How to Make Matar Kulcha at Home :తెలుగు రాష్ట్రాల్లో దొరికే స్ట్రీట్ ఫుడ్స్‌లో చాలా రకాలుంటాయి. మిరపకాయ బజ్జీ, పునుగులు, ఉల్లిపాయ పకోడీ, పానీపూరీ, భేల్‌పూరి, సమోసా, ఆలూబోండా వంటివి సాయంత్రం టైమ్‌లో ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. మనలాగానే ఉత్తర భారతదేశంలో కూడా చాలాస్నాక్ ఐటమ్స్ ఉన్నాయి. వీటిలో.. అందరికీ ఎంతో నచ్చే మటర్ కుల్చా టాప్‌లో ఉంటుంది. మీ పిల్లలకు రొటీన్ స్నాక్ రెసిపీస్కాకుండా.. ఒక్కసారి ఈ మటర్ కుల్చా చేసి పెట్టండి. ఎంతో ఇష్టంగా తినేస్తారు. మరి, దాని తయారీ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
కుల్చా కోసం..
- మైదాపిండి- కప్పు
- ఉప్పు - రుచికి సరిపడా
- పంచదార-చెంచా
- పెరుగు - 2 టేబుల్ స్పూన్లు
- ఈస్ట్ - అర చెంచా
- వెన్న - పావు కప్పు
- నూనె - తగినంత
- నల్ల జీలకర్ర - చెంచా
మటర్ కోసం..
- బఠాణీలు - కప్పు
- పసుపు - ముప్పావు చెంచా
- ఉప్పు - రుచికి సరిపడా
- ధనియాలు-టేబుల్ స్పూన్
- నిమ్మరసం-టేబుల్ స్పూన్
- జీలకర్ర పొడి-చెంచా
- మిరియాలు-అర చెంచా
- వాము-అర చెంచా
- కొత్తిమీర తరుగు-కొద్దిగా
- పుదీనా-కొద్దిగా
- అల్లం - అరంగుళం ముక్క
- వెల్లుల్లి రెబ్బలు - 4
- పచ్చిమిర్చి తరుగు - చెంచా
- ఎండుమిర్చి-2
- పిప్పలిపండ్లు-2
- పచ్చిమిర్చి - 2
- జీలకర్ర- అర టేబుల్‌స్పూన్
- ఆమ్‌చూర్ పౌడర్ - అర టేబుల్‌స్పూన్
- ఉల్లి తరుగు- అర కప్పు
- టమాటా తరుగు - అర కప్పు
తయారీ విధానం :
- మటర్ కుల్చా ప్రిపేర్ చేయడానికి బఠాణీలను ముందు రాత్రి నానబెట్టాలి.
- మరుసటి రోజు రెండు కప్పుల నీళ్లు, పసుపు, ఉప్పు వేసి మెత్తగా ఉడికించుకోవాలి.
- అలాగే అరగ్లాసు గోరువెచ్చటి నీళ్లలో పంచదార, ఈస్ట్ వేసి కరిగించాలి.
- ఈ నీళ్లు, పెరుగు మైదాపిండిలో వేసి బాగా కలపాలి.
- అలాగే ఇప్పుడు గ్రీన్ చట్నీ కోసం.. కొత్తిమీర తరుగు, పుదీనా, కొద్దిగా ఉప్పు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర పొడి, చింతపండు గుజ్జు, పచ్చిమిర్చి తరుగు మిక్సీజార్‌లో వేసి గ్రైండ్ చేసుకోవాలి.
- తర్వాత స్పెషల్ స్పైస్ మిక్స్ కోసం.. స్టౌ పైన పాన్ పెట్టి నూనె లేకుండా.. ఎండుమిర్చి, మిరియాలు, పిప్పలిపండ్లు, వాము, ధనియాలు, జీలకర్ర ఒక్కొక్కటిగా వేస్తూ వేయించాలి.
- ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలో ఆమ్‌చూర్ పౌడర్, కాస్త ఉప్పు జతచేసి గ్రైండ్ చేసి స్పెషల్ స్పైస్ మిక్స్ రెడీ చేసుకోవాలి.
- ఇప్పుడు నానబెట్టిన మైదాపిండిని చిన్న భాగాలు చేయాలి.
- ఒక్కో పిండి ముద్దని చిన్న రొట్టెలా చేసి.. దాని మీద నల్ల జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర తరుగు చల్లి.. చపాతీకర్రతో ఇంకొంచెం సాగదీయాలి.
- కుల్చాని పెనం మీద వేసి ఓ పక్కన కొన్ని నీళ్లు చిలకరించి.. మూత పెట్టాలి.
- నిమిషం తర్వాత మూత తీసి.. అట్లకాడతో అదుముతూ కొంతవరకూ కాలనిచ్చి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే మిగతా పిండితో రొట్టెలు కాల్చుకుని తీసుకోవాలి.
- తర్వాత మరొసారి రొట్టెలను వెన్నతో కాల్చుకోవాలి. ఇలా రెండు సార్లు కాల్చుకోవడం వల్ల కుల్చాలు చాలా టేస్టీగా ఉంటాయి.
- ఇప్పుడు మటర్ కోసం.. ఉడికించిన బఠాణీల్లో ఉల్లి, టమాటా తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, స్పెషల్ స్పైస్ మిక్స్, నిమ్మరసం, కొత్తిమీర, గ్రీన్‌చట్నీ వేసి బాగా కలపాలి.
- అంతే.. దీంతో కుల్చాలను తింటే.. ఎంతో రుచికరంగా ఉంటుంది. నచ్చితే మీరు కూడా ఈ స్ట్రీట్ ఫుడ్ ట్రై చేయండి.
ఇవి కూడా చదవండి :
బండి మీద అమ్మే "బఠాణీ చాట్" - ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోండి - టేస్ట్ అద్దిరిపోతుంది!
టేస్టీ అండ్ స్పైసీ "ఉల్లి మిక్చర్" - ఇంట్లోనే నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోండిలా! - రుచి మస్త్!