Horoscope Today January 9th 2025 : 2025 జనవరి 9వ తేదీ (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచి తూచి వ్యహరించాలి. తొందరపాటు, దూకుడుతో నష్టం వాటిల్లే ప్రమాదముంది. కొత్త ప్రయత్నాలు, పనులకు ఈ రోజు అంత అనుకూలంగా లేదు అందుకే వాయిదా వేస్తే మంచిది. సన్నిహితులతో మాట్లాడేటప్పుడు ప్రియంగా మాట్లాడం మంచిది. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగించవచ్చు. శివారాధన శ్రేయస్కరం.
వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేసే ప్రతీ పనిలో పరిపూర్ణత ఉండాలని భావించే మీ స్వభావం అందరినీ ఆకట్టుకుంటుంది. ఏకాగ్రతతో, మీ పూర్తి శక్తియుక్తులను వినియోగించి ముఖ్యమైన పనిలో విజయం సాధిస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.
మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులకు ఈ రోజు శుభదినం. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం చేకూరుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. వ్యాపారంలో ఆదాయం బాగా పెరుగుతుంది. పెట్టుబడులు మంచి లాభాలనిస్తాయి. స్నేహితుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు అందుకుంటారు. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.
కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. కుటుంబ సభ్యులతో అనుబంధం దృఢ పడుతుంది. వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అధికారుల సహకారం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. గణపతి ప్రార్ధన శుభప్రదం.
సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. ముఖ్య విషయాల్లో ఆచి తూచి వ్యవహరించాలి. కీలకమైన విషయాల్లో అప్రమత్తంగా ఉండడం అవసరం. ఖర్చులు పెరగవచ్చు. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది. వృత్తి పరంగా ఆశించిన ఫలితాలు పొందాలంటే అదనపు కృషి అవసరం. కార్యసిద్ధి హనుమ ఆరాధన శ్రేయస్కరం.
కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మనోబలంతో చేసే పనులు సత్ఫలితాలనిస్తాయి. అందరి సహకారంతో సకాలంలో పనులు పూర్తి చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. కొందరి ప్రవర్తన విచారం కలిగిస్తుంది. మీ సామర్ధ్యానికి మించిన పనులు చేయాలనీ అనుకోవద్దు. కొన్ని విషయాల్లో సమయస్ఫూర్తితో మెలిగితే మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా శుభ సమయం. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.
తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు సరదాగా , సంతోషంగా గడిచిపోతుంది. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి, విజయం చేకూరుతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని సరదాగా గడుపుతారు. సానుకూల దృక్పధంతో పనిచేసి అత్యుత్తమమైన ఫలితాలు అందుకుంటారు. ఒక శుభవార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. సామాజికంగా పరపతి పెరుగుతుంది. ఆంజనేయ స్వామి ఆలయ సందర్శన శుభకరం.
వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గొప్ప శుభ సమయం నడుస్తోంది. అన్ని రంగాల వారు తమ తమ రంగాల్లో కీర్తి ప్రతిష్ఠలు సాధిస్తారు. అధికార పరిధి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం.
ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. లక్ష్య సాధనలో ఆటంకాలు ఎదురవుతాయి. ముఖ్య విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అవసరానికి డబ్బు అందుతుంది. కలహాలు రాకుండా జాగ్రత్త వహించండి. వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. శ్రీరామ నామజపం మేలు చేస్తుంది.
మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. మానసికంగాదృఢంగా ఉంటారు. మీకు అప్పగించిన భాద్యతను సక్రమంగా నిర్వర్తించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.
కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. విశేషమైన కార్యసిద్ధి ఉంది. సమాజంలో కీర్తిప్రతిష్ఠలు సంపాదిస్తారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. తోబుట్టువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. పనుల్లో ఆటంకాలను అవలీలగా అధిగమిస్తారు. ఖర్చులు పెరిగే సూచన ఉంది. ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. కనకధారా స్తోత్రం పఠించడం శుభప్రదం.
మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన ప్రతి పనిలోనూ అనుకూలత ఉంటుంది. మంచి ప్రణాళికతో లక్ష్యాన్ని సాధిస్తారు. మానసికంగా ఆనందంగా ఉంటారు. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు అదుపులోనే ఉంటాయి. ఉద్యోగంలో స్థానచలనం ఉండవచ్చు. శుభకార్యాలలో పాల్గొంటారు. ఇష్ట దేవతారాధన శుభప్రదం.