Precautions to be Taken By Students Appearing for JEE Mains Exam : దేశవ్యాప్తంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించే జేఈఈ మెయిన్స్, బీఆర్క్ మొదటి విడత-2025 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జేఈఈ మెయిన్స్, పరీక్షలను ఈ నెల 22,23,24,28,29న, బీఆర్క్ పరీక్షను ఈ నెల 30న నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. సుమారు 6 వేల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. బుధవారం నుంచి పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులు పాటించాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు చూద్దాం.
జేఈఈ పరీక్ష రాస్తున్నారా? - ఐతే ఈ లేటెస్ట్ అప్డేట్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- పరీక్ష సమయం కంటే గంట ముందే కేంద్రానికి చేరుకోవాలి. ఉదయం 8.30, మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రధాన ద్వారాలు మూసేస్తారు. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ లోనికి అనుమతించరు. ఉదయం 7.30 నుంచి 8.30, మధ్యాహ్నం 1.30 నుంచి 2.30 గంటల మధ్య పరీక్షా కేంద్రాల వద్ద సిద్ధంగా ఉండాలి.
- ఖమ్మం, భద్రాద్రి జిల్లాలకు చెందిన కొంతమంది విద్యార్థులకు హైదరాబాద్, వరంగల్ లాంటి నగరాల్లో పరీక్షకేంద్రాలను కేటాయించారు. ఇలాంటి విద్యార్థులు ఒకరోజు ముందే అక్కడికి చేరుకొని చిరునామాలు కనుక్కోవటం మంచిది.
- పరీక్షకు దరఖాస్తు చేసిన తరువాత కన్ఫర్మేషన్ పేజీ వస్తుంది. దరఖాస్తు సమయంలో ఇచ్చిన ఫొటోలను మాత్రమే పరీక్ష రాసే సమయంలో తీసుకెళ్లాలి. లేకపోతే అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశముంటుంది.
- ఆధార్/ పాస్‌పోర్ట్/ రేషన్ కార్డు లేదా ఏదైనా ప్రభుత్వ గుర్తింపు (ఐడెంటిటీ) కార్డు తీసుకెళ్లాలి.
- రెండు పాస్‌పోర్టుసైజ్ ఫొటోలు, ట్రాన్స్‌పరెంట్ పెన్ను, అడ్మిట్ కార్డు, బీఆర్క్ పరీక్షకైతే పెన్సిల్, స్కేల్, రబ్బర్, జామెంట్రీ బాక్స్, వాటర్ బాటిల్ తీసుకెళ్లాలి.
- సాధారణ దుస్తులు, చెప్పులు ధరించాలి.
- మైనస్ మార్కులు ఉంటాయి కాబట్టి కచ్చితంగా తెలిసిన ప్రశ్నలకు మాత్రమే జవాలివ్వాలి. ఒక్క మార్కు తేడాతో జాతీయ స్థాయిలో సీటు కోల్పోయే ప్రమాదముంది. అందుకే ఈ విషయంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండి జవాబులు పెట్టాలి. ఊహించి జవాబులు పెట్టవద్దు.
- పరీక్షకు ముందు రోజు రసాయన శాస్త్రానికి సంబంధించి రివైజ్డ్‌బేస్డ్ ప్రశ్నలను పునశ్చరణ చేసుకుంటే కొంతవరకు ఒత్తిడి తగ్గుతుంది.
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షపై యూటర్న్ - మూడుసార్లు కాదు రెండుసార్లు మాత్రమే ఛాన్స్
జేఈఈ మెయిన్స్‌కు ప్రిపేర్ అవుతున్నారా? ఆ విషయంలో మీకో గుడ్ న్యూస్!