ETV Bharat / offbeat

నోరూరించే "దమ్ పనీర్ హండీ" - బిర్యానీ, పులావ్, రోటీల్లోకి కిర్రాక్ కాంబో! - PANEER DUM HANDI RECIPE

ఎప్పుడూ రుచి చూడని పనీర్​ రెసిపీ - ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు!

DUM PANEER HANDI RECIPE
Paneer Dum Handi Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 6, 2025, 2:59 PM IST

Paneer Dum Handi Recipe : పనీర్‌తో ఏం చేసినా ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటుంటారు. రోటీ, చపాతీ, పూరీ, పులావ్‌, బిర్యానీ ఇలా దేనికైనా నప్పే పనీర్‌తో ఎప్పుడూ రొటీన్ రెసిపీలే కాకుండా ఓసారి ఈ సరికొత్త రెసిపీని ట్రై చేయండి. అదే, "దమ్ పనీర్ హండీ". మంచి ఫ్లేవర్స్​తో భలే టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. ఇంటికి గెస్ట్​లు వచ్చినప్పుడు దీన్ని చేసి పెట్టారంటే మస్త్ థ్రిల్​ అవుతారు. అంతేకాదు, వీకెండ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి ఇది సూపర్​గా ఉంటుంది. మరి, ఈ సూపర్ టేస్టీ కర్రీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • ఉల్లిపాయ చీలికలు - 1 కప్పు
  • నెయ్యి - 3 టేబుల్​స్పూన్లు
  • పనీర్ క్యూబ్స్ - 200 గ్రాములు
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • పుదీనా ఆకులు - కొన్ని
  • ధనియాల పొడి - 1 టీస్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా
  • వేయించిన జీలకర్ర పొడి - అరటీస్పూన్
  • కారం - 1 టీస్పూన్
  • పసుపు - పావుటీస్పూన్
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ - అరటేబుల్​స్పూన్

మసాలా పేస్ట్ కోసం :

  • జీడిపప్పు పలుకులు - 3 టేబుల్​స్పూన్లు
  • చిరోంజి పప్పు - 2 టేబుల్​స్పూన్లు
  • బాదం - 2 టేబుల్​స్పూన్లు
  • కర్బూజ గింజలు - 2 టేబుల్​స్పూన్లు
  • యాలకులు - 2
  • దాల్చిన చెక్క - అంగుళం ముక్క
  • లవంగాలు - 4
  • పెరుగు - పావు కప్పు
  • పచ్చిమిర్చి - 3

కర్రీ కోసం :

  • నెయ్యి - 3 టేబుల్​స్పూన్లు
  • లవంగాలు - 3
  • యాలకులు - 2
  • దాల్చిన చెక్క - అంగుళం ముక్క
  • బిర్యానీ ఆకు - 1
  • కుంకుమ పువ్వు - చిటికెడు

నోరూరించే రెస్టారెంట్ స్టైల్ "పనీర్ బిర్యానీ" - సింపుల్​గా ప్రిపేర్ చేసుకోండిలా!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా స్టౌపై పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. అది కాస్త వేడెక్కాక ఉల్లిపాయ చీలికలు వేసుకొని బాగా వేయించి పక్కకు తీసుకోవాలి.
  • ఆ తర్వాత మిగిలిన నేతిలో పనీర్ ముక్కలను వేసి లో-ఫ్లేమ్ మీద రెండు వైపులా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆపై వాటిని ఒక ప్లేట్​లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై మరో పాన్ పెట్టుకొని జీడిపప్పు పలుకులు, చిరోంజి పప్పు, బాదం, కర్బూజ గింజలు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని లో ఫ్లేమ్ మీద కర్బూజ గింజలు చిట్లేంత వరకు వేయించుకోవాలి.
  • అనంతరం మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్న జీడిపప్పు మిశ్రమం, పావు కప్పు మీగడతో ఉన్న పెరుగు, పచ్చిమిర్చితో పాటు తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్​లా మిక్సీ పట్టుకొని పక్కనుంచాలి.

ఇంట్లోనే దాబా స్టైల్ "పనీర్‌ దోప్యాజా" కర్రీ - ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టరంతే!

  • ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ముందుగా ఫ్రై చేసుకున్న పనీర్ ముక్కలు, మిక్సీ పట్టుకున్న జీడిపప్పు పేస్ట్, ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర తరుగు, ఉప్పు, ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి, కారం, పసుపు వేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ పనీర్​ ముక్కలకు పట్టేలా నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత అల్లంవెల్లుల్లి పేస్ట్, ముప్పావు కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని మరోసారి చక్కగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
  • అనంతరం స్టౌపై మరో పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. అది కరిగి వేడెక్కాక లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసి కాసేపు వేయించాలి.
  • ఆ తర్వాత మసాలాలన్నీ పట్టించిన పనీర్ ముక్కల మిశ్రమం వేసి కలిపి 3 నుంచి 4 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి.
  • అలా వేయించాక కుంకుమ పువ్వును నలిపి వేసుకోవాలి. ఆ తర్వాత లిడ్(మూత) చుట్టూ దమ్ బయటకి పోకుండా మైదా పిండిని పెట్టి ఆపై దాన్ని బౌల్​పై ఉంచి గట్టిగా సీల్ చేసుకోవాలి.
  • ఇప్పుడు మీడియం ​టూ లో-ఫ్లేమ్​ మీద ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. అందుకు 12 నుంచి 15 నిమిషాల టైమ్ పట్టొచ్చు.
  • అప్పుడు మూత తీసి గ్రేవీ చిక్కగా అనిపిస్తే మరో 2 టేబుల్​స్పూన్ల వాటర్ వేసుకొని కలిపి ఒక ఉడుకు ఉడికించుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే "పనీర్ దమ్ హండీ" కర్రీ రెడీ!

రెస్టారెంట్​ స్టైల్ "పనీర్​ ఫ్రైడ్​ రైస్" - ఇలా చేస్తే పిల్లలు వదలరు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.