తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

ఇంట్లో పాలు, పంచదార ఉంటే చాలు- ఎంతో రుచికరమైన "పాలకోవా" ఈజీగా చేసుకోవచ్చు! - PALKOVA SWEET RECIPE

-పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమైన స్వీట్​ -ఈ విధంగా చేస్తే టేస్ట్​ అదుర్స్​!!

Palkova at Home
How to Make Palkova at Home (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 14, 2024, 5:24 PM IST

How to Make Palkova at Home : మనలో చాలా మంది స్వీట్​షాప్​కి వెళ్లినప్పుడు.. అక్కడ ఎన్ని రకాలస్వీట్లున్నా.. పాలకోవాని చూస్తే మాత్రం కళ్లు తిప్పుకోకుండా ఉండలేరు. రేట్​ ఎంత ఎక్కువగా ఉన్నా.. కనీసం కొద్దిగా అయినా కొంటారు. ఎందుకంటే.. నోట్లో వేసుకోగానే కరిగే పాలకోవారుచిఅమృతంలా అనిపిస్తుంది. అందుకే స్వీట్లలో పాలకోవాకు అంత డిమాండ్. అయితే, ఇకపై పాలకోవా కావాలంటే స్వీట్​ షాప్​కే వెళ్లాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో కేవలం పాలు, పంచదార ఉంటే చాలు ఎంతో రుచికరంగా దీనిని చేసుకోవచ్చు. అది ఎలా అంటారా ? ఈ స్టోరీలో చెప్పిన విధంగా చేయొచ్చు. కాకపోతే కాస్త ఓపిక కావాలి. మరి ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

కావాల్సిన పదార్థాలు..

  • చిక్కని పాలు- లీటర్​
  • చక్కెర-100 గ్రాములు
  • యాలకుల పొడి-అరటీస్పూన్​

తయారీ విధానం..

  • ముందుగా స్టౌపై మందపాటి గిన్నెను పెట్టుకోండి. ఇందులో పాలు పోయండి. పాలకోవా మరింత టేస్టీగా ఉండటానికి మీరు ఫుల్​ క్రీమ్​ మిల్క్​ కూడా ఉపయోగించవచ్చు.
  • పాలు ఒక పొంగు వచ్చేంత వరకు బాగా మరిగించండి. ఇలా పాలు మరుగుతున్నప్పటి నుంచి చిక్కగా మారేంత వరకు మధ్యమధ్యలో గరిటెతో కలుపుతూనే ఉండాలి.
  • పాలపైన వచ్చే మిగడ గిన్నెకు అతుక్కోకుండా గరిటెతో పాలలోకి మిక్స్​ చేస్తూ బాగా మరిగించాలి. ఇలా పాలను గరిటెతో కలపడం వల్ల పాలు మాడిపోకుండా ఉంటాయి. పాలు దగ్గర పడి కోవాగా మారేంత వరకు ఇలానే చేయాలి.
  • పాలు దగ్గర పడిన తర్వాత ఇందులో చక్కెర వేసి బాగా కలపండి.
  • చక్కెర వేసిన తర్వాత కోవా పల్చగా మారుతుంది. మళ్లీ అలాగే పాలను గరిటెతో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి యాలకుల పొడి వేసి మరిగించుకోవాలి.
  • పాలకోవాని కొద్దిగా చేతిలోకి తీసుకుని ముద్దలా చేయండి. ముద్దగా మారితే కోవా పర్ఫెక్ట్​గా రెడీ అయినట్లే. ఈ టైమ్​లో స్టౌ ఆఫ్​ చేయాలి.
  • పాలకోవా వేడిగా ఉన్నప్పుడు ఒక గిన్నెతో ప్రెస్​ చేస్తూ పూర్తిగా కలపండి.
  • కోవా చల్లారిన తర్వాత చేతితో 5 నిమిషాల ప్రెస్​ చేసుకోండి. ఇలా కోవాని ప్రెస్​ చేసుకోవడం వల్ల పాలకోవా చాలా సాఫ్ట్​గా వస్తుంది.
  • తర్వాత కోవాని మీకు నచ్చిన ఆకారంలో చేసుకుంటే.. ఎంతో తీయని పాలకోవా రెడీ. నచ్చితే మీరు కూడా ఇంట్లో పాలకోవా ఈ విధంగా ట్రై చేయండి. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.

నోట్లో వేసుకుంటే కరిగిపోయే "డేట్స్ హల్వా" - ఈజీగా ప్రిపేర్ చేసుకోండిలా - రుచి అమృతమే!

దసరా స్పెషల్ స్వీట్స్ : నోరూరించే "రవ్వ జిలేజీ, మూంగ్​దాల్ లడ్డు, పాల బూరెలు"- ఈజీ​గా చేసుకోండిలా!

ABOUT THE AUTHOR

...view details