How to avoid Bad Smell from Bathroom:దీపావళి సందడి మొదలైంది. ఈ పండగ వేళ ఇంటికి అతిథులు వస్తుంటారు. ఈ క్రమంలో ముందుగానే ఇంటిని క్లీన్ చేస్తుంటారు మహిళలు. అయితే హోమ్ క్లీన్ చేయడం ఒక ఎత్తయితే.. బాత్రూమ్ క్లీనింగ్ మరోలా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎక్కువ సేపు శ్రమించాల్సి వస్తుంది. అయితే ఒక్కోసారి టాయిలెట్స్ ఎంత క్లీన్ చేసినా బాత్రూం నుంచి చెడు వాసన వస్తూనే ఉంటుంది. ఇక మనుషులు ఎక్కువైతే ఈ సమస్య మరింత తీవ్రంగా మారుతుంది. అలాంటప్పుడు ఈ చిన్ని చిట్కాలు ట్రై చేయమంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
సుగంధ నూనెలు ప్రయత్నించండి: బాత్రూమ్‌లు ఫ్రెష్‌గా ఉండేందుకు ఇప్పుడు మార్కెట్లో బోలెడు ఫ్రెషనర్లు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వీటిని ఉపయోగించవచ్చు. లేదంటే ఎసెన్షియల్ ఆయిల్స్‌ను స్ప్రే చేసినా ఫలితం ఉంటుంది. ఎందుకంటే ఈ నూనెల్లోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు.. ఫంగస్‌లు, బ్యాక్టీరియాలను పోగొడతాయి. కాబట్టి లావెండర్ లేదా మింట్ ఎసెన్షియల్ ఆయిల్లో ఓ కాటన్ బాల్ ముంచి దాన్నిబాత్రూమ్‌లో ఓ మూలన ఉంచండి. ఇలా చేయడం వల్ల దుర్వాసన తగ్గిపోతుంది.
వెనిగర్: ముందుగా ఎప్పటిలానే బాత్రూమ్ను శుభ్రం చేయాలి. ఆ తర్వాత ఒక బకెట్ నీళ్లలో సుమారు ఒక గ్లాసు వెనిగర్‌ను కలిపి బాత్రూంలో పోసి సుమారు గంట సేపు నాననివ్వండి. ఆపై బాత్రూమ్ను మళ్లీ నీటితో శుభ్రం చేస్తే వాసన రాకుండా ఉంటుంది.
పేస్ట్:ఏదైనా మంచి సువాసన కలిగిన టూత్‌పేస్ట్‌కి అక్కడక్కడ పిన్నుతో హోల్స్ పెట్టి ఆ ట్యూబ్‌ని మీ ఫ్లష్‌లో వేయాలి. దీని వల్ల ఫ్లష్ కొట్టిన ప్రతిసారి మంచి స్మెల్ స్ప్రెడ్ అవ్వడమే కాకుండా టాయిలెట్ క్లీన్‌గా ఉంటుంది.
బేకింగ్ సోడా: టాయిలెట్స్ ఎంత క్లీన్ చేసినా మురికి పోకుండా వాసన వస్తూ ఉంటే.. బేకింగ్ సోడాలో కాస్త డిష్‌వాషర్ లిక్విడ్ వేసి మిక్స్ చేసి టాయిలెట్ సీట్స్‌పై పోసి బాగా రబ్ చేసి వదిలేయాలి. ఒక పది నిమిషాల తర్వాత టాయిలెట్స్ క్లీన్ చేస్తే తెల్లగా మారడమే కాకుండా దుర్వాసన కూడా పోతుంది.