Horoscope Today January 6th 2025 : 2025 జనవరి 6వ తేదీ (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) : మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో ఇతరుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. స్వబుద్ధితో తీసుకునే స్థిరమైన నిర్ణయాలు దీర్ఘకాలంలో సత్ఫలితాలిస్తాయి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల ప్రవర్తన మనస్థాపం కలిగిస్తుంది. తీర్థయాత్రలకు ప్రణాళికలు వేస్తారు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.
వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులకు వ్యాపారపరంగా అద్బుతమైన విజయాలు సాధిస్తారు. గణనీయమైన లాభాలను అందుకుంటారు. మీ పనితీరుకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇష్టదేవతారాధన శుభకరం.
మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. అదృష్టం వరించి సంపదలు కలిసి వస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని సరదాగా గడుపుతారు. సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శివారాధన శ్రేయస్కరం.
కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తవుతాయి. వృత్తి పరంగా జరిగే ముఖ్యమైన సమావేశాలు, చర్చలలో మీ వాక్చాతుర్యంతో అందరిని ఆకట్టుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగులకు అధికార పరిధి పెరుగుతుంది. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. అవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం దృఢ పడుతుంది. గణపతి ప్రార్ధన శుభప్రదం.
సింహం (Leo) : సింహరాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంటుంది. పనుల్లో జాప్యం, సవాళ్లు చికాకు కలిగిస్తాయి. కుటుంబ కలహాలతో మనశ్శాంతి లోపిస్తుంది. ధ్యానం, ఆధ్యాత్మికతతో మానసికంగా ప్రశాంతంగా ఉండవచ్చు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వైద్యపరమైన వ్యయాలకు అవకాశం ఉంది. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. కార్యసిద్ధి హనుమ ఆరాధన శ్రేయస్కరం.
కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయం సిద్ధిస్తుంది. ధార్మిక కార్యక్రమాల ద్వారా సులభంగా పేరు, ప్రఖ్యాతులను పొందడానికి అవకాశం ఉంది. వ్యాపారులకు, వారి భాగస్వాములకు మధ్య చాలా అనుకూలత ఉంటుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. స్నేహితులతో మంచి సమయాన్ని గడుపుతారు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. శ్రీలక్ష్మీ ధ్యానం శుభప్రదం.
తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని పనులు సకాలంలో విజయవంతం కావడం వల్ల ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. సహచరుల సహకారంతో వృత్తి పరంగా ప్రయోజనం పొందుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.
వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా కాదు. గ్రహసంచారం అనుకూలంగా లేదు కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ రోజు ఎవరితోనూ గొడవలు పెట్టుకోకుండా మౌనంగా ఉంటే మంచిది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకుండా ఉంటే మంచిది. వీలైతే ప్రయాణాలు వాయిదా వేయండి. శివ పంచాక్షరీ మంత్రజపం శక్తినిస్తుంది.
ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగించవచ్చు. కోపాన్ని అదుపులో పెట్టుకుంటే మంచిది. సమావేశాలు, చర్చలు, వాదనలు దూరంగా ఉంటే మంచిది. కళారంగం వారికి ఫలవంతంగా ఉంటుంది. అనేక అవకాశాలు అందుకుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. నవగ్రహ శ్లోకాలు పఠించడం మంచిది.
మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కార్యసిద్ధి, ఆర్థికలాభం, కుటుంబ సౌఖ్యం ఉంటాయి. విహారయాత్రలకువ వెళ్లే అవకాశముంది. ఆస్తి వ్యవహారాలపై శ్రద్ధ పెడతారు. ఉద్యోగులకు, విద్యార్థులకు అనుకూలం. వ్యాపారంలో పోటీదారులను అధిగమిస్తారు. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.
కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. క్లిష్టమైన నిర్ణయం తీసుకోవడంలో సందిగ్దత నెలకొంటుంది. వృథా ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. కోపాన్ని అదుపులో ఉంచుకొని జాగ్రత్తగా మాట్లాడకపోతే కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు రావచ్చు. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత పెట్టాలి. ఆరోగ్యపై శ్రద్ధ పెట్టాలి. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ శుభకరం.
మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు విజయవంతం కావడం వల్ల ఉత్సాహంగా కొత్త పనులు ప్రారంభిస్తారు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ప్రియమైన వారితో ఒక విహారయాత్రకు వెళ్తారు. ఊహించని ఆర్థిక లాభాలకు అవకాశం ఉంది. ధార్మిక కార్యకలాపాలు, తీర్థయాత్రలపైన ఖర్చు చేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ సందర్శన శుభప్రదం.