Sweet Potato Halwa Recipe:మహా శివరాత్రి పండగ రోజున ఈశ్వరుడిని ప్రార్థిస్తూ ఉపవాసం చేసి పండ్లు లాంటి సాత్విక ఆహారం తీసుకుంటారు. అందులో ముఖ్యంగా చిలగడ దుంప తినడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు. అయితే, వీటిని చాలా మంది ఉడకబెట్టుకుని తింటుంటారు. కానీ ఇలా రెగ్యులర్‌గా కాకుండా వెరైటీగా ఎప్పుడైనా హల్వా చేసుకున్నారా? ఈ దుంపను హల్వాలా చేసుకుని ఉపవాసం చేసి తినడంతో పాటు ప్రసాదంలా కూడా పెట్టుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఇందులోకి కావాల్సిన పదార్థాలు ఏంటి? తయారీ విధానం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు:
- అర కిలో చిలకడదుంపలు (ఉడికించినవి)
- ఒక టీ స్పూన్ నెయ్యి
- కొద్దిగా జీడిపప్పులు
- కొద్దిగా బాదంపప్పులు
- కొద్దిగా కిస్మిస్లు
- ఒక టేబుల్ స్పూన్ నూనె లేదా నెయ్యి
- ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు
- పావు కప్పు పంచదార
- చిటికెడు కుంకుమపువ్వు (ఆప్షనల్)
- అర టీ స్పూన్ కుంకుమపువ్వు
తయారీ విధానం
- ముందుగా చిలగడ దుంపను తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.
- అనంతరం ఓ గిన్నెలో నీళ్లు, చిలకడ దుంపలు వేసి స్టౌ ఆన్ చేసి ఉడికించాలి.
- దుంపలు మెత్తగా ఉడికిన స్టౌ ఆఫ్ చేసి చల్లారబెట్టి పొట్టు తీసి గుజ్జును చిన్నగా తురుముకోవాలి.
- మరోవైపు స్టౌ ఆన్ చేసి ఓ పాన్‌లో ఒక టీ స్పూన్ నెయ్యి వేసి బాదం, జీడిపప్పు, కిస్మిస్లు వేసి వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి.
- ఆ తర్వాత అదే పాన్‌లో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి తురిమిన చిలకడ దుంపను వేసి వేయించుకోవాలి. (మీ అవసరాన్ని బట్టి ఇంకా కొంచెం నెయ్యిని కలుపుకోవచ్చు)
- అనంతరం ఇందులోనే కాచి చల్లార్చిన పాలు పోసి బాగా కలిపి సుమారు 10 నిమిషాలు ఉడికించుకోవాలి.
- ఇప్పుడు చక్కెర వేసి బాగా కలపాలి (చిలగడ దుంప తీపి ఆధారంగా చక్కెరను కలిపితే బాగుంటుంది)
- ఆ తర్వాత కుంకుమ పువ్వు, యాలకుల పొడి వేసి బాగా కలపాలి (మీకు ఇష్టమైతే ఇంకా కొంచెం నెయ్యి వేసుకోవచ్చు)
- అనంతరం ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్‌ను ఇందులో వేసి బాగా కలపాలి.
- ఇక చివర్లో వేయంచిన డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసుకుంటే చిలగడ దుంప హల్వా రెడీ!
శివరాత్రికి ఉపవాసం ఉంటున్నారా? ఇలా చేస్తే ఎన్ని లాభాలో మీకు తెలుసా?
శివరాత్రికి చిలగడ దుంపకి లింక్ ఏంటో తెలుసా? - ఆ రోజున ఎందుకు తింటారంటే!