ETV Bharat / technology

స్టన్నింగ్ లుక్​లో 'కీవే K300 SF' లాంఛ్- ఏకంగా రూ.60వేల తగ్గింపు ధరతో- వారికి మాత్రమే! - 2025 KEEWAY K300 SF LAUNCHED

దేశీయ మార్కెట్లో 'కీవే K300 SF' మోటార్​సైకిల్ రిలీజ్- ధర, ఫీచర్లు ఇవే!

2025 Keeway K300 SF
2025 Keeway K300 SF (Photo Credit- Keeway India)
author img

By ETV Bharat Tech Team

Published : Jan 24, 2025, 7:39 PM IST

2025 Keeway K300 SF Launched: వాహన ప్రియులకు గుడ్​న్యూస్. ఇండియన్ మార్కెట్లోకి అదిరే డిజైన్​లో కొత్త బైక్ ఎంట్రీ ఇచ్చింది. టూ-వీలర్ తయారీ సంస్థ కీవే ఇండియా 'కీవే K300 SF' పేరుతో దీన్ని తీసుకొచ్చింది. ఈ కొత్త 'కీవే K300 SF' అనేది 2022లో భారత్​లో ప్రారంభించిన 'కీవే K300 N' మోడల్​ అప్​డేటెడ్ వెర్షన్.

కంపెనీ ఈ మోటార్‌సైకిల్‌ను రూ. 1.69 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు విడుదల చేసింది. ఈ ధర పాత మోడల్ కంటే దాదాపు రూ. 60,000 తక్కువ. అయితే మొదటి 100 మంది కస్టమర్లకు మాత్రమే ఈ ప్రారంభ ధర వర్తిస్తుందని కంపెనీ తెలిపింది.

కీవే K300 SF డిజైన్: కంపెనీ ఈ కొత్త మోటార్​ సైకిల్ డిజైన్​లో ఎలాంటి మార్పులూ చేయలేదు. దీని డిజైన్ 'కీవే K300 N' స్ట్రీట్ ఫైటర్ మాదిరిగానే ఉంటుంది. ఈ కొత్త 'కీవే K300 SF' బైక్​ పేరులోని SF అంటే స్ట్రీట్ ఫైటర్. కంపెనీ ఈ కొత్త బైక్ డిజైన్​లో ఛేంజెస్ చేయనప్పటికీ దాని గ్రాఫిక్స్‌లో మాత్రం స్వల్ప మార్పులు చేసింది.

కలర్ ఆప్షన్స్:మోటార్​సైకిల్ మూడు కలర్ ఆప్షన్​లలో మార్కెట్లో అందుబాటులో ఉంది.

  • మ్యాట్ వైట్
  • మ్యాట్ బ్లాక్
  • మ్యాట్ రెడ్

కీవే K300 SF పవర్‌ట్రెయిన్: కీవే దీని ఇంజిన్​లో కూడా ఎలాంటి మార్పు చేయలేదు. ఇది అదే పాత సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్​తోనే వస్తుంది. ఈ మోటార్‌సైకిల్ 292.4cc ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 8,750 rpm వద్ద 27.1 bhp పవర్, 7000 rpm వద్ద 25 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత అయి వస్తుంది.

కీవే K300 SF హార్డ్‌వేర్: ఈ బైక్ ముందు భాగంలో USD ఫోర్కులు, వెనక భాగంలో మోనో-షాక్, రెండు వైపులా 17-అంగుళాల వీల్స్ ఉన్నాయి. వీటితో పాటు పవర్​ను ఆపేందుకు రెండు వైపులా డిస్క్ బ్రేక్‌లు అందించారు. ఇది డ్యూయల్-ఛానల్ ABS తో కూడా వస్తుంది. అంతేకాక ఈ బైక్​లో పూర్తిగా LED లైటింగ్, ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి.

క్యాబ్, రూట్ ఒకటే అయినా ఫోన్​ మోడల్​ను బట్టి ఛార్జీలేసుడేందీ?- ఉబర్ సమాధానమిదే!

ఫ్లాగ్‌షిప్ పెర్ఫార్మెన్స్​తో 'ఐకూ నియో 10R' ఫోన్- గేమింగ్ లవర్స్​కు ఇక పండగే!

కొత్త అప్​డేట్స్​తో బెస్ట్ ఫ్యామిలీ స్కూటీ లాంఛ్- ధర ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.