LIVE : విశాఖలో నేవీ డే వేడుకలు - ప్రత్యక్ష ప్రసారం - NAVY DAY CELEBRATIONS AT VISAKHA

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jan 4, 2025, 4:17 PM IST

Updated : Jan 4, 2025, 6:18 PM IST

Navy Day Celebrations in Visakha Live : ఏటా డిసెంబర్ 4న భారత నౌకాదళ దినోత్సవం విశాఖలో జరపడం ఆనవాయితీ. ఈ సంవత్సరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సొంత రాష్ట్రమైన ఒడిశా రాష్ట్రం పూరీ తీరాన నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇవాళ విశాఖ సాగర తీరంలో నౌకాదళ దినోత్సవ కొనసాగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరయ్యారు. సాగర తీరాన ఆర్కే బీచ్​లో జరగుతున్న విన్యాసాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. శత్రువులపై దాడి చేసే సన్నివేశాలు తీరంలో యుద్ధ సన్నివేశాలను కళ్లకు కడుతున్నాయి. మరోపక్క సముద్రంలో చిక్కుకున్న సైనికులను కాపాడే విన్యాసాలు ఒళ్లు గగుర్పొడిచాయి. తీరానికి దగ్గరగా ఆకాశంలో పారాగ్లైడర్లు దూసుకెళ్తూ సందడి చేస్తున్నాయి.  మరోవైపు గగన తలంలో యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు సాగించిన విన్యాసాలు ప్రజలను అబ్బురపరుస్తున్నాయి. మెరైన్ కమెండోల​ విన్యాసాలు వీక్షకులను కట్టిపడేస్తున్నాయి. విశాఖలో నేవీ డే వేడుకలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం
Last Updated : Jan 4, 2025, 6:18 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.