Besan Flour Benefits for Face: మనలో ఇంట్లో లభించే శనగపిండితో అనేక రకాల చర్మ సమస్యల్ని తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు చుండ్రు సమస్య పరిష్కారానికి దోహదం చేస్తుందని వివరిస్తున్నారు. అయితే, వాస్తవానికి మన పూర్వ కాలంలో మెరిసే చర్మం కోసం శనగపిండినే ఉపయోగించేవారు. కానీ, ఆ తర్వాత మార్కెట్లోకి రకరకాల సౌందర్య ఉత్పత్తుల రాకతో దీని వినియోగం తగ్గింది. ఈ నేపథ్యంలోనే శనగపిండితో శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
- నీళ్లు లేదా పెరుగుతో శనగపిండి కలిపి చర్మంపై రాసుకోవాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల చర్మంపై మురికిని తొలగించి, రంధ్రాలు తెరుచుకునేలా చేస్తుందని నిపుణులు అంటున్నారు. దీంతో చర్మం సహజంగానే మెరుసుస్తుందని వివరిస్తున్నారు.
- ఈ పిండిలో కొద్దిగా పాలు, పసుపు వేసి ముఖానికి రాసుకోవడం మంచి ఫలితం ఉంటుందని అంటున్నారు. దీంట్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలను, వాటి ద్వారా వచ్చే వాపును తగ్గిస్తాయని చెబుతున్నారు. 2011లో Journal of Pharmacy Researchలో ప్రచురితమైన "Antimicrobial activity of gram flour against human pathogens" అనే అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది. ()
- ఇంకా శనగపిండిని రోజ్ వాటర్‌తో కలిపి ముఖానికి రాసుకుంటే మృతకణాలు తొలగి చర్మ సహజంగా తాజాగా మెరుస్తుందని నిపుణులు అంటున్నారు.
- కీరాదోస గుజ్జు, పెరుగుతో కలిపి ముఖానికి పట్టిస్తే.. ఎండ తాకిడి, కాలుష్యం వల్ల చర్మంపై ఏర్పడే మచ్చలు, దద్దుర్లు, తగ్గి చర్మం తాజాగా కనిపిస్తుందని నిపుణులు వివరిస్తున్నారు.
- శనగపిండిలో కొద్దిగా నీళ్లు పోసి పేస్టులా కలిపి ఈ మిశ్రమాన్ని తలకు రాసుకోవాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల మురికి తొలగిపోవడంతో పాటు జుట్టుకు మంచి కండీషనర్గాను పని చేస్తుందని వివరిస్తున్నారు.
- యాంటీ ఫంగల్ గుణాలు శనగపిండిలో సమృద్ధిగా ఉంటాయని నిపుణులు చెబుుతున్నారు. కొబ్బరినూనె, నిమ్మరసం, శనగపిండిని రాసుకోవడం వల్ల చుండ్రు సమస్య అదుపులోకి వస్తుందని వివరిస్తున్నారు.
- ఇంకా ఈ పిండిలో ఉండే ప్రోటీన్ జుట్టు వేగంగా పెరిగేందుకు తోడ్పడుతందని నిపుణులు చెబుతున్నారు. ఆలివ్ ఆయిల్లో శనగపిండిని కలిపి రాసుకుంటే కురులు దృఢంగా మారతాయని వివరిస్తున్నారు.
- అయితే, మీ చర్మానికి, జుట్టుకి శనగపిండి నప్పుతుందా లేదా అని ప్రయత్నించి చూశాకే ఈ ప్యాకులు ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మీరు శాకాహారులైతే వీటిని ఎక్కువగా తీసుకోవాలట! అవేంటో తెలుసా?
చైనా కొత్త వైరస్ ఎలా సోకుతుంది? లక్షణాలు ఏంటి? నివారణ ఎలా? చికిత్స ఏదైనా ఉందా?