తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

నోరూరించే "బీరకాయ టమాట పచ్చడి" - ఇలా ప్రిపేర్ చేస్తే రుచికి రుచీ ఆరోగ్యానికి ఆరోగ్యం! - Beerakaya Tomato Chutney - BEERAKAYA TOMATO CHUTNEY

Beerakaya Tomato Roti Pachadi : మనలో చాలామందికి ఇడ్లీ, దోసె, వడ.. వంటి టిఫెన్స్‌లోకే కాదు.. భోజనంలోకీ వివిధ రకాల పచ్చళ్లను తినే అలవాటు ఉంటుంది. అలాంటి వారికోసం ఒక అద్భుతమైన చట్నీ తీసుకొచ్చాం. అదే.. నోరూరించే బీరకాయ టమాట రోటి పచ్చడి. మరి, దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

How to Make Beerakaya Tomato Pachadi
Beerakaya Tomato Roti Pachadi (ETV Bharat)

By ETV Bharat Features Team

Published : Sep 2, 2024, 5:30 PM IST

How to Make Beerakaya Tomato Pachadi : రోటి పచ్చడి పేరు చెబితే చాలు మనందరికీ నోరూరుతుంది కదూ! ఈ క్రమంలోనే చాలా మంది టమాట(Tomato), వంకాయ, దోసకాయ, దొండకాయ వంటి పచ్చళ్లు ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటుంటారు. కానీ, ఎప్పుడూ అవేకాకుండా ఈసారి వెరైటీగా ఈ పచ్చడి ట్రై చేయండి. టేస్ట్ అద్దిరిపోతుంది. పైగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అదే.. బీరకాయ టమాట రోటి పచ్చడి. మరి, ఈ హెల్దీ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • బీరకాయలు - పావుకిలో
  • టమాటలు - 2 (పెద్ద సైజ్​లో ఉన్నవి)
  • పచ్చిమిర్చి - 10 నుంచి 12
  • నూనె - 4 టేబుల్ స్పూన్లు
  • వెల్లిల్లి రెబ్బలు - 8
  • చింతపండు - కొద్దిగా
  • శనగపప్పు - 1 టీస్పూన్
  • మినప పప్పు - 1 టీస్పూన్
  • నువ్వులు - 2 చెంచాలు
  • జీలకర్ర - 1 టీస్పూన్
  • మెంతులు - అరటీస్పూన్
  • పసుపు - పావు టీస్పూన్
  • ఉప్పు - రుచికి తగినంత
  • కొత్తిమీర తరుగు - అరకట్ట

తాలింపు కోసం :

  • నూనె - కొద్దిగా
  • శనగపప్పు - 1 టీస్పూన్
  • మినప పప్పు - 1 టీస్పూన్
  • ఎండుమిర్చి - 2
  • కరివేపాకు - రెమ్మ
  • ఇంగువ - పావు టీస్పూన్

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా ఫ్రెష్​గా ఉండే బీరకాయలను(Ridge Gourd)పొట్టు తీసుకుని శుభ్రంగా కడిగి చిన్న సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. అలాగే టమాటలను చిన్నముక్కలుగా కట్ చేసుకోవాలి. అదేవిధంగా కొత్తిమీరను తరిగిపెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త హీట్ అయ్యాక అందులో జీలకర్ర, మెంతులు, నువ్వులు, మినప పప్పు, శనగపప్పు వేసి దోరగా వేయించుకోవాలి.
  • ఆ తర్వాత అందులోనే పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలనూ వేసుకొని అవి కాస్త రంగు మారేంతవరకు వేయించుకోవాలి. ఆపై స్టౌ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని మరో గిన్నెలోకి ​తీసుకొని చల్లార్చుకోవాలి.
  • ఇప్పుడు మళ్లీ స్టౌ ఆన్ చేసుకొని పచ్చిమిర్చి వేయించిన పాన్ పెట్టుకొని మిగిలిన నూనె పోసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కాక ముందుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు, పసుపు వేసి కలిపి మూతపెట్టుకోవాలి.
  • ఆపై మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి బీరకాయ ముక్కలు సగం కంటే కాస్త ఎక్కువగా ఉడికే వరకు మగ్గించుకోవాలి.
  • అలా ఉడికాయనుకున్నాక.. మూతతీసి గరిటెతో కలిపి టమాట ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఆపై మూతపెట్టి మరోసారి మిశ్రమాన్ని కాసేపు ఉడికించుకోవాలి. అంటే.. బీరకాయ, టమాటా ముక్కలు సాఫ్ట్​గా ఉడకాలి. అప్పుడే పచ్చడి టేస్టీగా ఉంటుంది.
  • ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసి ఒకసారి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఆపై అందులో బీరకాయ, టమాట మిశ్రమం, చింతపండు, కొత్తిమీర తరుగు వేసుకొని మరోసారి మిశ్రమాన్ని కాస్త బరకగానే మిక్సీ పట్టుకోవాలి.
  • అయితే, ఇక్కడ మీరు మిక్సీకి బదులుగా రోలు వాడితే పచ్చడి టేస్ట్ ఇంకా బాగుంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఒకవేళ మీరు రోట్లో రుబ్బుకుంటే మాత్రం.. ముందుగా రోట్లో పచ్చిమిర్చి మిశ్రమం వేసి కాస్త కచ్చాపచ్చాగా దంచుకొని ఆపై బీరకాయ మిశ్రమం, చింతపండు, కొత్తిమీర తరుగు వేసుకొని రుబ్బుకుంటే సరిపోతుంది.
  • ఈ విధంగా పచ్చడిని రుబ్బుకున్నాక తాలింపు పెట్టుకుంటే చాలు. ఇందుకోసం స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అది కాస్త వేడయ్యాక.. శనగపప్పు, మినప పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి కాసేపు వేయించుకోవాలి.
  • అనంతరం ఈ తాలింపును ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చడిలో వేసుకుని మిక్స్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే "బీరకాయ టమాటా పచ్చడి" మీ ముందు ఉంటుంది!

ఇవీ చదవండి :

జామకాయలను నేరుగా తినడమే కాదు - ఇలా పచ్చడి ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్​ వేరే లెవల్​!

నోరూరించే 'వంకాయ టమాట పచ్చడి' - ఇలా ప్రిపేర్ చేశారంటే టేస్ట్​ అదుర్స్​!

ABOUT THE AUTHOR

...view details