Oscar Nominations Delayed : అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌ను చుట్టుముట్టిన కార్చిచ్చు అక్కడి వారిని తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తోంది. ముఖ్యంగా ఎంతో మంది ఇళ్లు దగ్ధమై నిర్రాశ్రయులయ్యారు. అందులో సెలబ్రిటీల నివాసాలు కూడా ఉండటం గమనార్హం. అయితే ఈ ప్రభావం సినీరంగంపై కూడా పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ నామినేషన్ల ప్రకియ ఆలస్యమైంది. జనవరి 8 నుంచి 14 వరకు ఈ నామినేషన్ కొనసాగనున్న ఈ ప్రక్రియ. కార్చిచ్చు కారణంగా ఓటింగ్ ఆలస్యమైంది. దీంతో జనవరి 17న ప్రకటించాల్సిన ఆస్కార్ నామినేషన్లను జనవరి 19కు వాయిదా వేశారు.
సుమారు 10,000 మంది అకాడమీ మెంబర్స్ ఈ ఓటింగ్ ప్రక్రియలో పాల్గోనున్నారు. జనవరి 8 నుంచి 12 వరకు జరగాల్సిన దీన్ని జనవరి 14 వరకు ఎక్స్టెండ్ చేశారు. దీంతో జనవరి 17న ప్రకటించాల్సిన నామినేషన్‌లను 19న వెల్లడించనున్నట్లు తెలిపింది. 2025 మార్చి 2న ఆస్కార్ వేడుక జరగనుంది.
ఆస్కార్ బరిలో నిలిచిన భారతీయ చిత్రాలు ఇవే :
97వ అకాడమీ అవార్డ్స్‌లో మొత్తం 323 సినిమాల లిస్ట్‌ను ఇటీవల అనౌన్స్ చేసింది. అందులో బెస్ట్ మూవీ విభాగంలో 207 చిత్రాలు పోటీ పడనున్నాయి. వాటిలోనూ ఆరు భారతీయ చిత్రాలు ఉండటం విశేషం. ది గోట్ లైఫ్ (హిందీ), కంగువ (తమిళం), స్వాతంత్ర్య వీర్ సావర్కర్ (హిందీ), సంతోష్ (హిందీ), ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ (మలయాళం), గర్ల్స్ విల్ బి గర్ల్స్( హిందీ, ఇంగ్లిష్) సినిమాలు ఈ ఆస్కార్ నామినేషన్ల బరిలోకి దిగనున్నాయి. అయితే వీటిలో ఎన్ని నామినేషన్ దక్కించుకుంటాయనేది జనవరి 19న తేలనుంది.
ఆస్కార్‌కు ప్రియాంక చోప్రా మూవీ
2025లో ఆస్కార్ బరిలో నిలిచిన సినిమాల లిస్ట్‌లో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నిర్మాతగా వ్యవహరించిన 'అనూజ' షార్ట్ ఫిల్మ్ చేరింది. దీనిపై తాజాగా ప్రియాంక ఆనందం వ్యక్తం చేశారు. "ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా కొన్ని మిలియన్ల మంది పిల్లలను ప్రభావితం చేసింది. ఇంత గొప్ప సినిమా ఆస్కార్ బరిలో నిలవడం ఎంతో ఆనందంగా ఉంది. ఇది మన జీవిత గమనాన్ని మార్చే సినిమా. ఇలాంటి గొప్ప ప్రాజెక్ట్‌లో నేను భాగమైనందుకు నేను ఎంతో గర్వంగా ఉంది" అని ప్రియాంక చెప్పారు.
రాజమౌళి దంపతులకు మరో అరుదైన గౌరవం - SS Rajamouli Oscar Academy
మరోసారి ట్రెండింగ్‌లో 'ఆర్ఆర్ఆర్'- మూవీపై హాలీవుడ్ సింగర్ ప్రశంసలు