ETV Bharat / sports

'చాహల్​ నన్ను క్షమించు, అలా చేసినందుకు సారీ!'- టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ - YUZVENDRA CHAHAL

స్పిన్నర్ చాహల్​కు క్షమాపణలు చెప్పిన టీమ్ఇండియా స్టార్ ప్లేయర్- వీడియో వైరల్

Chahal
Chahal (Source : ANI)
author img

By ETV Bharat Sports Team

Published : Jan 24, 2025, 8:58 PM IST

Yuzvendra Chahal : టీమ్ఇండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్​కు భారత స్టార్ ప్లేయర్ క్షమాపణలు చెప్పాడు. చెవులు పట్టుకొని తనను క్షమించాలని కోరాడు. దీనికి సంబంధించిన బీసీసీఐ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఇది వైరల్ అయ్యింది. మరి చాహల్​కు సారీ చెప్పింది ఎవరు? ఎందుకు చెప్పాడంటే?

టీమ్ఇండియా ప్రస్తుతం ఇంగ్లాండ్​తో టీ20 సిరీస్​లో తలపడుతోంది. సిరీస్​లో భాగంగా బుధవారం జరిగిన తొలి మ్యాచ్​లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్​లో స్టార్ పేసర్ అర్షదీప్ సింగ్ రెండు వికెట్లతో సత్తా చాటాడు. దీంతో అతడు ఓ అరుదైన మైలురాయి అందుకున్నాడు. టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్​గా ఘనత సాధించాడు. ఈ క్రమంలో స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ (96 వికెట్లు) రికార్డ్​ను బ్రేక్ చేశాడు. అర్షదీప్ 61 మ్యాచ్​ల్లో 97 వికెట్లు పడగొట్టి, ప్రస్తుతం భారత్ తరఫున టీ20ల్లో టాప్ బౌలర్​గా కొనసాగుతున్నాడు.

అయితే కొన్నాళ్లుగా చాహల్ పేరిట ఉన్న ఈ రికార్డ్​ను తాను బ్రేక్ చేసినందుకు అర్షదీప్ సారీ చెప్పాడు (సరదాగా). మ్యాచ్ అనంతరం బీసీసీఐ ఇంటరాక్షన్​లో మాట్లాడిన అర్షదీప్ ఈ కామెంట్స్ చేశాడు. దీంతో అర్షదీప్ 'వెరీ ఫన్నీ' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఇక మ్యాచ్​విషయానికొస్తే, ఇంగ్లాండ్ నిర్దేశించిన 133 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా 12.5 ఓవర్లలోనే అలవోకగా ఛేదించింది. అభిషేక్ శర్మ (79 పరుగులు, 34 బంతుల్లో; 5x4, 8x6) సూపర్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. భారత్​ అంతకుముందు ఇంగ్లాండ్​ను 132 పరుగులకే కట్టడి చేసింది. జాస్ బట్లర్ (68 పరుగులు) ఒక్కడే హాఫ్ సెంచరీ చేశాడు. టీమ్ఇండియా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3, అర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్ తలో 2 వికెట్లు పడగొట్టారు.

ఈ విజయంతో 5 మ్యాచ్​ల సిరీస్​లో భారత్​ 1- 0తో ఆధిక్యం సాధించింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 శనివారం జరగనుంది. ఈ మ్యాచ్​కు చెన్నై చెపాక్ స్టేడియం వేదిక కానుంది.

ఇంగ్లాండ్​తో రెండో T20- చెపాక్​లోనూ చెక్ పెట్టెందుకు ప్లాన్

'సింగ్ ఈజ్ కింగ్': చరిత్ర సృష్టించిన అర్షదీప్- టీ20ల్లో ఆల్​టైమ్ రికార్డ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.