Boneless Fish Fry Biryani in Telugu :మనలో చాలా మందికి చేపల ఫ్రై, పులుసు అంటే ఎంతో ఇష్టం. వారానికోసారి కాకాపోయినా కూడా.. నెలకి రెండు మూడుసార్లు తినే వారు ఎక్కువ మందే ఉన్నారు. అయితే.. చేప ముక్కలతో ఎప్పుడూ ఫ్రై, పులుసే కాకుండా కమ్మటి దమ్ బిర్యానీ కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే..చికెన్ బిర్యానీనిమించిన రుచిని ఆస్వాదించవచ్చు. మరి ఇక ఆలస్యం చేయకుండా "ఫిష్ ఫ్రై బిర్యానీ" ఎలా చేయాలో చూసేద్దామా..
- కావాల్సిన పదార్ధాలు :
- బాస్మతి రైస్-2 కప్పులు (గంటపాటు నానబెట్టుకోవాలి.)
- అనాసపువ్వులు-2
- నీళ్లు -2 లీటర్లు
- దాల్చినచెక్క-3
- లవంగాలు-6
- మరాఠి మొగ్గ-2
- యాలకులు-6
- ఉప్పు రుచికి సరిపడా
- బిర్యానీ ఆకులు-2
- పచ్చిమిర్చి-3
- అల్లం వెల్లుల్లి పేస్ట్-టీస్పూన్
- షాజీరా- అరటీస్పూన్
ఫిష్ మ్యారినేషన్ కోసం..
- బోన్‌లెస్ ఫిష్ ముక్కలు-అరకేజీ
- కొత్తిమీర తరుగు-పావుకప్పు
- పుదీనా తరుగు-పావుకప్పు
- ఫ్రైడ్ ఆనియన్స్-పావుకప్పు
- గరం మసాలా-టీస్పూన్
- ధనియాలపొడి-టీస్పూన్
- యాలకులపొడి-టీస్పూన్
- పసుపు-పావుటీస్పూన్
- కారం-ఒకటిన్నర టేబుల్‌స్పూన్లు
- వేపిన జీలకర్ర పొడి-టీస్పూన్
- మిరియాలపొడి-అరటీస్పూన్
- అల్లంవెల్లుల్లి పేస్ట్-ఒకటిన్నర టేబుల్‌స్పూన్లు
- చిలికిన పెరుగు-కప్పు
- కొద్దిగా నూనె
- షాజీరా-టీస్పూన్
- లవంగాలు-3
- దాల్చినచెక్క
- మరాఠి మొగ్గ-చిన్నది
- కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్-టీస్పూన్
ఫిష్ ఫ్రై కోసం..
- మైదా పిండి-పావుకప్పు
- పచ్చిమిర్చి(1) తరుగు
- గరం మసాలా-అరటీస్పూన్
- అల్లం తరుగు-అరటీస్పూన్
- ధనియాలపొడి-అరటీస్పూన్
- మిరియాలపొడి-పావుటీస్పూన్
- వేపిన జీలకర్ర పొడి-అరటీస్పూన్
- కారం-టీస్పూన్
- కరివేపాకు తరుగు-కొద్దిగా
- కార్న్‌ఫ్లోర్-ఒకటిన్నర టేబుల్‌స్పూన్లు
- నిమ్మరసం-కొద్దిగా
తయారీ విధానం :
- ముందుగా అడుగు మందంగా ఉండే బిర్యానీ హండీలో.. కొత్తిమీర, పుదీనా తరుగు, ఫ్రైడ్ ఆనియన్స్, గరం మసాలా, ఉప్పు, ధనియాలపొడి, యాలకులపొడి, పసుపు, కారం, వేపిన జీలకర్ర పొడి, మిరియాలపొడి, అల్లంవెల్లుల్లి పేస్ట్, చిలికిన పెరుగు, నూనె, షాజీరా, లవంగాలు, దాల్చినచెక్క, మరాఠి మొగ్గ వేసి బాగా మిక్స్ చేయండి. (మీరు పెరుగుకు బదులుగా చిక్కని కొబ్బరిపాలు అరకప్పు ఉపయోగించవచ్చు)
- మసాలాలు బాగా కలిపిన తర్వాత శుభ్రంగా కడిగిన బోన్‌లెస్ ఫిష్ ముక్కలు, కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసి కలపాలి.
- ముక్కలకు మసాలా మిశ్రమం బాగా పట్టించాలి.
- ఈ మిశ్రమాన్ని కనీసం గంటసేపు పక్కన పెట్టాలి.
- ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో మైదా పిండి, పచ్చిమిర్చి తరుగు, గరం మసాలా, అల్లం తరుగు, మిరియాలపొడి, ధనియాలపొడి, వేపిన జీలకర్ర పొడి, కారం, కరివేపాకు తరుగు, కార్న్‌ఫ్లోర్, నిమ్మరసం వేసి మిక్స్ చేయండి. ఆపై కొద్దిగా నీళ్లు పోసి కలపండి.
- తర్వాత మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలను కార్న్‌ఫ్లోర్ మిశ్రమంలో వేయండి.
- ఇప్పుడు చేప ముక్కలకు కార్న్‌ఫ్లోర్ మిశ్రమం బాగా పట్టించండి.
- తర్వాత చేప ముక్కలు ఫ్రై చేయడం కోసం స్టౌపై కడాయి పెట్టండి. ఇందులో నూనె పోసి వేడి చేయండి.
- నూనె వేడయ్యాక స్టౌ మీడియం ఫ్లేమ్‌లో ఉంచి చేప ముక్కలు వేయండి. వీటిని క్రిస్పీగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి.
- ఇప్పుడు రైస్ ఉడికించడం కోసం స్టౌపై గిన్నె పెట్టండి. వాటర్ వేడయ్యాక అనాసపువ్వులు, లవంగాలు, దాల్చినచెక్క, యాలకులు, మరాఠి మొగ్గ, బిర్యానీ ఆకులు వేయండి.
- అలాగే కొద్దిగా ఉప్పు, షాజీరా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపండి. నీళ్లు బాగా మరుగున్నప్పుడు బాస్మతి బియ్యం వేసుకోండి.
- అలాగే ఇప్పుడు మరుగుతున్న వాటర్ బిర్యానీ హండీ మిశ్రమంలో ఒక కప్పు పోసుకోండి. (ఇలా చేస్తే దమ్ మాడిపోకుండా ఉంటుంది)
- అలాగే ఇందులో కొద్దిగా నిమ్మరసం, మూడు టేబుల్స్పూన్ల చేపలు వేయించుకున్న నూనె పోసి బాగా కలపండి.
- ఇప్పుడు 80 శాతం ఉడికించుకున్న రైస్.. జాలీ గరిటె సహాయంతో బిర్యానీ హండీలో స్ప్రెడ్ చేసుకోండి.
- రైస్‌పైన కొత్తిమీర, పుదీనా తరుగు, కరివేపాకులు వేసి, గరం మసాలా కొద్దిగా చల్లుకోండి.
- ఇప్పుడు క్రిస్పీగా వేపుకున్న చేప ముక్కలు, ఫ్రైడ్ ఆనియన్స్ వేయండి. అలాగే పైన కొద్దిగా ఆయిల్ చల్లుకోండి.
- తర్వాత మైదా పిండి ముద్దని హండీ అంచుల వెంట పెట్టి దమ్ బయటకు పోకుండా మూత పెట్టండి.
- దీనిని 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద.. ఆపై 3 నిమిషాలు లో ఫ్లేమ్‌లో దమ్ చేసుకుని స్టౌ ఆఫ్ చేయండి.
- తర్వాత అరగంటపాటు అలా వదిలేయండి.
- అంతే ఇలా సింపుల్‌గా చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ ఫిష్ బిర్యానీ రెడీ!
- నచ్చితే ఇలా ఓ సారి ట్రై చేయండి.
ఇవి కూడా చదవండి :
ఓసారి ఇలా "చేపల ఫ్రై" చేసి చూడండి - తక్కువ సమయంలో అదుర్స్ అనిపించే టేస్ట్!
ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో తింటే డేంజర్ - ఇంట్లోనే "ఎగ్ నూడుల్స్" ఇలా చేసుకోండి!