How to Make Instant Soft Idli in Telugu :హెల్దీ బ్రేక్‌ఫాస్ట్ అంటే చాలా మందికి ఇడ్లీ గుర్తుకు వస్తుంది. ఎందుకంటే టేస్ట్‌తోపాటు తేలిగ్గా అరుగుతూ ఆరోగ్యానికి మేలు చేస్తుందనే ఉద్దేశంతో.. ఎక్కువ మంది దీనిని అల్పాహారంగా తింటుంటారు. అయితే.. వీటిని ఇంట్లో తయారు చేసుకోవాలంటే కాస్త ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. ఈ టిఫిన్ కోసం మినప పప్పు నానబెట్టుకొని.. రుబ్బుకోవాలి. అందులోకి రవ్వ కలిపి పులియబెట్టాలి. ఆ తర్వాత ఇడ్లీలు తయారు చేసుకోవాలి. ఇదంతా చాలా ప్రాసెస్ ఉంటుంది. అయితే.. ఈ ప్రాసెస్ లేకుండా.. పప్పు నానబెట్టే అవసరమే లేకుండా కేవలం నిమిషాల్లో ఎంతో మృదువైన, రుచికరమైన ఇడ్లీలు తయారు చేసుకోవచ్చు. మరి ఆ విధానం ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
కావాల్సిన పదార్థాలు:
- మందపాటి అటుకులు - 1 కప్పు
- పుల్లటి పెరుగు - ఒకటిన్నర కప్పు
- వంట సోడా - అర టీ స్పూన్
- బొంబాయి రవ్వ - 1 కప్పు
- నీరు - తగినన్ని
- ఉప్పు- రుచికి సరిపడా
తయారీ విధానం:
- ముందుగా ఓ గిన్నెలోకి అటుకులు తీసుకుని నీళ్లు పోసి శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత అవి మునిగే వరకు నీళ్లు పోసి ఓ 30 నిమిషాలు నాననివ్వాలి.
- ఇప్పుడు మరో గిన్నెలోకి పుల్లటి పెరుగు, వంట సోడా వేసుకుని ఉండలు లేకుండా బాగా కలపాలి. బాగా విస్క్ చేసిన తర్వాత ఓ 5 నిమిషాలు పక్కకు పెట్టాలి. ఇలా చేయడం వల్ల పెరుగు పొంగుతుంది.
- ఇప్పుడు పొంగిన పెరుగులోకి బొంబాయి రవ్వ బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత 30 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి.
- 30 నిమిషాల తర్వాత బాగా నానిన రవ్వ మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఆ తర్వాత అంతకుముందు నానబెట్టుకున్న అటుకులను మిక్సీ జార్లో వేసుకుని అర కప్పు నీళ్లు పోసి మెత్తని పేస్ట్‌లాగా గ్రైండ్ చేసుకోవాలి.