తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

చల్లటి సాయంత్రం వేళ కమ్మటి "ఎగ్​ బోండా"- సింపుల్​గా ఇంట్లో చేసేయండిలా!!

-స్ట్రీట్​ స్టైల్​ యమ్మీ ఎగ్​ బజ్జీ - ఇలా చేస్తే వేడివేడిగా ఎంతో రుచికరంగా

Egg Bajji Recipe
Egg Bajji Recipe (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

Egg Bajji Recipe : మనలో చాలా మందికి ఇష్టమైన స్ట్రీట్​ ఫుడ్​లో ఎగ్​ బోండా కూడా ఒకటి. చల్లటి సాయంత్రం వేళలో వేడివేడి ఎగ్ బజ్జీపై కొన్ని ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ పిండుకుని తింటే టేస్ట్ అద్దిరిపోతుంది కదూ. అయితే, ఇప్పుడు కోడిగుడ్డు బజ్జీ అచ్చం బండి మీద చేసే విధంగా.. టేస్ట్​ యమ్మీయమ్మీగా వచ్చేలా ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ చెప్పిన విధంగా చేస్తే కేవలం నిమిషాల్లోనే క్రిస్పీ ఎగ్ బజ్జీ మీ ముందుంటుంది. పిల్లలు ఎగ్​ తినడానికి అంతగా ఇష్టపడకపోతే.. సాయంత్రం ఇలా చేసి పెట్టండి. ఎంతో ఇష్టంగా ఎగ్ బోండాలు తింటారు. మరి ఇక లేట్ చేయకుండా ఎగ్​ బజ్జీఎలా చేయాలో ఓ లుక్కేయండి..

కావాల్సిన పదార్థాలు :

  • శనగపిండి - 1 కప్పు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • పసుపు - పావు టీ స్పూన్​
  • నీరు - సరిపడా
  • నూనె - డీప్​ ఫ్రై కి సరిపడా
  • ఉడకబెట్టిన కోడిగుడ్లు - 4
  • పచ్చిమిర్చి - 2
  • ధనియాల పొడి- అర టీ స్పూన్​
  • కారం - అర టీ స్పూన్​
  • జీలకర్ర- అర టీస్పూన్​
  • వేయించిన జీలకర్ర పొడి- పావు టీస్పూన్​
  • చాట్​ మసాలా -అర టీస్పూన్​
  • కరివేపాకు-1
  • గరం మసాలా - పావు టీ స్పూన్​
  • చిటికెడు వంటసోడా

తయారీ విధానం:

  • ముందుగా కోడిగుడ్లను ఉడికించి పొట్టు తీసుకోవాలి. తర్వాత వాటిని రెండు ముక్కలుగా కట్​ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.
  • ఇప్పుడు శనగ పిండిని ఒక మిక్సింగ్​ బౌల్లోకి తీసుకోండి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర, సన్నగా కట్​ చేసిన పచ్చిమర్చి, కరివేపాకు తరుగు, కారం, చాట్​ మసాలా, పసుపు, వేయించిన జీలకర్ర పొడి, గరం మసాలా వేసి బాగా కలపండి.
  • తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని మిక్స్ చేయండి. చివర్లో చిటికెడు వంటసోడా వేసి కలుపుకోవాలి.
  • ఇప్పుడు ఎగ్ బోండా వేయించడం కోసం స్టౌపై కడాయి పెట్టండి. ఇందులో బోండా ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్​ వేసి వేడి చేయండి.
  • కట్​ చేసిన ఎగ్​ని శనగపిండి మిశ్రమంలో వేసుకోండి. పిండిని గుడ్డుకి బాగా పట్టించి ఆయిల్లో వేయండి. ఒక నిమిషం తర్వాత గరిటెతో మెల్లిగా తిప్పండి.
  • రెండు వైపులా ఎగ్​ బోండా గోల్డెన్​ కలర్లో ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. అంతే ఇలా సింపుల్​గా చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బోండా రెడీ.
  • నచ్చితే మీరు కూడా ఈ టేస్టీ ఎగ్​ బోండా ఓ సారి ట్రై చేయండి.

ఈవెనింగ్​ టైమ్​ బెస్ట్​​ స్నాక్ "ఎగ్​ 65" - ఎటువంటి సాస్​లు అవసరం లేదు - టేస్ట్​ సూపర్​!

సూపర్ టేస్టీ "బెంగాలీ స్టైల్ ఎగ్ కర్రీ" - నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోండిలా - రుచి అద్దిరిపోతుంది!

ABOUT THE AUTHOR

...view details