Eggless Creme Caramel Recipe :మనలో చాలా మందికి స్వీట్లూ, డెజర్టులంటే ఎంతో ఇష్టం. ఇక రెస్టారెంట్లు, బేకరీల్లో దొరికే జున్నులాంటి "క్రెమ్ కేరమెల్" చూస్తే నోట్లో నీళ్లు ఊరుతాయి. సూపర్ టేస్టీగా ఉండే క్రెమ్ కేరమెల్ని సాధారణంగా ఎగ్‌తో తయారు చేస్తుంటారు. కానీ, ఈ స్టోరీలో చెప్పిన విధంగా చేస్తే ఎగ్ లేకుండానే కమ్మని క్రెమ్ కేరమెల్ రుచిని ఆస్వాదించవచ్చు. ఇది చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. ఇంట్లో మైక్రోవేవ్ ఓవెన్ లేకుండానే సింపుల్‌గా చేసుకోవచ్చు. మరి ఇక ఆలస్యం చేయకుండా పిల్లలు, పెద్దలు అందరు ఎంతో ఇష్టంగా తినే క్రెమ్ కేరమెల్ ఎలా చేయాలో ఓ లుక్కేయండి..
కావాల్సిన పదార్థాలు :
- మిల్క్ బ్రెడ్ స్లైసెస్-3
- పాలు-అరకప్పు
- షుగర్ పొడి - 3/4 కప్పు
- వెనిలా కస్టర్డ్ పౌడర్-2 టీ స్పూన్లు
- చిటికెడు-ఉప్పు
- వెనీలా ఎసెన్స్ -టీ స్పూన్
- పంచదార- 2 టేబుల్ స్పూన్లు
- మిల్క్ పౌడర్ - 2 టేబుల్ స్పూన్లు
- ప్యాకెట్ పెరుగు-అరకప్పు
- కండెన్స్డ్ మిల్క్-3/4 కప్పు (180 గ్రాములు)
తయారీ విధానం :
- ముందుగా మిల్క్ బ్రెడ్ ఎడ్జెస్ని కట్ చేసుకోండి. తర్వాత బ్రెడ్నిముక్కలుగా కట్ చేసుకోండి. వీటిని మిక్సీ గిన్నెలో వేసుకుని బ్రెడ్ క్రంప్స్ మాదిరిగా పొడి చేసుకోండి. (సాధ్యమైనంత వరకు పాత మిల్క్ బ్రెడ్ యూజ్ చేయండి.)
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టి షుగర్ పొడి పాన్‌పై చల్లండి. స్టౌ మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేస్తే షుగర్ నెమ్మదిగా కరుగుతుంది. పంచదార కరిగేంత వరకు గరిటె పెట్టి తిప్పకండి.
- షుగర్ పూర్తిగా కరిగి.. తేనె కలర్లోకి రాగానే నెయ్యి రాసుకున్న కేక్ మౌల్డ్‌లోకి పోసుకోండి. షుగర్ సిరప్ టిన్ మొత్తం స్ప్రెడ్ చేయాలి.
- ఇప్పుడు మిక్సీ గిన్నెలో పాలు, వెనిలా కస్టర్డ్ పౌడర్, ఉప్పు, అరకప్పు గ్రైండ్ చేసుకున్న బ్రెడ్ పొడి, వెనీలా ఎసెన్స్, పంచదార, మిల్క్ పౌడర్, పెరుగు, కండెన్స్డ్ మిల్క్ వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఆపై ఈ మిల్క్‌ని.. కేక్ గిన్నెలో టీ జాలీతో పోసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి.
- తర్వాత మౌల్డ్పై సిల్వర్ ఫాయిల్ చుట్టండి. అవసరమైతే దారం కూడా కట్టండి. ఇప్పుడు సిల్వర్ ఫాయిల్‌పై మూడు చోట్ల చిన్న గాట్లు పెట్టండి.
- ఆపై స్టీమ్ చేయడం కోసం స్టౌపై గిన్నె పెట్టి 3 గ్లాసుల నీళ్లు పోయండి. ఇందులో చిన్న స్టాండ్ పెట్టి నీటిని వేడి చేయండి.
- ఆపై క్రెమ్ కేరమెల్ గిన్నెను ఉంచండి. దీనిని 15 నిమిషాలు హై ఫ్లేమ్ మీద, 12 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద స్టీమ్ చేయండి.
- క్రెమ్ కేరమెల్ పూర్తిగా చల్లారిన తర్వాత ఓ మూడు గంటలు ఫ్రిడ్జ్‌లో పెట్టండి. తర్వాత ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ లెస్ క్రెమ్ కేరమెల్ మీ ముందుంటుంది.
- ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఓ సారి ఇంట్లో ఇలా క్రెమ్ కేరమెల్ ట్రై చేయండి. టేస్ట్ అద్దిరిపోతుంది.
ప్రపంచంలో నెంబర్-2 బెస్ట్ స్వీట్‌గా మన రసమలై - ఇలా ఈజీగా ప్రిపేర్ చేయండి!
స్పెషల్ ఆరెంజ్ బర్ఫీ - ఈజీగా ప్రిపేర్ చేసుకోండి - టేస్ట్ అదిరిపోతుంది!