తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

క్రిస్పీ అండ్​ స్పైసీ "గోధుమపిండి కారప్పూస మిక్చర్​" - ఇలా చేస్తే ఎక్కువ రోజులు తాజాగా - టేస్ట్​ సూపర్​!

-శనగపిండితో మాత్రమే కాదు గోధుమపిండితో రుచికరమైన కారప్పూస -ఇలా చేసి పెడితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు

Wheat Flour Spicy Sev Mixture
Wheat Flour Spicy Sev Mixture (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 31, 2024, 2:27 PM IST

How to Make Wheat Flour Spicy Sev Mixture:పిల్లలైనా, ఉద్యోగులైనా, ఇంట్లో ఉండే పెద్దలైనా.. ఈవెనింగ్ టైమ్​లో ఏదో ఒక స్నాక్ తినాలనిపిస్తుంది. అలానే.. కొందరికి అప్పుడప్పుడు నోటికి ఏదైనా కాస్త పుల్లగా, కారంగా తినాలనిపిస్తుంది. అలాంటి సందర్భాల్లో చాలా సింపుల్​గా కారప్పూస మిక్చర్​ ప్రిపేర్​ చేసుకోండి. టేస్ట్​ అద్దిరిపోతుంది. సాధారణంగా కారప్పూసను శనగపిండితో చేస్తుంటారు. అయితే ఇక్కడ మాత్రం శనగపిండి ప్లేస్​లో గోధుమపిండి ఉపయోగించాలి. దీనిని ఈ పద్ధతిలో చేసి స్టోర్​ చేసుకుంటే ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు హ్యాపీగా తినేయొచ్చు. మరి ఈ స్నాక్​ ఐటమ్​ ప్రిపేర్​ చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు:

  • గోధుమ పిండి - 2 కప్పులు
  • బియ్యప్పిండి - అర కప్పు
  • కారం - అర టీ స్పూన్​
  • ఉప్పు - రుచికి సరిపడా
  • పసుపు- పావు టీ స్పూన్​
  • ఇంగువ- పావు టీ స్పూన్​
  • ఆయిల్​ - 2 టీ స్పూన్లు

మిక్చర్​ కోసం:

  • కరివేపాకు - 2 రెమ్మలు
  • పల్లీలు- పావు కప్పు
  • పుట్నాల పప్పు - పావు కప్పు
  • జీడిపప్పు - 7
  • వెల్లుల్లి - 5
  • కార్న్​ఫ్లేక్స్​ - పావు కప్పు
  • కారం - 1 టీస్పూన్​
  • ఉప్పు- పావు టీ స్పూన్​

తయారీ విధానం:

  • ముందుగా స్టీమ్​ బౌల్​ తీసుకుని అందులో కాటన్​ క్లాత్​ను పరచుకోవాలి. ఇప్పుడు ఆ క్లాత్​లోకి గోధుమ పిండి, బియ్యప్పిండి వేసి క్లాత్​ను క్లోజ్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​ మీద గిన్నె పెట్టి అందులో రెండు గ్లాసుల నీళ్లు పోసుకుని వేడి చేసుకోవాలి.
  • నీళ్లు వేడెక్కిన తర్వాత ఈ స్టీమ్ బౌల్​ను దానిపై ఉంచి మూత పెట్టాలి. స్టవ్​ను మీడియం టు హై ఫ్లేమ్​లో అడ్జస్ట్​ చేసుకుని పది నిమిషాలు ఆవిరిపై ఉడికించాలి.
  • ఆ తర్వాత స్టీమ్​ బౌల్​ నుంచి కాటన్​ క్లాత్​ను తీసుకుని మరో ప్లేట్​లో పెట్టుకుని చల్లారనివ్వాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు పిండిలో ఉండలు లేకుండా కలపాలి. ఆ తర్వాత ఈ పిండిని మరో గిన్నెలోకి జల్లించుకోవాలి.
  • ఇప్పుడు అందులోకి కారం, ఉప్పు, పసుపు, ఇంగువ, నూనె వేసుకుని బాగా కలపాలి. ఆ తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని చపాతీ ముద్ద లాగా కలుపుకోవాలి.
  • కారప్పూస మేకర్​లో సన్నటి రంధ్రాలు కలిగిన బిళ్లను వేసుకోవాలి. అందులోకి గోధుమ పిండిని పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి డీప్​ ఫ్రైకి సరిపడా నూనె పోసుకుని వేడి చేసుకోవాలి.
  • ఆయిల్​ వేడెక్కిన తర్వాత మేకర్​ సాయంతో కారప్పూస మాదిరి ఒత్తుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్​లో పెట్టి రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. పిండి మొత్తాన్ని ఈ విధంగా చేసుకుని పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు అదే నూనెలో కరివేపాకు వేసి ఫ్రై చేసుకుని ప్లేట్​లోకి తీసుకోవాలి. అనంతరం పల్లీలు వేసి వేయించుకోవాలి.
  • ఆ తర్వాత పుట్నాల పప్పు వేసి ఓ రెండు నిమిషాలు వేయించిన తర్వాత జీడిపప్పు వేసి వేయించి పక్కకు తీసుకోవాలి.
  • ఆ తర్వాత కొద్దిగా దంచిన వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకోవాలి. అనంతరం కార్న్​ఫ్లేక్స్​ వేసి వేయించుకోవాలి.
  • ఇప్పుడు కారప్పూసను చేతితో నలుపుకోవాలి. అందులోకి ఉప్పు, కారం, వేయించిన వెల్లుల్లి వేసి బాగా కలపాలి.
  • ఆ తర్వాత వేయించిన పల్లీలు, పుట్నాల పప్పు, జీడిపప్పు, కార్న్​ఫ్లేక్స్​, కరివేపాకు వేసి బాగా కలపాలి. అంతే ఎంతో రుచికరంగా ఉండే గోధుమపిండి కారప్పూస మిక్చర్​ రెడీ. దీనిని గాలి చొరబడని డబ్బాలో స్టోర్​ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.
  • తినాలనిపించినప్పుడు కొద్దిగా గిన్నెలోకి తీసుకుని అందులోకి కొద్దిగా నిమ్మరసం వేసుకుంటే రుచి ఇంకా బాగుంటుంది. మరి నచ్చితే మీరూ ఓ సారి ట్రై చేయండి.

సూపర్​ స్నాక్​ రెసిపీ "కోడిగుడ్డు కజ్జికాయలు" - ఈ పద్ధతిలో చేస్తే ఒక్కటీ మిగలదు!

"గుంట పొంగనాలు + పచ్చిమిర్చి పచ్చడి" డెడ్లీ కాంబినేషన్ - ఈజీగా ప్రిపేర్ చేసుకోండిలా - టేస్ట్ అద్దిరిపోతుంది!

కరకరలాడే "ఎగ్ కట్​లెట్స్" - నిమిషాల్లో ఇలా ప్రిపేర్ చేసుకోండి - టేస్ట్ వేరే లెవల్​ అంతే!

ABOUT THE AUTHOR

...view details