ETV Bharat / opinion

హ్యాట్రిక్​ కోసం ఆప్​- ఈసారైనా గెలవాలని బీజేపీ- కాంగ్రెస్ ఒంటరి పోరు- దిల్లీలో పైచేయి ఎవరిదో? - DELHI ASSEMBLY ELECTION 2025

దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు- బీజేపీ, ఆప్, కాంగ్రెస్ బలాబలాలు

Delhi Polls SWOT Analysis
Delhi Polls SWOT Analysis (ETV Bharat, ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 7, 2025, 5:39 PM IST

Delhi Polls SWOT Analysis : దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది. గతంలో దశాబ్దాల తరబడి దిల్లీని ఏలిన కాంగ్రెస్‌కు, వరుసగా దిల్లీ ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్న ఆప్‌కు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మధ్య రసవత్తర పోరు జరగనుంది. దేశ రాజధాని ప్రాంతంలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో బలమైన అభ్యర్థులతో సత్తా చాటేందుకు ఈ మూడు పార్టీలు ఎన్నికల వ్యూహాలను సిద్ధం చేసుకున్నాయి. ఈ ఎన్నికల్లో దిల్లీ పరిధిలోని స్థానిక సమస్యలే రాజకీయ పార్టీలకు ప్రధాన అజెండాగా మారనున్నాయి. ఉచిత విద్యుత్, నీరు ఇతరత్రా ఉచిత హామీలతో ప్రజలను ప్రధానంగా ఆకట్టుకునేందుకు మూడు పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి.

హ్యాట్రిక్​పైనే ఆప్​ ఫోకస్!
మరోసారి దిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవాలనే బలమైన సంకల్పంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల బరిలోకి దిగింది. మొత్తం 70 స్థానాల్లో ఆప్ ఒంటరిగా పోటీ చేస్తోంది. ఆప్ నుంచి సీఎం అభ్యర్థిగా అరవింద్ కేజ్రీవాలే ఉంటారు. సీఎంగా ఆతిశీకి దిల్లీ పగ్గాలు అప్పగించే కార్యక్రమంలో ఈ విషయాన్ని కేజ్రీవాల్ బాహాటంగానే చెప్పారు. గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధి పనులే ఆప్‌ను గెలిపిస్తాయని ఆయన పదేపదే అంటున్నారు. ఓ వైపు బీజేపీని, మరోవైపు కాంగ్రెస్‌ను కేజ్రీవాల్ విమర్శిస్తూ ముందుకు సాగుతున్నారు.

బలాలు : ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం దిల్లీ స్థానిక సమస్యలపై బాగా దృష్టి పెట్టింది. ప్రధానంగా విద్య, ఆరోగ్య విభాగాల్లో బాగా పనిచేసింది! వీటికి తోడుగా ఇటీవలే అరవింద్ కేజ్రీవాల్ కొన్ని ఉచిత హామీలను ప్రకటించారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి, మహిళలకు ప్రతినెలా ఆర్థిక సాయం, దళిత విద్యార్థుల విదేశీ విద్యకు ఆర్థిక చేయూత వంటి పథకాలను ఆకర్షణీయంగా ఉన్నాయి.

అవసరమైతే సీఎం పదవినైనా వదులుకునేందుకు సిద్ధం అనే సందేశాన్ని కేజ్రీవాల్ ఇవ్వడం కూడా ప్లస్ పాయింటుగా మారొచ్చు. దిల్లీ ప్రజల లోకల్ ఛాయిస్‌గా ఆప్ ఉంటుందని కేజ్రీవాల్ అంటున్నారు. ఈ కోణంలోనే ఆయన ప్రచారం చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలకు దిల్లీ ప్రజల సమస్యలు అర్థం కావడం లేదని ఆప్ నేతలు విమర్శిస్తున్నారు. ఈ విధమైన ప్రచార వ్యూహం ఆప్ కలిసొచ్చే ఛాన్స్ ఉంది. కేజ్రీవాల్, మనీశ్ సిసోదియా లాంటి అగ్రనేతలు జైలుకు వెళ్లినా ఆప్ క్యాడర్ సుస్థిరంగా నిలవడం మరో కీలకాంశం.

బలహీనతలు : అవినీతి కేసుల్లో చాలామంది నేతలు ఇరుక్కోవడం ఆప్‌కు వ్యతిరేకతగా మారే అవకాశం ఉండొచ్చు. కేజ్రీవాల్, మనీశ్ సిసోదియా లాంటి అగ్రనేతలు జైలుకు వెళ్లి రావడం అనేది నెగెటివ్ కావచ్చు. పలువురు ఆప్ అగ్రనేతలు బీజేపీలోకి చేరారు. దీంతో ఆయా స్థానాల్లో బీజేపీకి విజయావకాశాలు పెరగనున్నాయి. దిల్లీ సీఎం అధికారిక నివాసం నిర్మాణంలో అవినీతి, లిక్కర్ స్కాం అభియోగాలు ఆప్ ప్రతిష్ఠను మసకబార్చాయనే అభిప్రాయం ఉంది. పాత నేతలకే అసెంబ్లీ టికెట్ల కేటాయింపు అనేది ఆప్‌కు తలనొప్పిగా మారొచ్చు. పాత నేతల్లో చాలామంది ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. అలాంటి స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్‌లు రాణించే అవకాశాలు ఉంటాయి. కొంతమంది కీలక నేతలకు కేజ్రీవాల్ అసెంబ్లీ స్థానాలను మార్చారు. దీనివల్ల ఆయా అసెంబ్లీ స్థానాల్లో పార్టీ క్యాడర్ కొంత అయోమయానికి గురైంది.

బీజేపీకి లోక్​సభ ట్రెండ్ రిపీట్​ అవుతుందా?
గత లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేరుతో ఎన్నికల బరిలోకి బీజేపీ దిగింది. మొత్తం 7 లోక్‌సభ స్థానాలను కూడా కైవసం చేసుకుంది. కమలదళం దిల్లీలో మునుపటి కంటే చాలా స్ట్రాంగ్ అయింది అని చెప్పడానికి ఇది పెద్ద సంకేతం. దిల్లీలో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థాయిలో ఫలితాలను బీజేపీ సాధించలేకపోయింది. మారిన ఈ ట్రెండ్ ఈసారి కాషాయ పార్టీకి కలిసొచ్చే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, దిల్లీలో చేపట్టిన పలు అభివృద్ధి ప్రాజెక్టుల గురించి ప్రచారంలో బీజేపీ అభ్యర్థులు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఆప్ నేతలు చేసిన 'స్కామ్స్' గురించి వివరిస్తూ ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.

బలాలు : బీజేపీకి దిల్లీలో ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఈ విషయం స్పష్టమైంది. ఆప్, కాంగ్రెస్ నుంచి పలువురు కీలక నేతలు బీజేపీలో చేరారు. వారి వెంట బీజేపీలోకి వచ్చిన క్యాడర్‌తో ఓటు బ్యాంకు చాలా వరకు పెరిగింది. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు కాషాయ పార్టీకి ప్లస్ పాయింట్ కానున్నాయి. దిల్లీలో డబుల్ ఇంజిన్ సర్కారు వస్తే కేంద్ర ప్రభుత్వ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులు స్థానికంగా అమల్లోకి వస్తాయనే అంశం ప్రజలను ఆకట్టుకునే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చి దిల్లీలో నివసిస్తున్న వారి అంశాన్ని బీజేపీ ప్రధాన అస్త్రంగా మార్చుకునే ఛాన్స్ ఉంది. దిల్లీ లిక్కర్ స్కాం, సీఎం అధికారిక నివాసం నిర్మాణంలో అవకతవకల అంశాన్ని తనకు అనుకూలంగా, ఆప్‌కు వ్యతిరేకంగా బీజేపీ చేసే అవకాశం ఉంది.

బలహీనతలు : సీఎం అభ్యర్థి లేకుండానే బీజేపీ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. కేజ్రీవాల్ స్థాయిలో జనాకర్షణ చేయగలిగే నేతలు కాషాయ పార్టీలో లేరు. ఇతర పార్టీల నుంచి కొత్తగా బీజేపీలోకి వచ్చిన వారికి, చాలా కాలంగా బీజేపీలో ఉంటున్న క్యాడర్‌కు మధ్య ఇప్పటికిప్పుడు సమన్వయం కుదర్చడం అనేది సాధ్యపడే అంశం కాదు. ఇది ప్రతికూలించవచ్చు. ఒకవేళ దిల్లీలో కాంగ్రెస్ అంతగా రాణించకపోతే, అది ఆప్‌కు ప్లస్ పాయింటుగా మారొచ్చు. కాంగ్రెస్, ఆప్ ఒంటరిగా పోటీ చేస్తుండటం వల్ల బీజేపీ విజయావకాశాలు తగ్గాయనే మాట వినిపిస్తోంది.

ఒంటరి పోరాటం కాంగ్రెస్​కు కలిసివచ్చేనా?
ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి ఆప్ షాక్ ఇచ్చింది. కాంగ్రెస్‌తో చేతులు కలిపే ప్రసక్తే లేదని ఆప్ వెల్లడించింది. దీంతో ఒంటరి పోటీ విషయంలో కాంగ్రెస్ ఆలస్యంగా ఒక నిర్ణయానికి వచ్చింది. ఫలితంగా అభ్యర్థుల ప్రకటన విషయంలో, ఎన్నికల వ్యూహాన్ని సిద్దం చేసుకునే అంశంలో కాంగ్రెస్ వెనుకబడిపోయింది. కాంగ్రెస్ పార్టీకి దిల్లీలో క్షేత్ర స్థాయిలో బలమైన క్యాడర్ ఉంది. అయితే అందులో చాలావరకు ఇప్పటికే ఆప్, బీజేపీకి వలస పోయింది. మిగిలిన క్యాడర్‌ను ఎంత సమర్థంగా వాడుకుంటుంది అనే దానిపై కాంగ్రెస్ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.

బలాలు : సీనియర్ నేతలే కాంగ్రెస్ పార్టీకి ప్రధాన బలం. బలమైన ఫాలోయింగ్ కలిగిన చాలామంది నేతలు పలు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఉనికిని ఇంకా సజీవంగా ఉంచారు. మైనారిటీలు, పేద వర్గాలు కాంగ్రెస్‌కు ఓటుబ్యాంకుగా ఉండటం ముఖ్యంగా కలిసి వచ్చే అంశం. ఆప్‌ అగ్రనేతలు ఎదుర్కొంటున్న అవినీతి ఆరోపణలు కాంగ్రెస్‌కు గెలుపునకు అవకాశంగా మారొచ్చు. ఇక ఒంటరిగా పోటీ చేయడం కూడా కలిసొచ్చే అంశం. ఒకవేళ ఆప్‌తో కలిసి పోటీ చేసి ఉంటే తక్కువ స్థానాలే కాంగ్రెస్‌కు దక్కేవి. ఇప్పుడు ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుండటం వల్ల కొన్నైనా గెల్చుకునే అవకాశాలు ఉంటాయి. ఆప్ నేతలపై ఉన్న ప్రజా వ్యతిరేకత ఓట్లుగా మారి కాంగ్రెస్ అభ్యర్థులకు కలిసి రావొచ్చు.

బలహీనతలు : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వరకు ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా సైలెంట్​గా ఉంది. రాజకీయంగా ఆప్‌ ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలూ చేయలేదు. కేవలం బీజేపీ మాత్రమే ఆ పని చేసింది. దీంతో ప్రజలు ఆప్‌కు పోటీ ఇచ్చే సత్తా బీజేపీకే ఉందని భావిస్తున్నారు. పలువురు అగ్రనేతల వలసలు కాంగ్రెస్‌కు మైనస్ పాయింట్ అవుతాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.