తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

జామకాయలను నేరుగా తినడమే కాదు - ఇలా పచ్చడి ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్​ వేరే లెవల్​! - Guava Chutney Recipe

Guava Chutney Recipe : కొందరికి కూరల కంటే రోటి పచ్చడి తెగ నచ్చేస్తుంది. ఇక రోటి పచ్చడి అంటే దోస, బీర, సొర.. వంటి కూరగాయలతో ప్రిపేర్ చేసుకునేవే తెలుసు. అయితే అలాకాకుండా ఈసారి కాస్త వెరైటీగా జామకాయలతో పచ్చడి ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ అద్దిరిపోతుంది! మరి, జామ పచ్చడిని ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

How to Make Guava Chutney
Guava Chutney Recipe (ETV Bharat)

By ETV Bharat Features Team

Published : Aug 29, 2024, 5:26 PM IST

How to Make Guava Chutney in Telugu : మనందరికీ రోటి పచ్చళ్లు అనగానే.. టమాట, దోస, బీర, సొర వంటి కూరగాయలతో ప్రిపేర్ చేసుకునేవి మాత్రమే గుర్తుకొస్తాయి. కానీ, కొన్ని పండ్లతోనూ రోటి పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాంటి ఒక పచ్చడిని ఇప్పుడు మీకోసం తీసుకొచ్చాం. అదే.. జామ పచ్చడి. అదేంటిజామకాయలతో(Guava) పచ్చడి అనుకుంటున్నారా? నిజమే మీరు విన్నది. ఒకసారి ఈ రోటి పచ్చడిని ట్రై చేస్తే మళ్లీ మళ్లీ చేసుకుంటారు. దీన్ని చాలా సింపుల్​గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పైగా అలవాటు లేని రుచి కనుక టేస్ట్ మరింత ప్రత్యేకంగా అనిపిస్తుంది. అంతేకాదు.. ఈ పచ్చడితో ఆరోగ్య ప్రయోజాలు పొందవచ్చంటున్నారు నిపుణులు. ఇంతకీ, జామ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • జామకాయలు - నాలుగు
  • పల్లీలు - కప్పు
  • నిమ్మరసం - రెండు చెంచాలు
  • పచ్చిమిర్చి - 6
  • ఉప్పు - రుచికి సరిపడా
  • నూనె - మూడు స్పూన్లు
  • వెల్లుల్లి తరుగు - ముప్పావు చెంచా
  • ఆవాలు - 1 చెంచా
  • జీలకర్ర - 1 చెంచా
  • శనగపప్పు - 1 చెంచా
  • మినప పప్పు - 1 చెంచా
  • కరివేపాకు రెబ్బలు - నాలుగు
  • ఎండుమిర్చి - 2
  • ఇంగువ - పావు చెంచా
  • కొత్తిమీర - పావు కప్పు

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా కాస్త గట్టిగా ఉండే ఫ్రెష్ జామకాయలను ఎంచుకోవాలి. అదే.. మెత్తటి జామకాయలను తీసుకుంటే పచ్చడి కాస్త తియ్యగా ఉండే ఛాన్స్ ఉంటుంది.
  • ఆపై వాటిని శుభ్రంగా కడిగి నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత చెంచా సహాయంతో జామ ముక్కల్లో గింజలు తీసేసుకోవాలి. అలా అన్ని జామకాయల్లో గింజలు తీసేసుకోవాలి.
  • అనంతరం వాటిని రుబ్బుకోవడానికి వీలుగా కాస్త మీడియం సైజ్​ ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి అందులో కట్​ చేసుకున్న జామ ముక్కలు వేసి కొద్దిగా పసుపు, కొన్ని నీళ్లు పోసి సన్నని సెగ మీద ముక్కలు మెత్తగా అయ్యేవరకు ఉడికించుకోవాలి.
  • అదే విధంగా మరో స్టవ్​ ఆన్​ చేసి పల్లీలు వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి. మళ్లీ అదే పాన్​లో కొద్దిగా నూనె వేసి పచ్చిమిర్చిని వేయించుకోవాలి.
  • ఇవన్నీ చల్లారాక.. ముందుగా రోట్లో పల్లీలు, పచ్చిమిర్చి వేసుకుని కొద్దిగా నూరి ఆ తర్వాత ఉడికించిన జామ ముక్కలు, ఉప్పు, నిమ్మరసం వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి.
  • ఇప్పుడు తాలింపు కోసం.. స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి మిర్చి వేయించిన కడాయిలో మిగిలిన నూనె వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప పప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి తరుగు, కరివేపాకు, ఇంగువ.. ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి.
  • అవన్నీ కాస్త వేగి తాలింపు రెడీ చేసుకున్నాక దాన్ని ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. అంతే.. ఎంతో టేస్టీగా జామకాయ పచ్చడి రెడీ.
  • ఈ పచ్చడిని అన్నం, రొట్టెలు ఎందులో వేసుకొని తిన్నా రుచి చాలా బాగుంటుంది!

ABOUT THE AUTHOR

...view details