తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

నోరూరించే "ఉసిరికాయ తురుము నిల్వ పచ్చడి" - ఇలా పెడితే ఏడాది నిల్వ ఉంటుంది! - USIRIKAYA THURUMU PACHADI

- ఈ రుచికి మీరు ఫిదా అయిపోతారు!

Usirikaya Thurumu Pachadi
How to Make Usirikaya Thurumu Pachadi (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 9, 2024, 10:36 AM IST

How to Make Usirikaya Thurumu Pachadi :ప్రస్తుతం మార్కెట్లో ఉసిరికాయలు విరివిగా లభిస్తున్నాయి. చాలా మంది ఉసిరికాయలతో నిల్వ పచ్చడి, తొక్కు పచ్చడి పెట్టుకుంటారు. అలాగే.. పప్పు, పులిహోర వంటి రెసిపీలు కూడా తయారు చేసుకుంటూ ఉంటారు. అయితే.. ఈ నిల్వ పచ్చడినిరెండు విధాలుగా పెడుతుంటారు. చాలా మంది ఉసిరికాయలను నేరుగా నూనెలో వేయించి నిల్వ పచ్చడి తయారు చేస్తారు. మరో పద్ధతిలో ఉసిరికాయలను తురిమి పచ్చడి చేస్తారు. మరి.. దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం.

ఉసిరికాయ తురుము పచ్చడి ఎంతో టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో కాస్తంత నెయ్యి వేసుకుని ఈ తురుము పచ్చడితో తింటే ఎవరైనా సరే రుచికి మమైరచిపోవాల్సిందే. అంతేకాదు.. ఇక్కడ చెప్పే పద్ధతిలో తయారు చేసి స్టోర్ చేసుకుంటే.. దాదాపు ఏడాది కాలం పాటు నిల్వ ఉంటుంది. మరి, ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉసిరికాయ తురుము పచ్చడిఎలా చేయాలి ? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • ఉసిరికాయలు-250 గ్రాములు
  • రుచికి సరిపడా ఉప్పు
  • రుచికి సరిపడా కారం
  • పసుపు-టీస్పూన్
  • ఎండుమిర్చి-2
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • వెల్లుల్లి రెబ్బలు - 8
  • నూనె -300 గ్రాములు
  • నిమ్మకాయలు-2

ఆవాలు, మెంతుల పొడి కోసం..

  • మెంతులు- అరటీస్పూన్
  • జీలకర్ర- అరటీస్పూన్
  • ఆవాలు -టీస్పూన్​

తాలింపు కోసం..

  • ఆవాలు-టీస్పూన్
  • ఎండుమిర్చి-2
  • వెల్లుల్లి రెబ్బలు-3
  • చిటికెడు ఇంగువ
  • కరివేపాకు-1

తయారీ విధానం..

  • ముందుగా ఉసిరికాయలను శుభ్రంగా కడగండి. వాటిపై తడి లేకుండా పొడి వస్త్రంతో తుడవండి.
  • తర్వాత ఉసిరికాయల్ని గ్రేటర్​ సాయంతో తురుముకోండి.
  • ఇప్పుడు స్టౌపై కడాయి పెట్టండి. ఇందులో ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసి దోరగా వేయించండి.
  • ఇవి చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసుకోండి.
  • తర్వాత తాలింపు కోసం.. స్టౌపై కడాయి పెట్టి ఆయిల్​ వేయండి.
  • నూనె వేడయ్యాక ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి దోరగా వేయించండి.
  • తర్వాత ముందుగా తురుముకున్న ఉసిరికాయ తురుము మిశ్రమాన్ని వేసి 3 నిమిషాలు వేపుకోండి. ఇప్పుడు స్టౌ ఆఫ్ చేసి మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వండి.
  • ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం, గ్రైండ్​ చేసుకున్న ఆవాలు, మెంతుల పొడి, కొద్దిగా పసుపు వేసి బాగా మిక్స్​ చేయండి.
  • అలాగే రెండు నిమ్మకాయల రసం పిండండి.
  • ఈ పచ్చడిని ఒక గ్లాసు జారులోకి తీసుకుని మూత పెట్టి రెండు రోజులపాటు ఊరనివ్వండి.
  • అంతే.. ఆ తర్వాత పచ్చడి వేసుకుని భోజనం చేస్తే ఎంతో కమ్మగా ఉంటుంది.
  • నచ్చితే మీరు కూడా ఉసిరికాయ తురుము పచ్చడి ఓ సారి ట్రై చేయండి.

అప్పటికప్పుడు తయారు చేసే "కమ్మటి ఉసిరికాయ చట్నీ"- ఇలా చేస్తే టేస్ట్​ అద్భుతంగా ఉంటుంది!

ఉసిరికాయలతో అద్దిరిపోయే పప్పు! - ఇలా ప్రిపేర్ చేశారంటే నెవ్వర్ బిఫోర్ టేస్ట్!

ABOUT THE AUTHOR

...view details