తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

పాత కాలం నాటి "దొండకాయ పల్లీల పచ్చడి" - తాలింపు లేకుండానే అద్దిరిపోతుంది! - DONDAKAYA PACHADI IN TELUGU

- పది నిమిషాల్లోనే రెసిపీ రెడీ!

Dondakaya Pachadi
Dondakaya Pachadi Recipe (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 17, 2024, 10:53 AM IST

Dondakaya Pachadi Recipe : చాలా మంది ఇంట్లో టమాటా, గోంగూర, దోసకాయ వంటి రకరకాల పచ్చళ్లు తయారు చేసి పెడుతుంటారు. అలాగే దొండకాయలతోనూ పలు రకాలుగా చట్నీ పచ్చడిప్రిపేర్​ చేస్తుంటారు. అయితే.. ఇప్పుడు పాతకాలం పద్ధతిలో పల్లీల కాంబినేషన్​తో టేస్టీగా దొండకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ స్టోరీలో చెప్పిన విధంగా పచ్చడి చేస్తే రుచి అద్దిరిపోతుంది. ఈ దొండకాయ పచ్చడివేడివేడి అన్నం, చపాతీల్లోకి చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్​లో స్టోర్​ చేసుకుంటే రెండు వారాల వరకు నిల్వ ఉంటుంది. మరి ఇక ఆలస్యం చేయకుండా కమ్మగా దొండకాయ రోటి పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • దొండకాయలు-పావు కేజీ
  • పల్లీలు-పావుకప్పు
  • పచ్చిమిర్చి-10
  • వెల్లుల్లి రెబ్బలు-6
  • ఉల్లిపాయ-1
  • టమాటాలు-2
  • చింతపండు -నిమ్మకాయ సైజంత
  • నూనె-3 టేబుల్​స్పూన్లు
  • ఉప్పు రుచికి సరిపడా
  • కొత్తిమీర తరుగు
  • జీలకర్ర -టీస్పూన్​

తయారీ విధానం :

  • ముందుగా దొండకాయలను శుభ్రంగా కడగాలి. తర్వాత సన్నని ముక్కలుగా కట్​ చేసుకోవాలి.
  • ఆపై పచ్చడి చేయడం కోసం స్టౌపై కడాయి పెట్టండి. 2 టేబుల్​స్పూన్ల నూనె పోసి వేడి చేయండి. నూనె వేడయ్యాక పల్లీలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తరుగు వేసి ఫ్రై చేయాలి.
  • పల్లీలు దోరగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి.
  • ఇదే పాన్​లో కొద్దిగా ఆయిల్​ వేసుకుని జీలకర్ర వేసి వేపండి. ఆపై కట్​ చేసిన దొండకాయ ముక్కలు, కొద్దిగా పసుపు వేసి ఫ్రై చేయండి.
  • దొండకాయలు కాస్త మగ్గిన తర్వాత టమాటా ముక్కలు, చింతపండు వేసి కలపండి.
  • పాన్​పై మూత పెట్టి మిశ్రమాన్ని 10 నిమిషాలు మగ్గించుకుని స్టౌ ఆఫ్​ చేయండి.
  • ఇప్పుడు రోటిని శుభ్రంగా నీటితో కడిగి.. పొడి వస్త్రంతో తుడవండి. ఆపై రోటిలో ఫ్రై చేసుకున్న పల్లీల మిశ్రమం, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా దంచుకోండి.
  • తర్వాత ఉడికించుకున్న దొండకాయ మిశ్రమంవేసి మెత్తగా రుబ్బుకోండి.
  • చివర్లో ఉల్లిపాయ ముక్కలు వేసి మరోసారి దంచుకోండి. (మీరు మిక్సీలో గ్రైండ్​ చేసుకుంటే అన్నింటినీ కాస్త బరకగా గ్రైండ్​ చేసుకోండి.)
  • అంతే ఇలా సింపుల్​గా చేసుకుంటే ఎంతో కమ్మని దొండకాయ పచ్చడి రెడీ.
  • ఈ పచ్చడిని మళ్లీ తాలింపు చేయాల్సిన అవసరం లేదు.
  • వేడివేడి అన్నం, చపాతీల్లోకి తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.
  • నచ్చితే ఈ విధంగా దొండకాయ పచ్చడి మీరు కూడా ట్రై చేయండి.

డైలీ ​కూరలు తిని విసుగొచ్చిందా - ఇలా "దోసకాయ పచ్చడి"ని ప్రిపేర్ చేసుకోండి - టేస్ట్ అద్భుతం!

చుక్క నూనె, తాలింపు లేకుండానే "కమ్మని జోం పచ్చడి" - ఇలా చేస్తే రుచి అద్భుతం!

ABOUT THE AUTHOR

...view details