How to Make Egg Kajjikayalu at Home: కజ్జికాయలు.. స్వీట్ ఐటమ్స్‌లో చాలా మందికి ఫేవరెట్ ఇది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా ఉండి తినేకొద్ది తినాలనిపిస్తుంది. ఇక పిల్లలైతే మరీ మరీ తింటుంటారు. అందుకే చాలా మంది మహిళలు.. పెద్ద పండగలు వస్తున్నాయంటే చాలు వీటిని ప్రిపేర్ చేస్తుంటారు. అయితే కజ్జికాయలు అంటే కొబ్బరితో తయారు చేసినవే చాలా మందికి తెలుసు. కానీ అవే కజ్జికాయలు కాస్తా కారంగా ఉంటే.. అదీ కోడిగుడ్డుతో చేస్తే.. ఏంటి కోడిగుడ్డుతో కజ్జికాయాలా అని నోరెళ్లబెట్టబాకండి.కోడిగుడ్డుతో కూడా సూపర్ టేస్టీగా, స్పైసీగా ఉండే కజ్జికాయలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవెనింగ్ స్నాక్స్ కోసం ఇవి చాలా బెస్ట్ ఆప్షన్. మరి, లేట్ చేయకుండా వీటికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో చూద్దాం..
కావాల్సిన పదార్థాలు:
- గోధుమ పిండి - 1 కప్పు
- బొంబాయి రవ్వ - పావు కప్పు
- ఉప్పు - పావు టీ స్పూన్
- వేడి నూనె - 2 టీ స్పూన్లు
మిక్సింగ్ కోసం:
- ఉప్పు - అర టీ స్పూన్
- పసుపు - పావు టీ స్పూన్
- కారం - 1 టీ స్పూన్
- ధనియాల పొడి - 1 టీ స్పూన్
- గరం మసాలా - అర టీ స్పూన్
- వాటర్ - 2 టీ స్పూన్లు
- కోడిగుడ్లు - 3
- ఉల్లిపాయ - 1
- సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు - 2 టేబుల్ స్పూన్లు
- క్యాప్సికం ముక్కలు - 2 టేబుల్ స్పూన్లు(ఆప్షనల్)
- పచ్చిమిర్చి - 2
- కరివేపాకు - 2 రెమ్మలు
తయారీ విధానం:
- ముందుగా ఓ బౌల్లోకి గోధుమపిండి, బొంబాయి రవ్వ, ఉప్పు, వేడి నూనె పోసి బాగా కలపాలి.
- ఆ తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్ద కన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలి.
- ఆ తర్వాత మూత పెట్టి ఓ 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు మరో గిన్నెలోకి ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, వాటర్ పోసి పేస్ట్‌లాగా కలుపుకోవాలి.
- ఆ తర్వాత అందులోకి ఉల్లిపాయ తరుగు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు వేసి బాగా బీట్ చేసుకోవాలి.
- 10 నిమిషాల తర్వాత గోధుమ పిండి ముద్దను మరోసారి కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
- ఆ తర్వాత కొద్దిగా పొడి పిండి చల్లుకుంటూ పూరీలుగా వత్తుకోవాలి.
- అనంతరం ఆ పూరీ అంచుల వెంట నీళ్లు రాసుకోవాలి.
- ఇప్పుడు కజ్జికాయలు చేసే మౌల్డ్ తీసుకుని అందులో కొద్దిగా పొడి పిండి చల్లి.. ప్రిపేర్ చేసుకున్న పూరీ పెట్టి.. అందులో కొద్దిగా కోడిగుడ్డు మిశ్రమాన్ని వేసుకుని మౌల్డ్ క్లోజ్ చేసి గట్టిగా ప్రెస్ చేయాలి. ఆ తర్వాత మిగిలిన పిండి తీసేసి మౌల్డ్ ఓపెన్ చేసి కజ్జికాయలను ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా మిగిలిన కజ్జికాయలను కూడా అలానే చేసుకుని పక్కకు పెట్టుకోవాలి.
- ఒకవేళ మీ దగ్గర కజ్జికాయలు చేసేది లేకపోతే పూరీల అంచులకు తడి అద్ది పూరీ మధ్యలో కోడిగుడ్డు మిశ్రమం పెట్టి వెంటనే క్లోజ్ చేసి ఫోర్క్ స్పూన్‌తో అంచులు క్లోజ్ చేయాలి. ఇలా అన్నింటిని చేసి పెట్టుకోవాలి.
- ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న కజ్జికాయలను నిదానంగా వేసుకుని కాల్చుకోవాలి.
- స్టవ్‌ను మీడియంలో పెట్టి రెండు వైపులా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకుని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇలా అన్నింటిని ఫ్రై చేసుకోవాలి.
- అంతే ఎంతో టేస్టీగా, స్పైసీగా ఉండే కోడిగుడ్డు కజ్జికాయలు రెడీ. దీన్ని వేడివేడిగా టమాట సాస్‌తో తింటే అద్దిరిపోవాల్సిందే.
- నచ్చితే మీరూ ఓసారి ట్రై చేయండి. పిల్లలు ఇష్టంగా తింటారు.
"గుంట పొంగనాలు + పచ్చిమిర్చి పచ్చడి" డెడ్లీ కాంబినేషన్ - ఈజీగా ప్రిపేర్ చేసుకోండిలా - టేస్ట్ అద్దిరిపోతుంది!
కరకరలాడే "ఎగ్ కట్లెట్స్" - నిమిషాల్లో ఇలా ప్రిపేర్ చేసుకోండి - టేస్ట్ వేరే లెవల్ అంతే!