తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

టిఫెన్స్​లోకి పల్లీ చట్నీ కామన్​ - ఓసారి "కరివేపాకు కారం పొడి" ట్రై చేయండి - టేస్ట్​ అదుర్స్​ - అన్నంలోకి పర్ఫెక్ట్​! - HOW TO MAKE CURRY LEAVES KARAM PODI

-నిమిషాల్లోనే అద్బుతమైన రుచి గ్యారెంటీ -ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు

How to Make Curry Leaves Karam Podi
How to Make Curry Leaves Karam Podi (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 22, 2024, 11:19 AM IST

How to Make Curry Leaves Karam Podi:ఇడ్లీ, దోశ, వడ.. ఇలా టిఫెన్​ ఏదైనా దానికి కాంబినేషన్​గా ఏదో ఒక చట్నీ ఉండాల్సిందే. మెజార్టీ పీపుల్​ వాటికి జోడిగా పల్లీ చట్నీ ప్రిపేర్​ చేస్తుంటారు. మరికొద్దిమంది నెయ్యి, కారం పొడితో తింటుంటారు. ఎందుకంటే చట్నీతో పోలిస్తే కారం పొడులు రుచికరంగా ఉంటాయి. అయితే కారం పొడులంటే ఎన్నో రకాలు. అన్నీ కూడా ఎంతో రుచికరంగా ఉండేవే. అలాంటి వాటిలో కరివేపాకు కారం పొడి ఒకటి. దీన్ని ఎంతో మంది ఎన్నో రకాలుగా చేసుంటారు. కానీ ఈ పద్ధతిలో మాత్రం ఎప్పుడూ చేసుండరు. ఇడ్లీ, దోశ, వడ వంటి టిఫెన్స్​లోకి కాకుండా.. అన్నంలోకి కూడా ఈ పొడిని వాడుకోవచ్చు. నెయ్యితో తింటే ఇంకా రుచికరంగా ఉంటుంది. మరి, ఇక ఆలస్యం చేయకుండా సింపుల్​గా ఈ కరివేపాకు కారం పొడి ఎలా చేయాలి ? దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఓసారి చూద్దాం..

కావాల్సిన పదార్థాలు:

  • నూనె - 2 టేబుల్​ స్పూన్లు
  • పచ్చి శనగపప్పు - 2 టేబుల్​ స్పూన్లు
  • మినపప్పు - 3 టేబుల్​ స్పూన్లు
  • ధనియాలు - 3 టేబుల్​ స్పూన్లు
  • ఎండు మిర్చి - 20
  • ముదురు కరివేపాకు -50 గ్రాములు
  • జీలకర్ర - 1 టీ స్పూన్​
  • చింతపండు - నిమ్మకాయంత
  • పసుపు - అర టీ స్పూన్​
  • ఉప్పు - రుచికి సరిపడా

తయారీ విధానం:

  • ముందుగా ముదురుగా ఉన్న కరివేపాకు తీసుకుని శుభ్రంగా కడిగి నీరు లేకుండా నీడకి ఆరబెట్టుకోవాలి. అలా పూర్తిగా తేమ పోయిన తర్వాత ఓ ప్లేట్​లోకి తీసుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి మంటను మీడియంలో ఉంచి నూనె వేసుకోవాలి. ఆయిల్​ హీటెక్కిన తర్వాత పచ్చి శనగపప్పు, మినపప్పు వేసి దోరగా, మంచి వాసన వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి.
  • ఆ తర్వాత ధనియాలు వేసి అవి కూడా బాగా వేగి సువాసన వచ్చే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి.
  • అనంతరం ఎండు మిర్చి వేసుకుని బాగా కలపాలి. అయితే ఇక్కడ కారం అనేది మీరు తీసుకునే ఎండు మిరపకాయలను బట్టి ఉంటుంది. కాబట్టి చూసి వేసుకోవాలి.
  • ఎండు మిర్చి వేగిన తర్వాత నీరు లేకుండా ఆరబెట్టుకున్న కరివేపాకు వేసి ఓ రెండు నిమిషాలకు మించి ఫ్రై చేసుకోవద్దు.
  • కరివేపాకు ఫ్రై అయిన తర్వాత స్టవ్​ ఆఫ్​ చేసే ముందు జీలకర్ర వేసి కలిపి దింపేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు మిశ్రమాన్ని చల్లారనివ్వాలి.
  • పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్​లోకి వేసుకుని చింతపండు, పసుపు, రుచికి సరిపడాఉప్పు వేసి మెత్తగా గ్రైండ్​ చేసుకోవాలి. అంతే ఎంతో స్పైసీగా టేస్టీగా ఉండే కరివేపాకు కారం పొడి రెడీ. దీన్ని మిక్సీలో కూడా రోట్లో దంచుకుంటే రుచి ఇంకా అద్దిరిపోతుంది.
  • దీన్ని గాలి చొరబడని డబ్బాలో స్టోర్​ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మరి నచ్చితే మీరూ ఈ పద్ధతిలో ట్రై చేయండి.

హోటల్ స్టైల్​ "కారం పొడులు" - కూరలు బోర్​ కొడితే ఇవి ట్రైచేయండి - నెయ్యితో కలిపి తింటే అమృతమే!

తెలంగాణ స్టైల్ "కోడిగుడ్డు వెల్లుల్లి కారం" - నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోండిలా - రెండు రోజులైనా ఫ్రెష్​గా ఉంటుంది!

ABOUT THE AUTHOR

...view details