తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

ప్రధాని మోదీ 300 రోజులూ తింటానన్న మఖానాతో - అద్దిరిపోయే గుంతపొంగనాలు చేసుకోండిలా! - PHOOL MAKHANA PONGANALU

- రుచికి రుచీ.. ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే పూల్ మఖానా - పిల్లల నుంచి పెద్దలదాకా ఎంతో ఇష్టపడతారు!

Phool Makhana Ponganalu
Phool Makhana Ponganalu (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 24, 2025, 8:00 PM IST

Phool Makhana Ponganalu : తాను సంవత్సరంలో 300 రోజులపాటు మఖానా తింటానని ప్రధాని మోదీ తాజాగా చెప్పారు. దీంతో ఫూల్ మఖానా ట్రెండింగ్​లోకి వచ్చింది. ఫూల్‌ మఖానా అద్భుతమైన పోషకాహారం. రుచిలోనే కాదు, ఆరోగ్యాన్ని అందించడంలోనూ సూపర్. అధిక బరువు తగ్గడంలో ఇది ఎంతగానో తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

అలాంటి మఖానాతో ఎన్నో రకాల స్నాక్స్‌ తయారు చేస్తుంటారు. కానీ, గుంత పొంగనాలు చేసుకొని లాగించొచ్చు అని మీకు తెలుసా? ఈ అల్పాహారం సూపర్​ టేస్టీగా ఉండడంతోపాటు చక్కటి ఆరోగ్యాన్ని అందిస్తుంది. మరి, దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావలసిన పదార్థాలు:

ఫూల్‌మఖానా - కప్పు

రవ్వ - కప్పు

తురిమిన పనీర్‌ - 1/2 కప్పు,

పెరుగు - పావు కప్పు

బంగాళదుంప - ఒకటి

క్యాప్సికం - ఒకటి

క్యారెట్ - 2

తరిగిన కొత్తిమీర - చారెడు

మిరియాల పొడి 1/2 స్పూన్

నిమ్మరసం - 1/2 స్పూన్

జీలకర్ర - స్పూన్

పచ్చిమిర్చి తరుగు - స్పూన్

ఇంగువ - చిటికెడు

ఆయిల్ - 2 స్పూన్లు

ఉప్పు - తగినంత

తయారీ విధానం :

  • ముందుగా బంగాళా దుంపను ఉడికించి, పొట్టుతీసుకొని మెత్తగా మెదుపుకోవాలి.
  • క్యారెట్‌ను చక్కగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి.
  • క్యాప్సికం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టుకొని ఫూల్‌ మఖానా, రవ్వ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.
  • అవి చల్లారిన తర్వాత గ్రైండ్‌ చేసుకోవాలి.
  • అందులో క్యారెట్‌ తురుము, క్యాప్సికం ముక్కలు, పెరుగు, పనీర్, మిరియాల పొడి, కొత్తిమీర, పచ్చిమిర్చి తరుగు, బంగాళదుంప ముద్ద, జీలకర్ర, ఇంగువ వేసి కొద్ది కొద్దిగా వాటర్​ పోస్తూ కలిపి పక్కన పెట్టుకోవాలి.
  • సాధారణంగా గుంత పొంగనాల కోసం చేసే పిండి దోశ పిండిలాగా కాస్త జారుగా ఉంటుంది.
  • ఈ మిక్స్​ చేసుకున్న మఖానా పిండి మాత్రం కాస్త గట్టిగా ఉండాలి.
  • సుమారు పావుగంట పక్కన పెట్టుకున్న తర్వాత నానిన మఖానా పిండికి ఉప్పు, నిమ్మరసం యాడ్ చేసి, మరోసారి కలపాలి.
  • ఆ తర్వాత నిమ్మకాయంత చొప్పున ఉండలుగా చేసుకొని, ఆయిల్ అప్లై చేసిన గుంత పొంగనాల పాత్రలో వేసి స్టౌమీద పెట్టి మూతపెట్టాలి.
  • ఒకవైపు వేగిన తర్వాత, అన్నింటినీ తిప్పి రెండో వైవు కూడా అదేవిధంగా కాల్చుకోవాలి. అంతే, అద్దిరిపోయే మఖానా పొంగనాలు రెడీ అయిపోతాయి.
  • ఈ పొంగనాలను ఏ చట్నీతో తిన్నా, లేదా సాస్‌తో తిన్నా అద్దిరిపోతాయి.
  • పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఎంతో ఇష్టంగా లాగిస్తారు. లంచ్‌బాక్స్‌లోకి కూడా ఎంతో బాగుంటాయి.

ABOUT THE AUTHOR

...view details