Game Changer Tickets Hikes : గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్- శంకర్ కాంబోలో తెరకెక్కిన 'గేమ్‌ఛేంజర్' సినిమా టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనవరి 10న సింగిల్ స్క్రీన్స్‌లో అదనంగా రూ.100, మల్టీప్లెక్సుల్లో రూ.150 పెంచుకునేందుకు వీలు కల్పించింది. ఇక జనవరి 11 నుంచి 19 వరకు 5 షోలకు సింగిల్ స్క్రీన్స్‌లో రూ.50, మల్టీప్లెక్సుల్లో రూ.100 పెంచుకునేందుకు వెసులుబాటు ఇచ్చింది. కానీ, ప్రీమియర్ షోకు మాత్రం ప్రభుత్వం నిరాకరించింది.
కానీ, రిలీజ్ రోజు ప్రీమియర్స్‌కు అనుమతి లభించింది. జనవరి 10న ఉదయం 4 గంటల నుంచి ఆరు ఆటలకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. ఇక పెరిగిన ధరలతో టికెట్ ధరలు ఇలా ఉండనున్నాయి. రిలీజ్ రోజు సింగిల్ స్క్రీన్స్‌లో రూ.250, మల్టీప్లెక్స్‌ల్లో రూ.350 (టాక్స్‌లు అదనం) వరకు ఉండవచ్చు! ఇక హిందీ, మలయాళం, తమిళ్ సహా తెలుగు (ఏపీ) భాషల్లో బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. గురువారం నుంచి తెలంగాణలోనూ బుకింగ్స్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.
ఏపీలో ఇలా
ఇప్పటికే ఏపీ ప్రభుత్వం టికెట్ ధరల పెంపుతో పాటు బెనిఫిట్ షో కూడా అక్కడి ప్రభుత్వం ఇటీవల అనుమతి ఇచ్చింది. అర్ధరాత్రి 1గంట బెనిఫిట్ షో టికెట్ ధరను రూ.600 (పన్నులతో కలిపి) నిర్ణయించారు. అలాగే, జనవరి 10న ఆరు షోలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మల్టీ ప్లెక్స్‌లో అదనంగా రూ.175 (జీఎస్టీతో కలిపి), సింగిల్ థియేటర్లలో రూ.135 (జీఎస్టీతో కలిపి) వరకూ టికెట్ పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. జనవరి 11 తేదీ నుంచి 23 తేదీ వరకూ ఇవే ధరలతో ఐదు షోలకు అనుమతి ఇచ్చింది.
కాగా, భారీ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జానర్లో శంకర్ ఈ సినిమా తెరకెక్కించారు. హీరో రామ్ చరణ్ ఈ సినిమాలో డ్యుయల్ రోల్లో నటించారు. ఇప్పటికే రిలీజైన పాటలు, ట్రైలర్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. కేవలం పాటలకే రూ.75 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిసింది. బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ హీరోయిన్గా నటించింది. యస్ జే సూర్య, శ్రీకాంత్, అంజలి తదితరులు ఆయా పాత్రల్లో నటించారు. తమన్ సంగీతం అందించగా, శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మించారు.
'గేమ్ ఛేంజర్' ప్రమోషన్స్‌కు కియారా దూరం! - ఆమెకు ఏమైందంటే?
'కొత్త సంవత్సరంలో బాక్సాఫీస్ బద్దలైపోవాలి'- గేమ్‌ఛేంజర్ ఈవెంట్లో పవన్