Supreme Court On KTR Quash Petition : ఫార్మూలా-ఈ రేసు వ్యవహారం సుప్రీంకోర్టు వద్దకు చేరింది. ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టి వేయాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో కేటీఆర్‌కు సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను రేపు విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 15న విచారణకు లిస్ట్ చేసినందున ఆ రోజే విచారిస్తానని సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పష్టం చేశారు. అంతకు ముందు కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను విచారించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.
మా వాదనలూ వినండి : కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లక ముందే ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో ముందుగానే కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ ఒకవేళ పిటిషన్ వేస్తే తమ వాదనలూ వినాలని ప్రభుత్వం అందులో కోరింది.
కేటీఆర్ ఏసీబీ విచారణ : మరోవైపు, ఫార్ములా-ఈ రేసు కేసులో కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. రేసు నిర్వహణకు ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ ఇచ్చిన ఆదేశాలపై ఏసీబీ అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు.