Cleaning Tips for Walls :వెలుగుల పండగ దీపావళి కోసం అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఇంటిని శుభ్రం చేయడం, ఇంట్లోని పరుపులు, బెడ్ షీట్లు, సోఫాసెట్లు క్లీనింగ్ చేసే పనిలో నిమగ్నమై ఉంటారు. అయితే, పండగ సమయంలో ఇళ్లు అందంగా కనిపించాలంటే.. ఇంట్లోని వస్తువులను క్లీన్చేయడంతో పాటు, గోడలను కూడా మెరిపించాలి. అప్పుడే ఇళ్లు దీపాల కాంతులతో పండగనాడు వెలిగిపోతుంది. అందుకోసం కొన్ని టిప్స్ తీసుకొచ్చాం. ఈ టిప్స్ పాటించి సింపుల్‌గా గోడలపైన ఉన్న జిడ్డు, నూనె మరకలను తొలగించండి. ఇంతకీ అవేంటంటే..
నీటితో కడగొద్దు :కొంతమంది గోడలపై నీళ్లు పోసి శుభ్రం చేస్తుంటారు. కానీ, ఎప్పుడూ ఇలా చేయకూడదు. దీనివల్ల గోడలపై ఉన్న పేయింట్ పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి గోడలపై ఉన్న దుమ్మును బ్రష్ లేదా డస్టర్‌తోశుభ్రంచేయడానికి ప్రయత్నించండి. పైన సీలింగ్‌ను క్లీన్ చేసేటప్పుడు ఫర్నీచర్‌పై ఏదైనా వస్త్రం కప్పి ఉంచండి.
గోడలపై క్రెయాన్స్ మరకలు మాయం చేయండిలా :కొంత మంది పిల్లలు గోడలపై క్రెయాన్స్, పెన్సిల్‌తో గీతలు గీస్తుంటారు. అవి క్లీన్ చేస్తే ఓ పట్టాన పోవు. అయితే, వెనిగర్‌తో ఈజీగా ఈ మరకలను తొలగించుకోవచ్చంటున్నారు నిపుణులు. ముందుగా వెనిగర్, నీటిని సమాన పరిమాణంలో తీసుకోవాలి. ఈ లిక్విడ్‌లో స్పాంజ్ ముంచి.. తర్వాత గట్టిగా పిండాలి. ఇప్పుడు స్పాంజ్‌తో క్రెయాన్స్ గీతలున్న చోట రాయాలి. ఒక నిమిషం తర్వాత మెత్తని వస్త్రంతో తుడిస్తే సరి. మరకలు ఈజీగా తొలగిపోతాయి. గీతలు, మరకలు ఎక్కువగా ఉంటే ఈ మిశ్రమంలో కొద్దిగా నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు.