ICC Test Team of the Year 2024 : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ 2024 టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్ జట్టును ప్రకటించింది. ఈ జట్టులో భారత్ నుంచి ముగ్గురు ప్లేయర్లకు చోటు దక్కింది. యంగ్ ప్లేయర్ యశస్వీ జైస్వాల్, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్వ్కాడ్‌లో ఉన్నారు. ఇక ఈ జట్టుకు ఆస్ట్రేలియా సారథి పాట్ కమిన్స్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
కాగా, ఈ జట్టులో అత్యధికంగా నలుగురు ఇంగ్లాండ్ ప్లేయర్లకు చోటు దక్కింది. బెన్ డకెట్, హ్యారీ బ్రూక్, జో రూట్, జిమ్మి స్మిత్ ఉన్నారు. మిగిలిన వాళ్లలో కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్), కామిందు మెండీస్ (శ్రీలంక), మ్యాట్ హెన్రీ (న్యూజిలాండ్) ఉన్నారు. ఇక టెస్టు జట్టు కంటే కాస్త ముందే ఐసీసీ 2024 వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ జట్టు ప్రకటించింది. ఈ స్వ్కాడ్‌లో టీమ్ఇండియా నుంచి ఒక్క ప్లేయర్ లేకపోవడం గమనార్హం. గతేడాది భారత్ అతి తక్కువ వన్డే మ్యాచ్‌లు ఆడడమే దీనికి కారణం.
అక్కడ కూడా ఓపెనరే
యంగ్ ప్లేయర్ జైస్వాల్ 2024లో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. గతేడాది నిలకడగా ఆడుతూ 1474 పరుగులు చేశారు. అలాగే 36 సిక్స్‌లు బాదాడు. ఈ క్రమంలోనే ఓ కేలండర్ ఇయర్లో భారత్ తరఫున అత్యధిక సిక్స్‌లు బాదిన ప్లేయర్‌గానూ నిలిచాడు. దీంతో ఐసీసీ జట్టులో ఎంపికయ్యాడు. ఇక్కడ కూడా యశస్వీ ఓపెనర్‌గా చోటు దక్కించుకున్నాడు. ఇక ఆల్‌రౌండర్‌గా రాణించిన జడ్డూ, వికెట్ల కింగ్ బుమ్రా ఎంపికయ్యారు.
రోహిత్, విరాట్‌కు నో ప్లేస్
అయితే ఈ జట్టులో టీమ్ఇండియా స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి చోటు దక్కలేదు. గతేడాది ఈ ఇద్దరు సీనియర్లు టెస్టుల్లో ఘోరంగా విఫలమయ్యారు. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో అసలు ప్రభావం చూపలేకపోయారు. 10 మ్యాచ్‌లు ఆడిన విరాట్ 417 పరుగులు చేయగా, రోహిత్ 619 రన్స్ చేశాడు.
Congratulations to the incredibly talented players named in the ICC Men's Test Team of the Year 2024 👏 pic.twitter.com/0ROskFZUIr
— ICC (@ICC) January 24, 2025
ఐసీసీ టెస్టు టీమ్ ఆఫ్ ది ఇయర్ : యశస్వీ జైస్వాల్, బెన్ డకెట్, కేన్ విలియమ్సన్, జో రూట్, హ్యారీ బ్రూక్, కామిందు మెండీస్, జిమ్మీ స్మిత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, పాట్ కమిన్స్ (కెప్టెన్), మ్యాట్ హెన్రీ, జస్ప్రీత్ బుమ్రా
ICC 'ప్లేయర్ ఆఫ్ ద మంత్'గా బుమ్రా- ఆసీస్ కెప్టెన్ కమిన్స్‌ను వెనక్కి నెట్టిన స్టార్ పేసర్