Daaku Maharaaj Release Trailer : నందమూరి నటసింహం బాలకృష్ణ త్వరలో 'డాకు మహారాజ్'గా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన లీడ్ రోల్లో వస్తున్న యాక్షన్ మూవీ సంక్రాంతి కానుకగా సందడి చేయనుంది. ఈ క్రమంలో తాజాగా మూవీ టీమ్ ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేసింది. ఫుల్ ఆన్ యాక్షన్ మోడ్‌లో ఉన్న ఈ చిత్రం మాస్ ఆడియెన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది.
"అనగనగా ఓ రాజు ఉండేవాడు. చెడ్డవాళ్లంతా ఆయన్ను డాకు అనేవారు. కానీ మాకు మాత్రం ఆయన మహారాజు.", "ఈ ఆడవిలో ఎన్నో మృగాలున్నాయని భయపడుతున్నాం, ఏ ఎలుగుబంటో పులో వస్తే ఇక్కడ కింగ్ ఆఫ్ జంగిల్ ఉన్నాడమ్మా" అంటూ బాలయ్యను ఎలివేట్ చేసే డైలాగ్స్ మూవీకే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి.
ఇక 'డాకు మహారాజ్' విషయానికి వస్తే సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేశారు. బాబీ దేవోల్, చాందిని చౌదరి, బాబీ దేఓల్, రవి కిషన్ తదితరులు నటించారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌లో మేకర్స్ ఫుల్ బిజీగా ఉన్నారు. తాజాగా దల్లాస్లో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. దీనికోసం చిత్రబృందం అక్కడికి చేరుకోగా, వారికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. అయితే అక్కడి ఈవెంట్ తర్వాత ఇండియాలోనూ రెండు ఈవెంట్లను నిర్వహించనున్నారు మేకర్స్. జనవరి 7న హైదరాబాద్‌లో, 9న ఏపీలో జరగనున్నట్లు వెల్లడించారు.
కాగా, రీసెంట్గా ప్రెస్మీట్లో పాల్గొన్న నిర్మాత నాగవంశీ సినిమాపై మాట్లాడుతూ అంచనాలు అమాంతం పెంచేశారు. గత 20-30 ఏళ్లలో ఎన్నడూ కనిపించనంత కొత్తగా బాలయ్య ఈ సినిమాలో కనిపిస్తారని అన్నారు. ఆయన కెరీర్లో డాకూ మహారాజ్ ఎప్పటికీ నిలిచిపోయే సినిమా కానుందని పేర్కొన్నారు. ఇది వర్త్ వెయిటింగ్ (Worth Waiting) సినిమా అని అన్నారు.
బాలయ్య ఎనర్జీ అన్‌స్టాపబుల్ - ఒక్క డూపును కూడా ఆయన వాడలేదు : డైరెక్టర్ బాబీ