ETV Bharat / state

11 ప్రాంతాల్లో టెలిమెట్రీ ఏర్పాటు చేయాలి - కేఆర్​ఎంబీ సమావేశంలో తెలంగాణ - KRMB BOARD MEETING IN HYDERBAD

హైదరాబాద్​లోని జలసౌధలో కేఆర్​ఎంబీ ఛైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలో బోర్డు సమావేశం - హాజరైన తెలుగురాష్ట్రాల ఉన్నతాధికారులు - మొత్తం 29 అంశాలతో కూడిన ఎజెండాపై కీలక చర్చలు

NAGARJUNA SAGAR
KRMB MEETING IN HYDERABAD (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 21, 2025, 3:09 PM IST

Updated : Jan 21, 2025, 4:52 PM IST

KRMB Board Meeting in Hyderabad : హైదరాబాద్ జలసౌధ వేదికగా కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం ముగిసింది. కేఆర్​ఎంబీ ఛైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. మొత్తం 29 అంశాలతో కూడిన అంశాలపై కీలక చర్చలు జరిగాయి. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణానదీ నీటి వాటాల పంపిణీ, బోర్డు నిర్వహణ, బడ్జెట్, రాష్ట్రాల నుంచి నిధులు, టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటు, బోర్డు కార్యాలయం తరలింపు, ప్రాజెక్టుల స్వాధీనం సహా ఇతర అంశాలపై ప్రధానంగా కీలక చర్చలు జరిగాయి.

"కృష్ణా నదీ జలాల మళ్లింపు విషయాన్ని బోర్డు సమావేశంలో ప్రస్తావించాం. కృష్ణానదీ జలాల్లో 66:34 నిష్పత్తిపై నిరసన తెలిపాం. 66:34 కొనసాగిస్తూనే పరిస్థితుల్ని బట్టి పెంచే ప్రయత్నం చేస్తామని ఛైర్మన్ చెప్పారు. తెలంగాణలో కృష్ణా నదీ పరీవాహక ప్రాంతం 71శాతం ఉంది. పరీవాహక ప్రాంతంలో 71శాతం మేరకు వాటా ఇవ్వాలి. అంతవరకూ కనీసం చెరి సగం నీరు ఇవ్వాలి. 11 ప్రాంతాల్లో టెలిమెట్రీ ఏర్పాటు చేయాలని కోరాం. టెలిమెట్రీ కోసం ప్రభుత్వంతో చర్చించి వారంరోజుల్లో స్పందిస్తామని ఏపీ ఈఎన్సీ చెప్పారు" -రాహుల్‌ బొజ్జా, తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి

నాగార్జున సాగర్​పై కేంద్ర బలగాలను తొలగించాలి : నాగార్జునసాగర్ నుంచి సీఆర్పీఎఫ్ బలగాలను ఉపసంహరించుకోవాలని కోరినట్లు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ అనిల్ కుమార్ తెలిపారు. అలాగే సమావేశంలో శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతుల అంశాన్ని ప్రస్తావించినట్లు వెల్లడించారు. డ్యామ్ స్లూయీజ్‌కు అవసరమైన మరమ్మతులు చేస్తామని కేఆర్​ఎంబీ హామీ ఇచ్చిందని పేర్కొన్నారు.

విజయవాడకు తరలింపు : కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని ఏపీలోని విజయవాడకు తరలించాలని ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వర రావు కోరారు. హైదరాబాద్‌లో ఇస్తున్నట్లుగానే అక్కడ కూడా ఉచితంగా కార్యాలయానికి ఉచిత వసతి ఇవ్వాలని బోర్డు ఛైర్మన్ సూచించారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానున్నట్లు ఏపీ ఈఎన్సీ తెలిపారు.

నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వాహణ : రెండు రాష్ట్రాల అభ్యంతరాలను ఈ సమావేశంలో అధికారులు చర్చించారు. ఈ మేరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు సంబంధిత అంశాలను ప్రతిపాదించాయి. నాగార్జున సాగర్ డ్యాం నిర్వహణ, టెయిల్ పాండ్ లోని నాలుగు టీఎంసీల నీటి వినియోగం. శ్రీశైలం ప్లంజ్ పూల్​కు మరమ్మత్తులు, ఆర్డీఎస్ ఆధునీకరణ, జల విద్యుత్ ఉత్పత్తి, సాగర్ ఎడమ కాలువ నష్టాలు, క్రాస్ లెవెల్స్ తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.

అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారు : ప్రాజెక్టులను అనుమతుల్లేకుండా నిర్మిస్తున్నారంటూ రెండు రాష్ట్రాలు చేసిన ఫిర్యాదులు, అభ్యంతరాలపై కూడా చర్చలో మాట్లాడారు. రాయలసీమ ఎత్తిపోతల, శ్రీశైలం కుడి కాలువ, ఆర్డీఎస్ కుడి కాలువ సహా ఇతర ప్రాజెక్టులపై తెలంగాణ అధికారులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. పాలమూరు - రంగారెడ్డి, నారాయణపేట - కొడంగల్, అచ్చంపేట ఎత్తిపోతల పథకాలతో పాటు కల్వకుర్తి సామర్థ్యం పెంపు సహా జల విద్యుత్ ఉత్పత్తిపై ఏపీ ప్రభుత్వం తరఫున అధికారులు అభ్యంతరాలను లేవనెత్తారు. ఈ సమావేశంలో తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్​ బొజ్జా, ఈఎన్సీ అనిల్ కుమార్, ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వరరావు, బోర్డు సభ్య కార్యదర్శి రాయిపురే, మరో సభ్యుడు శంఖుహ ఇతర ఇంజినీర్లు పాల్గొన్నారు.

నాగార్జునసాగర్​ నుంచి నీరు తీసుకోవడం ఇక ఆపేయండి - ఏపీకి కేఆర్​ఎంబీ లేఖ - KRMB Orders AP to Stop Sagar Water

తెలంగాణ, ఏపీ తాగునీటి కోసం 9 టీఎంసీలు కేటాయించిన కేఆర్‌ఎంబీ - KRMB issued orders

Last Updated : Jan 21, 2025, 4:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.