ETV Bharat / offbeat

దువ్వెన జిడ్డుగా, నల్లగా మారిపోయిందా? - ఇలా క్లీన్ చేస్తే కొత్తదానిలా తళతళా మెరుస్తుంది! - HAIR COMB CLEANING TIPS

- ఈ చిన్న టిప్స్​ ఫాలో అవ్వండి - మిలామిలా మెరిసిపోతుంది!

HOW TO CLEAN A COMB EASILY
Hair Comb Cleaning Tips (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 6, 2025, 1:47 PM IST

Hair Comb Cleaning Tips : నచ్చిన హెయిర్​స్టైల్​లో జుట్టు అందంగా కనిపించడం వెనుక దువ్వెన లేదా హెయిర్​ బ్రష్​లు మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. అయితే, మనలో చాలా మంది హెయిర్​స్టైల్ పూర్తవగానే వాటిని అలానే పక్కన పడేస్తారు. మళ్లీ తల దువ్వుకోవాలనుకున్నప్పుడు తప్ప అవి గుర్తుకురావు. ఫలితంగా పేరుకుపోయిన దుమ్ము, ధూళి, చుండ్రు వంటివాటితో అవి మురికిగా మారుతుంటాయి. ఈ క్రమంలోనే చాలా మంది మురికిగా మారిన దువ్వెనలను క్లీన్ చేయడం పెద్ద ప్రాసెస్​గా భావిస్తుంటారు. మరికొందరైతే వాటిని పారేసి కొత్తవి కొనడం చేస్తుంటారు. కానీ, మీకు తెలుసా? ఈ టిప్స్​తో నిమిషాల్లో మురికిగా ఉన్న దువ్వెనలు/హెయిర్ బ్రష్​లను కొత్తవాటిలా మెరిపించవచ్చంటున్నారు నిపుణులు. మరి, ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మురికిగా ఉన్న దువ్వెనతో తల దువ్వుకుంటే చుండ్రు, జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. అందుకే, తరచుగా ఉపయోగించే దువ్వెన/హెయిర్ బ్రష్​లను వారం లేదా పది రోజులకోసారైనా శుభ్రం చేసుకోవడం తప్పనిసరి అంటున్నారు.

సింపుల్​గా క్లీన్ చేసుకోండిలా!

ముందుగా దువ్వెనలో ఉన్న తెగిపోయిన లేదా ఊడిపోయిన హెయిర్​ని టూత్‌పిక్ సాయంతో బయటకు తీసేయాలి. ఒకవేళ హెయిర్‌బ్రష్ అయితే టూత్‌పిక్‌తో తీయడం ఇబ్బందిగా ఉంటే పెన్ లేదా పెన్సిల్‌తో ముందుగా జుట్టుని లూజ్ చేయాలి. ఆపై కత్తెర సాయంతో వాటిని ఎక్కడికక్కడ కట్ చేసినట్లయితే టూత్‌పిక్‌తో ఈజీగా బయటకు తీసేయచ్చు.

ఇప్పుడు ఒక గిన్నెలో గోరువెచ్చని నీటిని తీసుకొని, అందులో బేబీ షాంపూ వేసి మురికిగా ఉన్న హెయిర్‌బ్రష్ లేదా దువ్వెనను కాసేపు నానబెట్టాలి. అనంతరం మెత్తని బ్రిజిల్స్ ఉన్న టూత్​బ్రష్‌ను తీసుకుని దాని మీద కొద్దిగా బేబీ షాంపూ వేసి దువ్వెనపై బాగా స్క్రబ్ చేయాలి. అలాగని మరీ గట్టిగా రుద్దొద్దు. ఎందుకంటే దువ్వెన /హెయిర్‌బ్రష్‌కు ఉండే బ్రిజిల్స్ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా రుద్దిన తర్వాత మళ్లీ గోరువెచ్చని నీటిలో బాగా కడిగి, పొడి టవల్ తీసుకుని దాంతో తుడిచి ఆరబెడితే సరి. మురికిగా ఉన్న దువ్వెనలు కొత్తవాటిలా కనిపిస్తాయంటున్నారు.

తలస్నానం చేయగానే జుట్టు దువ్వుతున్నారా? హెల్దీ హెయిర్​ కోసం ఈ టిప్స్ పాటించాలట!

వెనిగర్​ : ఈ టిప్​ కూడా దువ్వెనల మురికి వదిలించడంలో చాలా బాగా పనిచేస్తుంది. ఇందుకోసం ఒక చిన్న బౌల్​లో గోరువెచ్చని నీరు, వెనిగర్ అరకప్పు చొప్పున తీసుకుని దువ్వెన లేదా హెయిర్‌బ్రష్‌ను నానబెట్టాలి. అలా 15 నుంచి 20 నిమిషాలు నానబెట్టాక బయటకు తీసి షాంపూతో క్లీన్ చేసుకోవాలి.

  • ఇక్కడ మీరు వెనిగర్‌కు బదులుగా బేకింగ్ సోడానూ యూజ్ చేయవచ్చు. అయితే కొన్ని హెయిర్‌బ్రష్‌లు బేకింగ్ సోడాలో ముంచకూడదు. అది ముందుగా సరిచూసుకుని ఆపై వాటిని శుభ్రం చేయడానికి ఈ పద్ధతి అనుసరిస్తే బెటర్ అంటున్నారు నిపుణులు. లేదంటే మొత్తం వస్తువే పాడైపోయే ఛాన్స్ ఉంటుందని గమనించాలి.
  • ఇవన్నీ కాకుండా దువ్వెనను నీళ్లలో నానబెట్టి ఒక పాత టూత్​బ్రష్ తీసుకుని దానిపై టూత్‌పేస్ట్, షాంపూ, సబ్బు ఇలా ఏదైనా తీసుకుని దాంతో దువ్వెన/ హెయిర్‌బ్రష్‌ని బాగా క్లీన్ చేసుకోవాలి. అనంతరం కడిగేసి ఆరబెట్టుకున్నా సరిపోతుందంటున్నారు.
  • ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తల దువ్వుకున్న వెంటనే అందులో ఉన్న వెంట్రుకలు తీసేసి దువ్వెనను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం అన్నిటికంటే ఉత్తమమైన పని అంటున్నారు నిపుణులు.

స్ట్రయిట్ టు కర్లీ - ఎలాంటి హెయిర్​ బ్రష్​ వాడాలో మీకు తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.