తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

చెట్టినాడ్ టమాటా చట్నీ - టిఫెన్, అన్నంలోకి సూపర్ కాంబో - ఈజీగా ప్రిపేర్ చేయండిలా! - Chettinad Tomato Chutney

టిఫెన్ అద్భుతంగా ఆస్వాదించాలంటే.. చట్నీ కేక పెట్టించేలా ఉండాలి. అలాంటి చట్నీల్లో ఒకటి చెట్టినాడ్ టమాటా చట్నీ. మరి, దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం.

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Chettinad Tomato Chutney
How to Make Chettinad Tomato Chutney (ETV Bharat)

How to Make Chettinad Tomato Chutney :టిఫెన్ తినడానికైనా.. భోజనం చేయడానికైనా.. కొన్ని చట్నీలు అద్దిరిపోయేలా ఉంటాయి. అలాంటి వాటిల్లో టమాటా చట్నీ ముందు ప్లేసులో ఉంటుంది. అయితే.. ఈ టమాటా చట్నీని ఎన్నో రకాలుగా తయారు చేస్తారు. ఇప్పుడు ఇక్కడ మనం చెట్టినాడ్ స్టైల్ టమాటా చట్నీ ప్రిపేర్ చేద్దాం. ఇది టిఫెన్ తోపాటు రైస్ లోకి కూడా సూపర్​గా ఉంటుంది. మరి.. దీన్ని తయారు చేయడానికి ఎలాంటి పదార్థాలు కావాలి? ప్రిపరేషన్ పద్ధతి ఏంటి? అన్నది ఈ స్టోరీలో చూద్దాం.

కావాల్సిన పదార్థాలు..

  • ఆయిల్ - టేబుల్ స్పూన్
  • ఉల్లిపాయలు - అరకప్పు (సన్నగా తరుక్కోవాలి)
  • వెల్లుల్లి రెబ్బలు - 10
  • ఇంగువ - హాఫ్ టీస్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా
  • టమాటాలు - 3 సన్నగా కట్ చేసి వేయాలి.
  • ఎండు మిరపకాయలు - ఆరు నుంచి ఏడు
  • ఎర్ర కారం - ఒక స్పూన్ (స్పైసీ కావాల్సినదాన్ని బట్టి తగ్గించడం, పెంచడం చేయాలి)
  • చింతపండు - పెద్ద సైజు నిమ్మకాయంత

తయారీ విధానం..

  • ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి అందులో టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి.
  • అది వేగిన తర్వాత ఉల్లిపాయ, టమాటా ముక్కలు వేయాలి.
  • తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి.
  • కాసేపటి తర్వాత మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేయాలి.
  • అనంతరం మూత పెట్టి.. టమాటా, ఉల్లిపాయ సాఫ్ట్​గా అయ్యేంత వరకూ ఉడికించాలి
  • ఇదంతా ఉడకడానికి ఐదారు నిమిషాలు పడుతుంది.. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి
  • ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ మిశ్రమం పూర్తిగా చల్లారాలి.
  • చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకోవాలి. అందులోని కొద్దిగా బెల్లం కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి.
  • తర్వాత స్టౌమీద పాన్ పెట్టి రెండు మూడు టేబుల్ స్పూన్ల్ ఆయిల్ వేయండి
  • వేడెక్కిన తర్వాత ఆఫ్ టీస్పూన్ ఆవాలు, ఆఫ్ స్పూన్ మినపప్పు వేయాలి.
  • తర్వాత కరివేపాకు వేయాలి. కావాలంటే ఒక ఎండు మిర్చి వేసుకోవచ్చు.
  • పోపు సిద్ధమైన తర్వాత ఇందులో.. మిక్సీ పట్టుకున్న టమాటా మిశ్రమం వేయాలి.
  • రెండు నిమిషాల పాటు అటూ ఇటూ కలిపిన తర్వాత చట్నీ చక్కగా, చిక్కగా తయారవుతుంది.
  • అంతే.. అద్దిరిపోయే చెట్టినాడ్ టమాటో చట్నీ రెడీ అయిపోతుంది.
  • టిఫెన్లోకి, రైస్ లోకి ఎందులోకైనా సూపర్ గా ఉంటుందీ చట్నీ. కావాలంటే.. మీరు కూడా ట్రై చేయండి.

ABOUT THE AUTHOR

...view details