తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

నోరూరించే రెస్టారెంట్ స్టైల్ "పనీర్ బిర్యానీ" - సింపుల్​గా ప్రిపేర్ చేసుకోండిలా! - PANEER BIRYANI RECIPE

-ఎప్పుడూ రొటీన్ బిర్యానీయేనా? - ఈ వీకెండ్ ఇలా పనీర్ బిర్యానీ ట్రై చేయండి!

Paneer Biryani Recipe
Paneer Biryani Recipe in Telugu (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Dec 7, 2024, 10:06 AM IST

Paneer Biryani Recipe in Telugu :మనందరికి బిర్యానీ అనగానే చికెన్, మటన్ వంటివి ముందుగా గుర్తొస్తాయి. అయితే, ఎప్పుడూ అవే తినాలంటే కాస్త బోర్ ఫీలింగ్ కలుగుతుంది. అందుకే.. ఈసారి కాస్త డిఫరెంట్​గారెస్టారెంట్ స్టైల్ పనీర్ బిర్యానీ ట్రై చేయండి. టేస్ట్ అద్దిరిపోతుంది! మరి, అందులోకి కావాల్సిన పదార్థాలు ఏంటి? తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • ఫ్రైడ్ ఆనియన్స్ - కొన్ని
  • కొత్తిమీర తరుగు - గుప్పెడు
  • పుదీనా ఆకులు - గుప్పెడు

మారినేషన్ కోసం :

  • పనీర్ - అర కేజీ
  • టమాటాలు - 3
  • పచ్చిమిర్చి - 4
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ - రెండు చెంచాలు
  • కారం - రెండు చెంచాలు
  • ధనియాల పొడి - 1 చెంచా
  • జీలకర్ర పొడి - అరచెంచా
  • గరంమసాలా - అరచెంచా
  • పసుపు - పావుచెంచా
  • పెరుగు - అరకప్పు

బిర్యానీ కోసం కావాల్సిన పదార్థాలు :

  • నెయ్యి - 1 స్పూన్
  • దాల్చిన చెక్క - అంగుళం ముక్క
  • లవంగాలు - 5
  • యాలకులు - 4
  • బిర్యానీ ఆకులు - 2
  • షాజీరా - 1 టీస్పూన్
  • నక్షత్ర పువ్వు - 1
  • జాజికాయ - 1

అన్నం వండటానికి :

  • బాస్మతి బియ్యం - అర కేజీ
  • లవంగాలు - 3
  • యాలకులు - 4
  • చిన్న దాల్చిన చెక్క ముక్కలు - 3
  • నెయ్యి - 1 స్పూన్
  • షాజీరా - 1 స్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • పుదీనా తరుగు - కొద్దిగా
  • రెండు పచ్చిమిర్చి చీలికలు

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా బాస్మతి బియ్యాన్ని కడిగి ఒక అరగంటపాటు నానబెట్టుకోవాలి.
  • ఈలోపు రెసిపీలోకి కావాల్సిన మిగతా ఇంగ్రీడియంట్స్​ని ప్రిపేర్ చేసుకోవాలి. మొదట అర కిలో పనీర్​ని తీసుకొని కాస్త పెద్ద సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  • తర్వాత ఒక చిన్న బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు, కట్ చేసుకున్న పనీర్ ముక్కలను వేసి కాసేపు అలా వదిలేయాలి. ఇలా చేయడం ద్వారా పనీర్​కి ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉంటే తొలగిపోతుంది.
  • ఇప్పుడు రెసిపీలోకి కావాల్సిన మొత్తంలో ఫ్రైడ్ ఆనియన్స్​ని ప్రిపేర్ చేసి ఉంచుకోవాలి. టమాటాలను కాస్త పెద్ద సైజ్ ముక్కలుగా, పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా కొత్తిమీర, పుదీనా తరుగుని సిద్ధం చేసి పెట్టుకోవాలి.
  • అనంతరం మిక్సీ జార్​లో కట్ చేసుకున్న టమాటా ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు వేసుకుని మెత్తని పేస్ట్​లా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
  • ఆపై అందులో అల్లంవెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరంమసాలా, పసుపు వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి.
  • ఆ తర్వాత ఈ టమాటా మిశ్రమంలో.. మీరు ముందుగా ఉప్పు నీటిలో నానబెట్టుకున్న పనీర్ ముక్కలను వేసుకొని కలుపుకోవాలి. అనంతరం పెరుగు, కొద్దిగా కొత్తిమీర, పుదీనా తరుగు, కాసిన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ పనీర్ ముక్కలకు పట్టేలా చక్కగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని తీసుకొని అందులో తగినన్ని వాటర్ పోసుకోవాలి. అలాగే లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకులు, షాజీరా, నెయ్యి, ఉప్పు, కొత్తిమీర, పుదీనా తరుగు, పచ్చిమిర్చి చీలికలు వేసి కలిపి మూతపెట్టుకోవాలి. ఆపై ఆ గిన్నెను స్టౌపై పెట్టి రైస్​ని 70% వరకు ఉడికేలా ఉడికించుకోవాలి.
  • అనంతరం ఇంకో బర్నర్ మీద మరో కాస్త మందపాటి పెద్ద బౌల్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. అది కరిగి వేడెక్కాక పైన చెప్పిన విధంగా బిర్యానీ కోసం కావాల్సిన మసాలా దినుసులను వేసుకొని కాసేపు వేయించుకోవాలి.
  • అవి వేగాక ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న పనీర్ ముక్కల మిశ్రమాన్ని యాడ్ చేసుకొని కలుపుతూ 5 నిమిషాల పాటు వేయించుకోవాలి.
  • ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలిపి మూతపెట్టి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మరో ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి.
  • ఆవిధంగా ఉడికించుకున్నాక.. మూత తీసి కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కాస్త కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒకసారి పనీర్ ముక్కలు చిదమకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. అయితే, ఈ స్టేజ్​లోనే ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఒకవేళ సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి.
  • అనంతరం ఆ మిశ్రమంలో 70% వరకు ఉడికించుకున్న అన్నాన్ని లేయర్స్ మాదిరిగా వేసుకోవాలి. అలా వేసుకునేటప్పుడు లేయర్స్ మధ్యలో కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి.
  • ఆవిధంగా అన్నాన్ని మొత్తాన్ని లేయర్స్​గా వేసుకున్నాక చివరగా మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, ఫుడ్ కలర్ వేసుకోవాలి.
  • అయితే, మీకు ఒకవేళ ఫుడ్ కలర్ నచ్చకపోతే ఇలా నేచురల్​గా చేసి వేసుకోవచ్చు. ఒక చిన్న గిన్నెలో ఒకస్పూన్ నెయ్యి, కొద్దిగా పసుపు వేసి గోరువెచ్చగా మరిగించి తీసుకుంటే చాలు. దీన్ని ఫుడ్ కలర్​ ప్లేస్​లో రైస్​పై వేసుకోవచ్చు.
  • ఆ తర్వాత ఆవిరి బయటకు వెళ్లకుండా మూత పెట్టేసుకుని లో-ఫ్లేమ్ మీద పావుగంట పాటు ఉడికించి దింపేసుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే "రెస్టారెంట్ స్టైల్ పనీర్ బిర్యానీ" రెడీ!
  • ఈ సండే మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి.. ఫ్యామిలీ మొత్తం ఎంజాయే చేయండి. ఇవి కూడా చదవండి :

వీకెండ్ స్పెషల్ : రెస్టారెంట్ స్టైల్ "చికెన్ కబాబ్స్" - ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా! - టేస్ట్ అదుర్స్!

వారెవ్వా - దోశ పెనంపై అద్దిరిపోయే "బటర్ నాన్" - ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ "పనీర్ బటర్ మసాలా" ఈజీగా చేసేయండిలా!

ABOUT THE AUTHOR

...view details