ETV Bharat / entertainment

అద్దె కట్టలేక రైల్వే ప్లాట్ ఫామ్​పై నిద్ర - కట్ చేస్తే బీటౌన్​లో మోస్ట్ పాపులర్ యాక్టర్​గా! - ACTOR SLEPT ON RAILWAY PLATFORM

అద్దె కట్టలేక రైల్వే ప్లాట్ ఫామ్​పై నిద్రించిన షారుక్ 'రీల్' తండ్రి - కట్ చేస్తే బీటౌన్​లో మోస్ట్ వాంటెడ్​ యాక్టర్ ఈయనే!

Actor Slept On Railway Platform
Actor Slept On Railway Platform (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 7, 2025, 5:27 PM IST

40 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రయాణం చేసి దాదాపు 540కిపైగా చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించారు ఆయన. తన కెరీర్​లో ఎన్నో హిట్​ సినిమాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు. భాషతో సంబంధం లేకుండా అంతర్జాతీయ స్థాయిలో పాపులర్ అయ్యారు. బీటౌన్​లోనే మోస్ట్ వాంటెడ్​ నటుడిగా గుర్తింపు పొందారు. అయితే కెరీర్ తొలి నాళ్లలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రూమ్​కి అద్దె కట్టలేక రాత్రి పూట రైల్వే స్టేషన్లలో నిద్రపోయిన అనుభవాలు ఉన్నాయట. ఇంతకీ ఆయన ఎవరంటే?

అమ్మకు ఆ అబద్దం చెప్పి!
బాలీవుడ్​లోని బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టులలో అనుపమ్ ఖేర్ ఒకరు. ఆయన 40 ఏళ్ల సినీ ప్రయాణంలో విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే తనకు 9వ తరగతి చదువుతున్నప్పుడే నటనపై ఆసక్తి ఏర్పడిందని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. యాక్టింగ్ కోర్సులో చేరడం కోసం తన తల్లికి అబద్దం చెప్పి మరీ రూ.100 తీసుకున్నానని అన్నారు. ఆ తర్వాత డబ్బుల్లేక రైల్వే స్టేషన్లలో నిద్రపోయానని వెల్లడించారు.

ముంబయికి మారిన మకాం
సినిమా అవకాశాల కోసం అనుపమ్ ఖేర్ చండీగఢ్ నుంచి ముంబయికి మకాం మార్చారు. అక్కడ డ్రామా స్కూల్​లో టీచర్​గా పనిచేశారు. అయినప్పటికీ నాటకాలను వదలలేదు. అయితే రూమ్​కి అద్దె కట్టె స్తోమత లేక బీచ్​లలో ఒక్కొసారి ఉండేవారట. రాత్రివేళ్లల్లో రైల్వే ప్లాట్‌ ఫామ్​లపై పడుకునేవారని ఒకానొక సందర్భంలో చెప్పుకొచ్చారు.

28 ఏళ్ల వయసులో 65 ఏళ్ల వృద్ధుడిగా రోల్
1984లో విడుదలైన 'సారాంశ్‌'లో అనుపమ్ ఖేర్ తొలిసారి మెరిశారు. అప్పటికి అనుపమ్ ఖేర్ వయసు 28 ఏళ్లు. అయితే ఆ సినిమాలో ఆయన ఓ 65 ఏళ్ల వృద్ధుడిగా కనిపించారు. తొలిసారి అయినప్పటికీ తనదైన నటనతో ఆకట్టుకోవడం వల్ల ప్రేక్షకుల మదిలో మంచి గుర్తింపు పొందారు.

వరుస హిట్లు
'కుచ్ కుచ్ హోతా హై', 'ఖోస్లా కా ఘోస్లా', 'అప్నా సప్నా మనీ మనీ' వంటి సినిమాలు అనుపమ్ ఖేర్​కు మంచి పేరును తెచ్చిపెట్టాయి. 1995లో ఆదిత్య చోప్రా తెరకెక్కించిన 'దిల్‌ వాలే దుల్హనియా లే జాయేంగే'లో షారుక్ ఖాన్ తండ్రిగా అనుపమ్ ఖేర్ నటించారు. ఆ తర్వాత కెరీర్​లో వెనుదిరగకుండా పలు భాషల్లో వందలాది చిత్రాల్లో నటించారు. ఎన్నో హిట్​ సినిమాల్లో కీలక పాత్ర పోషించారు.

రూ.35 సంపాదనతో ఇంటిని పోషించేవారు! కట్ చేస్తే ఇండస్ట్రీకి 10 రూ.వంద కోట్ల సినిమాలు ఇచ్చిన డైరెక్టర్!

ఒక్క సీన్ కోసం రూ.25 కోట్లు ఖర్చు!- ఆ సినిమా ఏదో తెలుసా? - The Most Expensive Movie Scene

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.