Chopping Boards Cleaning Tips : ప్రస్తుత రోజుల్లో చాలా మంది కూరగాయలు, నాన్‌వెజ్ ఫుడ్స్, పండ్లుఇలా ఏవి కట్ చేసుకోవాలన్నా ఎక్కువగా చాపింగ్ బోర్డ్స్ యూజ్ చేస్తుంటారు. అయితే, చాపింగ్ బోర్డ్స్ వాడే క్రమంలో వాటిపై కత్తిగాట్లు, కూరగాయల మరకలు, మచ్చలు పడుతుంటాయి. కాబట్టి, వీటిని వాడాక సరిగ్గా శుభ్రం చేయకపోతే కత్తిగాట్ల చాటున సూక్ష్మక్రీములు దాగి ఉండే అవకాశం ఉంటుంది. దాంతో వాటిని మళ్లీ అలాగే వాడడం వల్ల కట్ చేసిన పదార్థాల్లోకి క్రీములు చేరి ఆరోగ్యానికి హాని కలిగించవచ్చంటున్నారు నిపుణులు. కాబట్టి, చాపింగ్ బోర్డ్స్ ఎప్పటికప్పుడు క్లీన్‌గా ఉంచుకోవడం చాలా అవసరమంటున్నారు. మరి, ఏ రకమైన చాపింగ్ బోర్డుని ఎలా క్లీన్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
చెక్కవి :ఎక్కువ మంది వుడెన్ చాపింగ్ బోర్డ్స్ వాడుతుంటారు. వీటిని యూజ్ చేసిన ప్రతిసారీ క్లీన్ చేసుకోవాలంటున్నారు నిపుణులు. అందుకోసం దానిపై కొద్దిగా లిక్విడ్ డిష్‌వాష్ వేసి, స్క్రబర్‌తో బాగా రుద్దాలి. ఆపై గోరువెచ్చని నీటితో వాష్ చేసుకోవాలి. ముఖ్యంగా ఈ చాపింగ్ బోర్డ్‌పై గీతలు లాంటివి ఉంటే మరీ జాగ్రత్తగా కడగాలి. లేదంటే బ్యాక్టీరియా చేరే ప్రమాదం ఉంటుందని గుర్తుంచుకోవాలి.
ఒకవేళ డిష్వాష్లో ఉండే కెమికల్స్‌తో భయమనిపిస్తే ఇలా క్లీన్ చేసుకోండి. చాపింగ్ బోర్డు మీద కాస్త ఉప్పు చల్లి, సగం కోసిన నిమ్మకాయతోబాగా రుద్దండి. ఆపై 5 నిమిషాలు పక్కనుంచి వాష్ చేసుకుంటే చాలు. కూరగాయలు, మాంసం తాలూకూ వాసనలు కూడా ఈజీగా తొలగిపోతాయంటున్నారు నిపుణులు. అలాగే, వీటిని డిష్‌వాషర్‌లో పెట్టకూడదు. నీటిలోనూ 5 నిమిషాలకు మించి నాననివ్వకూడదు. తడి తుడిచి, ఎండలో ఆరబెట్టుకొని ఆపై యూజ్ చేయడం మంచిదంటున్నారు.
ప్లాస్టిక్వైతే ఇలా క్లీన్ చేసుకోండి!
ప్లాస్టిక్ కటింగ్ బోర్డు వాడుతున్నట్లయితే కూరగాయలు, పండ్లు కోసే ముందు కూడా ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ఇక కోసిన తరవాత అయితే ఒక చిన్న బౌల్లో సమాన పరిమాణంలో వినెగర్, బేకింగ్‌సోడాతీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆపై దాన్ని చాపింగ్ బోర్డుకి అప్లై చేసి 5 నిమిషాలు పక్కనుంచాలి. ఆ తర్వాత సబ్బునీళ్లతో శుభ్రం చేసుకుంటే సరి.