Telangana PECET and EDCET Notification Released : తెలంగాణలో పీఈ సెట్, ఎడ్ సెట్ షెడ్యూల్‌ను ప్రకటనను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. మార్చి 12న పీఈ సెట్ నోటిఫికేషన్‌ను జారీ చేయనున్నారు. మార్చి 15 నుంచి మే 24 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అపరాధ రుసుంతో మే 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకొనేందుకు అవకాశం కల్పించినట్లు ఉన్నత విద్యా మండలి తెలిపింది. జూన్ 11 నుంచి 14 వరకు పీఈ సెట్ పరీక్షలు జరగనున్నాయి.
తెలంగాణ ఎడ్‌సెట్ నోటిఫికేషన్‌ను కాకతీయ యూనివర్సిటీ విడుదల చేసింది. మార్చి 10న ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మార్చి 12 నుంచి మే 13 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రకటనలో పేర్కొంది. జూన్ 1వ తేదీన ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు జరగున్నాయి.
తెలంగాణ పీజీ ఈసెట్ షెడ్యూల్ ఖరారు - జూన్ 16 నుంచి 19 వరకు పరీక్షలు
ఏకలవ్య పాఠశాల ఆరో తరగతి ప్రవేశాలు - కేవలం వారికి మాత్రమే ఛాన్స్