ETV Bharat / lifestyle

మెత్తటి దూదిలాంటి 'ఖుష్బూ ఇడ్లీ- సాంబార్' తిన్నారా? ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్ గురూ! - KUSHBOO IDLI RECIPE IN TELUGU

-ఎప్పుడూ రొటీన్​గా ఇడ్లీ తింటున్నారా? -వెరైటీగా టేస్టీ ఖుష్బూ ఇడ్లీ సాంబార్ ట్రై చేయండి!

KUSHBOO IDLI RECIPE IN TELUGU
KUSHBOO IDLI RECIPE IN TELUGU (ETV Bharat)
author img

By ETV Bharat Lifestyle Team

Published : Feb 6, 2025, 3:35 PM IST

Kushboo Idli Recipe in Telugu: తమిళనాడులో హీరోయిన్ ఖుష్బూకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుది కాదు. ఏకంగా ఆమె కోసం గుడి కూడా కట్టేశారంటేనే అర్థం చేసుకోవచ్చు. అయితే, తమిళనాడులో ఖుష్బూ ఎంతో ఫేమసో.. ఖుష్బూ ఇడ్లీ కూడా అంతే ఫేమస్. మెత్తగా, తెల్లగా ఉండే ఈ ఇడ్లీని సాంబార్​తో తింటే అద్భుతంగా ఉంటుంది. మనం ఇంట్లో ఎప్పుడూ చేసుకునేలా కాకుండా వెరైటీగా ఖుష్బూ ఇడ్లీ ట్రై చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఖుష్బూ ఇడ్లీ, సాంబార్​ను ఎలా తయారు చేసుకోవాలి? అందులోకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్ధాలు

  • రెండు కప్పుల ఇడ్లీ బియ్యం
  • అర కప్పు మినపప్పు
  • పావు కప్పు సగ్గుబియ్యం
  • రుచికి సరిపడా ఉప్పు

తయారీ విధానం

  • ముందుగా బియ్యం తీసుకుని శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత మినపప్పు, సగ్గుబియ్యం కూడా ఇలానే కడిగి పక్కకు పెట్టుకోవాలి.
  • ఆ తర్వాత ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసి మూత పెట్టి సుమారు 8 గంటల పాటు నానబెట్టుకోవాలి.
  • అనంతరం వీటిలోని నీటిని తీసేసి తాజా నీటితో కడిగి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి.
  • ఇప్పుడు ఈ పిండిని బాగా కలిపి మూత పెట్టి రాత్రంతా పులియబెట్టాలి. ఆ తర్వాత మూత తీసి ఉప్పు వేసి కలపాలి.
  • ఆ తర్వాత స్టౌ ఆన్ చేసి ఈ పిండిని ఇడ్లీ పాత్రలో వేసుకుని ఉడకబెట్టుకుంటే టేస్టీ ఖుష్బూ ఇడ్లీ రెడీ!

ఇడ్లీ సాంబార్ తయారీ విధానం

మసాలా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు

  • అర టీ స్పూన్ నెయ్యి
  • ఒక టీ స్పూన్ శనగపప్పు
  • ఒక టీ స్పూన్ మినపప్పు
  • రెండు టీ స్పూన్ల ధనియాలు
  • పావు టీ స్పూన్ మెంతులు
  • ఒక టీ స్పూన్ జీలకర్ర
  • ఐదు ఎండుమిరపకాయలు
  • నాలుగు చిన్న ఉల్లిపాయలు
  • పావు టీ స్పూన్ ఇంగువ
  • 3 టేబుల్ స్పూన్ల తురిమిన పచ్చికొబ్బరి
  • సాంబార్ చేయడానికి కావాల్సిన పదార్థాలు:
  • అర కప్పు కందిపప్పు
  • పావు కప్పు పెసరపప్పు
  • ఒక టేబుల్​ స్పూన్ బెల్లం పొడి
  • ఒక టీ స్పూన్ ఉప్పు
  • ఒక టేబుల్ స్పూన్ నానపెట్టిన చింతపండు
  • రెండు టమాటాలు
  • 2 పచ్చిమిరపకాయలు
  • పావు టీ స్పూన్ పసుపు
  • ఒక టీ స్పూన్ కారం
  • ఒక టీ స్పూన్ నెయ్యి
  • ఒక కప్పు చిన్న ఉల్లిపాయలు
  • ఒక ములక్కాడ ముక్కలు
  • రుచికి సరిపడా ఉప్పు

తాలింపు వేయడానికి కావాల్సిన పదార్థాలు:

  • అర టీ స్పూన్ నెయ్యి
  • అర టీ స్పూన్ ఆవాలు
  • అర టీ స్పూన్ మినపప్పు
  • అర టీ స్పూన్ జీలకర్ర
  • రెండు ఎండుమిరపకాయలు
  • పావు టీ స్పూన్ ఇంగువ
  • 2 రెబ్బల కరివేపాకులు

తయారీ విధానం:

  • ముందుగా ఒక గిన్నెలో కందిపప్పు, పెసరపప్పు వేసి నీళ్లు పోసి పది నిమిషాలు నానపెట్టుకోవాలి.
  • అ తర్వాత స్టౌ ఆన్ చేసి ఒక పాన్​లో నెయ్యి వేసి శననగపప్పు, మినపప్పు, ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, చిన్న ఉల్లిపాయలు, ఇంగువ, తురిమిన కొబ్బరి ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించుకోవాలి.
  • ఇప్పుడు వేయించిన పదార్థాలన్నిటినీ ఒక మిక్సీలో వేసి.. బెల్లం పొడి, ఉప్పు, నానపెట్టిన చింతపండు, నీళ్లు వేసి మెత్తగా అయ్యేట్టు రుబ్బుకోవాలి.
  • అనంతరం స్టౌ పైన కుక్కర్​ పెట్టి అందులో నానపెట్టిన పప్పు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, పసుపు, కారం, నీళ్లు పోసి అన్నీ కలిపి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి.
  • మరోవైపు ఒక వెడల్పాటి కడాయిలో నెయ్యి వేసి అందులో చిన్న ఉల్లిపాయలు, తరిగిన ములక్కాడలు వేసి వేయించి కొంచెం ఉప్పు వేసి కలపాలి.
  • అ తర్వాత ఇందులోనే నీళ్లు పోసి పాన్​పై మూత పెట్టి పది నిమిషాలు మరిగించాలి.
  • ఇప్పుడు ఇందులోనే రుబ్బుకున్న మసాలా పేస్టును వేసి కలపి ఐదు నిమిషాలు మరిగించుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమంలో ఉడికించిన పప్పుని వేసి కలిపి నీళ్లు పోయాలి.
  • ఈ సమయంలోనే రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి 7 నిమిషాలు మరిగించుకుని దించేసి పక్కకుపెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపైన ఒక చిన్న గిన్నెలో నెయ్యి వేసి అందులో ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకులు వేసి వేయించుకోవాలి.
  • ఇప్పుడు స్టౌ ఆఫ్ చేసి దీనిని తాళింపును సాంబార్లో వేసి కలిపితే హోటల్ స్టైల్ ఇడ్లీ సాంబార్ రెడీ.

'గుంటూరు చికెన్ మసాలా' ఎప్పుడైనా తిన్నారా? ఇలా చేస్తే ముక్క కూడా మిగల్చరు! వెరైటీగా తినండి!!

ఆదివారం అద్దిరిపోయే మటన్ కుర్మా- ఇలా చేస్తే ఎవరైనా ఇష్టంగా తినేస్తారు! మీరు ట్రై చేయండి!!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.