు, ప్యాకేజీ బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

ప్రకృతి అందాలకు నిలయమైన 'ఊటీ' చూసొస్తారా? - బడ్జెట్​ ధరకే IRCTC సూపర్​ ప్యాకేజీ!

సౌత్​ ఇండియాలోని ఈ ఆలయాలు చూసొస్తారా? - వైజాగ్​ నుంచి IRCTC సూపర్​ ప్యాకేజీ! ధర కూడా అందుబాటులోనే!

ABOUT THE AUTHOR

...view details