Unidentified Men Attacks On Inter Girl : ఇంటర్ విద్యార్థినిపై గుర్తుతెలియని దుండగులు బ్లేడ్‌తో దాడికి ఘటన హైదరాబాద్‌లోని చైతన్యపురిలో కలకలం రేపింది. ఈ ఘటనలో బాలిక చేతిపై స్పల్ప గాయాలయ్యాయి.
బాధితురాలి తండ్రి తెలిపిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఆర్కే పురం వాసవీ కాలనీకి చెందిన ఓ బాలిక కొత్తపేటలో ఇంటర్ చదువుతోంది. శుక్రవారం కళాశాలకు వెళ్తున్న సమయంలో చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని వాసవీ కాలనీ వద్ద గుర్తుతెలియని దుండుగులు ఆమెను రోడ్డుపై అడ్డగించారు.
విద్యార్థిని రెండు చేతులను పట్టుకుని బ్లేడ్‌తో దాడి చేసేందుకు దుండగులు యత్నించారు. ఈ క్రమంలోనే వారి నుంచి తప్పించుకునేందుకు బాలిక ప్రయత్నించింది. ఎలాగోలా వారిని నెట్టివేసి తప్పించుకుని సమీపంలోని కళాశాల వద్దకు వెళ్లి ఆమె తండ్రికి సమాచారమందించింది. కాగా ఈ ఘటనలో బాలికకు స్వల్ప గాయాలు అయ్యాయి. విద్యార్థిని తండ్రి ఈ విషయంపై చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎల్బీనగర్ అడిషనల్ డీసీపీ, చైతన్యపురి సీఐలు ఘటన జరిగిన ప్రాంతాన్ని పరీశీలించారు. సమీపంలోని సీసీకెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా దుండగులు విద్యార్థినిపై దాడికి ప్రయత్నించారా? లేక చైన్ స్నాచింగ్ కోసమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
దారుణం : కుమార్తెను ప్రేమిస్తున్నాడని ఓ యువకుడి తల్లిదండ్రులపై పెట్రోల్‌తో దాడి